AP PGECET 2026 దరఖాస్తు గడువు పొడిగింపు, మార్చి 20 వరకు మరో అవకాశం
AP PGECET 2026 అప్లికేషన్ గడువును APSCHE అధికారులు మరోసారి పొడిగించారు. దరఖాస్తు గడువు తేదీ మార్చి 20,2026 వరకు పొడిగించారు. AP PGECET 2026 ఏప్రిల్ 28,29,30 తేదీల్లో పరీక్షలు నిర్వహించబడనున్నాయి.
AP PGECET 2026 దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు (AP PGECET 2026 application deadline extended once again):AP PGECET 2026 సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఈసారి దరఖాస్తు గడువును మరోసారి పొడిగించి అభ్యర్థులకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. మొదట నిర్ణయించిన గడువులో అప్లై చేయలేకపోయిన చాలా మంది విద్యార్థులు అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోబడిందని తెలిపారు. ఇప్పుడుమార్చి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా అప్లై చేయని వారికి ఇది మంచి అవకాశంగా నిలుస్తుంది.
ఈ పరీక్ష రాష్ట్రంలో PG కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునే విద్యార్థులకు చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ వంటి విభాగాల్లో M.Tech, M.Pharmacy, Pharm.D (PB) వంటి కోర్సుల్లో ప్రవేశాలు ఈ పరీక్ష ద్వారా జరుగుతాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు, అందుకే పోటీ కూడా గట్టిగానే ఉంటుంది. అందుకే అప్లికేషన్ మాత్రమే కాకుండా, ప్రిపరేషన్ మీద కూడా సమానంగా దృష్టి పెట్టడం అవసరం.
పరీక్ష తేదీలు కూడా అధికారులు ఖరారు చేశారు.ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.పరీక్ష పూర్తి గా కంప్యూటర్ ఆధారిత (CBT) మోడ్‌లో జరుగుతుంది. అభ్యర్థులు వారికి కల్పించిన స్లాట్ ప్రకారం పరీక్ష హాజరుకావాలి. మంచి ర్యాంక్ సాధిస్తే రాష్ట్రంలోని ప్రముఖ యూనివర్సిటీలు మరియు అనుబంధ కళాశాలల్లో సీటు పొందే అవకాశాలు ఉంటాయి.
AP PGECET 2026 అప్లికేషన్ లింక్ (AP PGECET 2026 Application Link)
AP PGECET 2026 దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు అధికారిక వెబ్‌సైట్ లింక్ క్రింద ఇవ్వబడింది
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌లో వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అవసరమైన వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించాలి.అభ్యర్థులు అప్లై చేసేముందు అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, సబ్జెక్టు ఎంపిక వంటి అంశాలను జాగ్రత్తగా చెక్ చేయాలి. చిన్న పొరపాట్లు కూడా తర్వాత సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
మొత్తానికి గడువు పొడిగింపుతో విద్యార్థులకు మరో మంచి అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని వృథా చేసుకోకుండా వెంటనే అప్లై చేసి, మిగిలిన సమయాన్ని పూర్తిగా ప్రిపరేషన్ కి వినియోగించడం మంచిది. సరైన ప్లానింగ్ తో చదివితే మంచి ర్యాంక్ సాధించడం కష్టమేమి కాదు. ఇప్పుడు ఫోకస్ అంత ప్రిపరేషన్ పైనే ఉండాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.