TOSS Open Hall Ticket 2023: 16 నుంచి తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు, ఈ లింక్‌తో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Published On:

తెలంగాణ ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్  పరీక్షలు అక్టోబర్ 16 నుంచి జరగనున్నాయి. వీటికి సంబంధించిన హాల్ టికెట్లు (TOSS Open Hall Ticket 2023) విడుదలయ్యాయి. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలియజేశాం. 
TOSS Open Hall Ticket 2023: 16 నుంచి తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు, ఈ లింక్‌తో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిTOSS Open Hall Ticket 2023: 16 నుంచి తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు, ఈ లింక్‌తో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ 2023 (TOSS Open Hall Ticket 2023): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ SSC, ఇంటర్మీడియట్ పరీక్షలను 2023 అక్టోబర్ 16 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తుంది. ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 వరకు రెండు షిఫ్టులలో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు సంబంధిత వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో https://telanganaopenschool.org హాల్ టికెట్ (TOSS Open Hall Ticket 2023) విడుదలయ్యాయి. అభ్యర్థులు జిల్లా, స్కూల్ పేరు, అభ్యర్థి పేరు అందించడం ద్వారా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ దిగువున సంబంధిత లింక్‌ను అందజేస్తున్నారు.

TOSS ఓపెన్ ఎగ్జామ్ 2023 హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి

TOSS ఓపెన్ ఎగ్జామ్ 2023 వివరాలు (TOSS Open Exam 2023 Details)

తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ఈనెలలో జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ టేబుల్లో అందించడం జరిగింది.
ఎగ్జామ్ పేరు TOSS SSC, ఇంటర్మీడియట్ 2023
కండక్టింగ్ బాడీ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ
సెషన్ అక్టోబర్ 2023
పరీక్ష తేదీలు 16 నుంచి 26 అక్టోబర్ 2023
హాల్ టికెట్ విడుదల రిలీజ్ అయ్యాయి
అధికారిక వెబ్‌సైట్ telanganaopenschool.org

TOSS హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to download the TOSS Hall Ticket 2023?)

సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ లేదా ఇంటర్మీడియట్ పరీక్ష కోసం హాల్ టికెట్‌ను ఏ విధంగా డౌన్‌లోడ్ చేయాలో ఈ దిగువున వివరంగా తెలియజేశాం. అభ్యర్థులు వాటిని ఫాలో అవ్వొచ్చు.
  • ముందుగా అభ్యర్థులు telanganaopenschool.org/లో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి.
  • SSC హాల్ టికెట్లు, ఇంటర్ థియెరీ హాల్ టికెట్లు అని కనిపిస్తుంది. అభ్యర్థులు వారికి కావాల్సిన దానిపై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో అభ్యర్థి పేరు, స్కూల్ పేరు, జిల్లా వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి.
  • తర్వాత హాల్ టికెట్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TOSS SSC / ఇంటర్ హాల్ టికెట్ 2023 వివరాలు? (Details On TOSS SSC / Inter Hall Ticket 2023?)

పరీక్ష రాసేందుకు ప్రతి ఒక్కరి దగ్గర కచ్చితంగా హాల్ టికెట్‌ ఉండాలి. లేదంటే పరీక్ష హాల్‌లోకి అనుమతించడం జరగదు. హాల్ టికెట్ త్వరలో విడుదల కానుంది. హాల్ టికెట్‌పై ఉండే వివరాలు ఈ దిగువున అందజేశాం.
  • అభ్యర్థి పేరు
  • రిజిస్ట్రేషన్ సంఖ్య
  • హాల్ టికెట్ నెంబర్
  • పరీక్ష తేదీ
  • పరీక్ష సమయం
  • కోర్సు (SSC/ఇంటర్మీడియట్)
  • పరీక్షా కేంద్రం పేరు, కోడ్
  • పరీక్షా కేంద్రం చిరునామా
  • అభ్యర్థి ఫోటో
  • అభ్యర్థి సంతకం
  • పుట్టిన తేది
  • లింగము మగ ఆడ)
  • పరీక్ష లేదా సబ్జెక్ట్ కోడ్
  • పరీక్ష సూచనలు
  • రిపోర్టింగ్ సమయం
  • పరీక్ష వ్యవధి
  • పరీక్ష అధికారుల కోసం సంప్రదింపు సమాచారం
  • గుర్తింపు గుర్తులు లేదా వివరాలు
  • వర్గం లేదా కుల వివరాలు (వర్తిస్తే)
  • పరీక్ష కంట్రోలర్ సంతకం

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం ఈ లింక్‌పై https://www.collegedekho.com/te/news/ క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోండి

/news/toss-hall-ticket-2023-download-link-46129/

Do you have a question? Ask us.

  • Typical response between 24-48 hours

  • Get personalized response

  • Free of Cost

  • Access to community

Top