TG TET 2026 హాల్ టికెట్ ఎప్పుడు విడుదల అవుతుంది
TG TET 2026 హాల్ టికెట్ అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.హాల్ టికెట్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
TG TET 2026 హాల్ టికెట్ విడుదల సమయం (TG TET 2026 Hall Ticket Release Time): తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) 2026కు దరఖాస్తు చేసిన అభ్యర్థుల కోసం హాల్ టికెట్ అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. పరీక్షకు హాజరవాలంటే హాల్ టికెట్ తప్పనిసరి. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం TG TET 2026 హాల్ టికెట్‌ను పరీక్షకు కొన్ని రోజుల ముందే ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, జన్మతేదీ వంటి వివరాలు నమోదు చేసి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్‌లో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం చిరునామా, పేపర్ వివరాలు వంటి ముఖ్య సమాచారం ఉంటుంది. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారులను సంప్రదించడం అవసరం.
పరీక్ష రోజు హాల్ టికెట్ ప్రింట్ కాపీతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు (ఆధార్, పాన్ కార్డు మొదలైనవి) తీసుకువెళ్ళాలి. హాల్ టికెట్ లేకుండా పరీక్ష హాల్‌లోకి అనుమతి ఇవ్వరు. కాబట్టి విడుదలైన వెంటనే డౌన్‌లోడ్ చేసి రెండు లేదా మూడు కాపీలు ప్రింట్ తీసుకుని భద్రంగా ఉంచుకోవడం మంచిది.
TG TET 2026 హాల్ టికెట్ అంచనా సమయం (TG TET 2026 Hall Ticket Estimated Time)
TG TET 2026 హాల్ టికెట్ ను ఈ నెలలో నే డిసెంబర్ చివరి వారం లో విడుదలయ్యే అవకాశం ఉంది TG TET 2026 అంచనా విడుదల సమయాన్ని ఈ క్రింద టేబుల్ పట్టికలో ఇవ్వబడింది.
వివరాలు | తేదీ & సమయం |
TG TET 2026 విడుదల తేదీ | డిసెంబర్ 27,2025 |
అంచనా విడుదల సమయం 01 | ఉదయం 10:00 గంటలకు |
అంచనా విడుదల సమయం 02 | మధ్యాహ్నం 12:00 గంటలకు |
అంచనా విడుదల సమయం 03 | సాయంత్రం 6:00 లోపు |
TG TET 2026 ఆన్‌లైన్‌లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసే విధానం (How to download TG TET 2026 hall ticket online)
TG TET 2026 హాల్ టికెట్ విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ క్రింది దశల ద్వారా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ముందుగా అభ్యర్థులు అధికారిక tgtet.aptonline.in వెబ్‌సైట్‌కి వెళ్లండి
- ఆ తరువాత హోమ్‌పేజ్‌లో “Hall Ticket / Admit Card Download” లింక్‌పై క్లిక్ చేయండి
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేయండి
- తరువాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి
- హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి
- ప్రింట్ కాపీని పరీక్ష రోజు వరకు భద్రంగా ఉంచుకోండి
TG TET 2026కు సిద్ధమవుతున్న అభ్యర్థులు హాల్ టికెట్‌ను సమయానికి డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్ష కోసం అవసరమైన ఏర్పాట్లు ముందే చేసుకోవాలి. TG TET హాల్ టికెట్ 2026పై తాజా అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు తరచూ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చెయ్యాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
