TG LPCET 2026 నోటిఫికేషన్ విడుదల, ITI విద్యార్థులకు పాలిటెక్నిక్‌లో నేరుగా 2వ సంవత్సరంలో అడ్మిషన్ అవకాశం
TG LPCET 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ITI పూర్తి చేసిన విద్యార్థులకు పాలిటెక్నిక్ లో లేటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
TG LPCET 2026 నోటిఫికేషన్ విడుదల వివరాలు (TG LPCET 2026 Notification Release Details):తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ చదవాలనుకునే ఐటీఐ (ITI) పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (SBTET) ద్వారా TG LPCET 2026 (లాటరల్ ఎంట్రీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదల కావడం వల్ల 2026–27 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశం తీసుకునే అవకాశాన్ని ఇచ్చింది. ప్రత్యేకంగా ఐటీఐ పూర్తి చేసిన వారికి ఇది కీలక దశ.ఈ పరీక్ష ద్వారా వారు డిప్లోమా కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదికి తమ చదువును వేగంగా కొనసాగించవచ్చు.
అర్హతల విషయంలో, అభ్యర్థులు ITIలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. ఎంపికకోసం డిప్లోమా ఎంట్రన్స్ టెస్ట్ (DET) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో పొందిన ర్యాంక్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటాయో వారికి మంచి కళాశాలలలో వచ్చిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ పరీక్షకు సీరియస్‌గా సిద్ధం కావడం ముఖ్యం, ఎందుకంటే ఇది భవిష్యత్తు విద్యా మరియు ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుంది.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbtet.telangana.gov.in వద్ద అప్లికేషన్ ఫారం నింపాలి. దరఖాస్తు ఫీజు సాధారణ అభ్యర్థులకు రూ.300గా, SC/ST అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించారు. అప్లికేషన్ సమర్పించిన తర్వాత హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసి పరీక్షకు హాజరుకావాలి. పరీక్ష ఫలితాల తర్వాత పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్లు ఇస్తారు, కాబట్టి అభ్యర్థులు ప్రతి దశను జాగ్రత్తగా పూర్తి చేయాలి.
TG LPCET 2026 ముఖ్యమైన తేదీలు (TG LPCET 2026 Important Dates)
TG LPCET 2026 ఈ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ క్రింది పట్టికలో అభ్యర్థులు చూడవచ్చు.
వివరాలు | తేదీలు |
TG LPCET 2026 దరఖాస్తుల ప్రారంభం | మార్చి 16,2026 |
TG LPCET 2026 ఫీజు చెల్లింపు చివరి తేదీ (లేట్ ఫీజు లేకుండా ) | ఏప్రిల్ 20,2026 |
రూ. 100 లేట్ ఫీజు తో చివరి తేదీ | ఏప్రిల్ 21,2026 |
దరఖాస్తు సవరణకు అవకాశం | ఏప్రిల్ 22,2026 |
TG LPCET 2026 పరీక్ష తేదీ | మే 15,2026 |
పరీక్ష సమయం మొత్తం 2 గంటలు ఉంటుంది. ఈ సమయంతో అభ్యర్థులు తమ ప్రతిభను పూర్తిగా చూపించేలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. మెరిట్ మార్కులు మరియు అభ్యర్థుల ఇచ్చే ప్రాధాన్యాల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు,అంటే మంచి ర్యాంక్ సాధిస్తే ఇష్టమైన కాలేజ్, కోర్సు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పరీక్షకు ముందే సరిగా ప్రిపేర్ అవ్వడం, కౌన్సెలింగ్ సమయంలో ఆప్షన్లు జాగ్రత్తగా ఎంపిక చేయడం చాలా అవసరం. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటాయి.కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందు ఒకసారి పూర్తి సమాచారాన్ని పరిశీలించడం మంచిది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.