అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2026: ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం

manohar

Published On:

అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కి భారత సైన్యం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అవివాహిత యువత ఏప్రిల్ 2 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

Agniveer RecruitmentAgniveer Recruitment

అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2026: సైన్యంలో చేరే యువతకు గొప్ప అవకాశం (Agniveer Recruitment 2026: A great opportunity for youth to join the army): భారత సైన్యంలో సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న యువతకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ఒక మంచి అవకాశంగా నిలుస్తోంది. అగ్నివీర్ పధకం ద్వారా సైన్యంలో యువతను చేర్చుకునే ఈ ప్రక్రియలో భాగంగా, 2026 సంవత్సరానికి గాను అగ్ని వీర్ నియామకాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించినట్లు గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం ప్రకటించింది. ఫిబ్రవరి 13న అధికారిక నోటిఫికేషన్ విడుదల అవడంతో, ఫిబ్రవరి 15న గుంటూరు డైరెక్టర్ కర్నల్ రజత్ సువర్ణ ఈ విషయాన్ని అధికారంగా వెల్లడించారు. అర్హత కలిగిన అవివాహిత యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ పరిధిలోని అనేక జిల్లాలకు వర్తిస్తుంది. కర్నూలు, ఎస్పీ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి, మార్కాపురం జిల్లాలకు చెందిన యువత ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది అని అధికారులు స్పష్టం చేసారు.

అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భారత సైన్యం జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లార్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్ వంటి విభాగాల్లో నియామకాలు చేపడుతున్నారు. ఈ నియామకాల్లో పదో తరగతి,అలాగే ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకి కూడా అవకాశాలు కల్పించడం విశేషం. దీని వాళ్ళ వివిధ విద్యా స్థాయిలకు చెందిన యువత సైన్యంలో చేరే అవకాశం పొందుతోంది. అభ్యర్థులు తమ అర్హతల ఆధారంగా రెండు విభాగాలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. ఇది ఎంపిక అవకాశాలను పెంచడమే కాకుండా, సైన్యంలో చేరాలనే లక్ష్యంతో ఉన్న యువతకు ఇది ఒక ప్రోత్సాహకరమైన నిర్ణయంగా భావించవచ్చు. మొత్తంగా ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ యువతకు ఒక విసృత అవకాశంగా మారిందని చెప్పవచ్చు.

ఈ సారి అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ లో వయోపరితిని 21 నుంచి 22 ఏళ్లకు పెంచడం ద్వారా మరింత మంది యువతకు అవకాశం కల్పించారు.ఐటిఐ, డిప్లొమా, ఎన్సీసీ వంటి అదనపు అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో అదనపు మార్కులు ఇవ్వనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 2 చివరి తేదీగా నిర్ణయించినందున అభ్యర్థులు ఆలస్యం చేయకుండా ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అగ్ని వీర్ పథకం యువతకు దేశసేవతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాశం మరియు భవిష్యత్ అవకాశాలకు బలమైన పునాది వేస్తుందని వారు తెలిపారు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/agniveer-recruitment-2026-online-application-77671/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top