TS POLYCET 2025 సీట్ కేటాయింపు ఫలితం దశ 1 ఈ రోజే విడుదల
TS POLYCET 2025 దశ 1 సీట్ కేటాయింపు ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్‌తో లాగిన్ అయి ఫలితాలు తెలుసుకోవచ్చు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
TS POLYCET 2025 దశ 1 సీట్ కేటాయింపు ఫలితాలు(TS POLYCET 2025 Phase 1 Seat Allotment Results): TS POLYCET 2025 ఫేజ్-1 సీట్ కేటాయింపు ఫలితాలు జూలై 4న విడుదల కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన tgpolycet.nic.inలో హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వంటి వివరాలతో లాగిన్ అయ్యి సీటు కేటాయింపు వివరాలు(TS POLYCET 2025 Phase 1 Seat Allotment Results)పొందవచ్చు. ఎవరికి ఏ పాలిటెక్నిక్ కళాశాలలో, ఏ కోర్సు కేటాయించబడిందో ఫలితాల్లో స్పష్టంగా ఉంటుంది. కేటాయింపు వచ్చిన తర్వాత అభ్యర్థులు ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనే మూడు ఎంపికలలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవచ్చు. జూలై 4 నుంచి 6వ తేదీ వరకు ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఫీజు చెల్లించని అభ్యర్థుల సీట్లు రద్దవుతాయి. తర్వాత ఫేజ్-2 కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
TS POLYCET 2025 దశ 1 సీట్ కేటాయింపు ఫలితాల ముఖ్యమైన తేదీలు(Important dates for TS POLYCET 2025 Phase 1 Seat Allotment Results)
TS POLYCET 2025 దశ 1 సీట్ కేటాయింపు ఫలితాల ముఖ్యమైన తేదీల గురించి ఇక్కడ క్రింద టేబుల్ పట్టికలో అందించాము చూడండి.
వివరాలు | తేదీలు |
వెబ్ ఆప్షన్లు ఫ్రీజ్ తేదీ | జూలై 1, 2025 |
ప్రోవిజనల్ సీట్ల కేటాయింపు తేదీ | జూలై 4, 2025 |
ఫీజు చెల్లింపు & సెల్ఫ్ రిపోర్టింగ్ | జూలై 4నుండి జూలై 6, 2025 |
TS POLYCET 2025 ఫలితాలు ఎలా చెక్ చేయాలి(How to check TS POLYCET 2025 results)
- ముందుగా అధికారిక tgpolycet.nic.in వెబ్‌సైట్ ని సందర్శించండి.
- ఆ తరువాత “Phase‑1 Seat Allotment” లింక్ పై క్లిక్ చేయండి.
- హాల్‌టికెట్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీతో లాగిన్ అవ్వండి
- మీకు అలొటెడ్ కాలేజ్ & కోర్సు ఫలితం స్క్రీన్‌లలో కనిపిస్తుంది.
- దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
TS POLYCET 2025 ఫీజు చెల్లింపు & సెల్ఫ్ రిపోర్టింగ్(TS POLYCET 2025 Fee Payment & Self Reporting)
- జూలై 4న మీరు సీట్ అంగీకరించినట్లుగా ఫీజు చెల్లించడం అవసరం.
- ఆ తర్వాతనే పేరు తిరిగి రిజిస్టర్ చేసిన కాలేజ్‌కి స్వయంగా రిపోర్ట్ చేయవచ్చు.
- ఫీజు చెల్లించకపోతే అలొటెడ్ సీట్ రద్దవుతుంది.
TS POLYCET 2025 ఫేజ్ 1 సీట్ కేటాయింపు ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ ఆలాట్‌మెంట్ స్టేటస్ తెలుసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు జూలై 6లోపు ఫీజు చెల్లించి, సీట్‌ను కన్ఫర్మ్ చేసుకోవాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.