UGC NET 2025 అడ్మిట్ కార్డ్ విడుదల, డిసెంబర్ 18న రెండు షిఫ్ట్‌లలో పరీక్ష
NTA డిసెంబర్ సెషన్‌కు సంబంధించిన UGC NET అడ్మిట్ కార్డ్ 2025ను అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్ష తేదీ, షిఫ్ట్, కేంద్రం వివరాలను తెలుసుకోవడానికి హాల్ టికెట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
UGC NET అడ్మిట్ కార్డ్ 2025 విడుదల (UGC NET Admit Card 2025 Released): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డిసెంబర్ సెషన్‌కు సంబంధించిన CSIR–UGC NET 2025 అడ్మిట్ కార్డులను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్లు csirnet.nta.nic.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్ విడుదలపై NTA కొన్ని ముఖ్య సూచనలు చేసింది. హాల్ టికెట్ జారీ అయినంత మాత్రాన అభ్యర్థి అర్హత ఖరారు అయినట్లు కాదని, తదుపరి దశల్లో అర్హతను పూర్తిగా పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
అధికారి షెడ్యూల్ ప్రకారం CSIR UGC NET 2025 పరీక్ష డిసెంబర్ 18, 2025న రెండు షిఫ్ట్‌లలో నిర్వహించబడుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు తమ కేటాయించిన షిఫ్ట్‌కి అనుగుణంగా ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్ష రోజున ఆలస్యం కాకుండా రిపోర్టింగ్ టైమ్‌ను పాటించడం చాలా ముఖ్యం.
UGC NET అడ్మిట్ కార్డ్ 2025 డౌన్‌లోడ్ లింక్ (UGC NET Admit Card 2025 Download Link)
డిసెంబర్ సెషన్‌కు సంబంధించిన UGC NET అడ్మిట్ కార్డ్‌ను అభ్యర్థులు ఈ క్రింది అధికారిక లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
UGC NET Admit Card 2025 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
UGC NET 2025 డిసెంబర్ సెషన్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌ను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేయాలి. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసేముందు ఈ క్రింద ఉన్న దశలను పాటించండి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.in ఓపెన్ చేయండి.
- ఆ తరువాత హోమ్‌పేజీలో కనిపించే “UGC NET Admit Card 2025 – December Session” లింక్‌పై క్లిక్ చేయండి.
- లాగిన్ పేజీలో మీ అప్లికేషన్ నంబర్ నమోదు చేయండి.
- తరువాత పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ (DOB) నమోదు చేయండి.
- అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసిన తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
- మీ UGC NET అడ్మిట్ కార్డ్ 2025 స్క్రీన్ లో ప్రదర్శించబడుతుంది.
- అడ్మిట్ కార్డ్‌లోని సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించండి.
- హాల్ టికెట్‌ను PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి.
- పరీక్షరోజు కోసం తప్పనిసరిగా ప్రింట్ అవుట్ తీసుకొని వెళ్ళండి.
UGC NET అడ్మిట్ కార్డ్ 2025లో ఉన్న వివరాలు (Details available in UGC NET Admit Card 2025)
UGC NET అడ్మిట్ కార్డు 2025లో అభ్యర్థి వ్యక్తిగత సమాచారం మరియు పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. హాల్ టికెట్‌లో పేర్కొన్న వివరాలు ఈ క్రింద ఉన్నాయి చూడండి.
- అభ్యర్థి పూర్తి పేరు
- రోల్ నంబర్
- అప్లికేషన్ నంబర్
- తండ్రి పేరు
- పుట్టిన తేదీ
- లింగం
- కేటగిరీ
- ఫోటో మరియు సంతకం
- దివ్యాంగుడు (అవును / కాదు)
- పరీక్ష తేదీ
- పరీక్ష షిఫ్ట్ (ఫస్ట్ / సెకండ్)
- రిపోర్టింగ్ టైమ్
- గేట్ క్లోజింగ్ టైమ్
- పరీక్ష సమయం
- అప్లై చేసిన సబ్జెక్ట్
- పరీక్ష కేంద్రం నంబర్
- పరీక్ష కేంద్రం పూర్తి చిరునామా
- ముఖ్యమైన పరీక్ష సూచనలు
ఏవైనా సమస్యలు ఎదురైతే సంప్రదించాల్సిన వివరాలు:
- 📞 NTA హెల్ప్‌డెస్క్ నంబర్: 011-40759000
- ఈ మెయిల్ ఐడి : csirnet@nta.nic.in
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
