Andhra University Results 2023: ఈ లింక్‌తో ఏయూ ఇంజనీరింగ్, సైన్స్ కోర్సుల ఫలితాలను 2023 డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Updated On: August 09, 2023 02:59 PM

సైన్స్, ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాలను ఆంధ్రాయూనివర్సిటీ (Andhra University Results 2023) విడుదల చేసింది. ఈ ఆర్టికల్లో ఫలితాల లింక్‌తోపాటు, పూర్తి సమాచారాన్ని అందజేశాం. 
Andhra University Results 2023: ఈ లింక్‌తో ఏయూ ఇంజనీరింగ్, సైన్స్ కోర్సుల ఫలితాలను 2023  డౌన్‌లోడ్ చేసుకోండిAndhra University Results 2023: ఈ లింక్‌తో ఏయూ ఇంజనీరింగ్, సైన్స్ కోర్సుల ఫలితాలను 2023 డౌన్‌లోడ్ చేసుకోండి

ఆంధ్ర యూనివర్సిటీ ఫలితాలు 2023 (Andhra University Results 2023): ఆంధ్రా యూనివర్సిటీ సైన్స్, ఇంజనీరింగ్ కోర్సుల పరీక్షా ఫలితాలను 2023 (Andhra University Results 2023) విడుదలయ్యాయి. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://exams.andhrauniversity.edu.inలో అందుబాటులో ఉన్నాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు పొందిన గ్రేడ్, సబ్జెక్ట్ వారీగా పొందిన గ్రేడ్ పాయింట్లు, గ్రేడ్ పాయింట్ యావరేజ్, క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (CGPA) తెలుసుకోవడానికి AU ఫలితాలను చెక్ చేయాలి. అభ్యర్థులు తమ ఫలితాలు 2023ని చెక్ చేయడానికి రిజిస్టర్ నెంబర్‌ను నమోదు చేయాలి. వారు ఏకీకృత మార్కుల జాబితా, ఒరిజినల్ డిగ్రీని పరీక్ష కార్యాలయ కంట్రోలర్ నుంచి పొందవచ్చు. AU పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు సప్లై పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్షలో పాల్గొని, వారి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యార్థులందరూ కింద ఇవ్వబడిన లింక్ నుంచి వారి AU డిగ్రీ ఫలితాలను చెక్ చేయవచ్చు. కానీ దాన్ని చెక్ చేయడానికి మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. ఏయూ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సుల ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ చూడండి. అలాగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి లింక్ ఈ దిగువున అందజేయడం జరిగింది.

ఆంధ్రా యూనివర్సిటీ ఫలితాల 2023 లింక్

ఆంధ్రాయూనివర్సిటీ ఫలితాలు 2023 (Andhra University Result 2023)

ప్రతి సెమిస్టర్‌కు AU ఫలితం మిడ్-టర్మ్, ఎండ్-టర్మ్ పరీక్షలలో విద్యార్థుల పనితీరు ఆధారంగా తయారు చేయబడుతుంది.
ఆర్టికల్ కేటగిరి యూనివర్సిటీ ఫలితాలు
యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ
లోకేషన్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్
అధికారిక వెబ్‌సైట్ www.andhrauniversity.edu.in


ఆంధ్రా యూనివర్సిటీ విశ్వవిద్యాలయ అధికారులు ఏ విద్యార్థులకు వ్యక్తిగతంగా పోస్ట్ లేదా ఈ మెయిల్‌ల ద్వారా ఫలితాల హార్డ్ కాపీ లేదా సాఫ్ట్ కాపీని పంపించరు. విద్యార్థులు తమ AU డిగ్రీ ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. యూనివర్సిటీలకు సంబంధించిన అన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయబడ్డాయి. అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. AU సెమిస్టర్ ఫలితాల గురించి అవసరమైన మొత్తం సమాచారాన్ని పొందడానికి విద్యార్థులు క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయ పోర్టల్‌ను సందర్శిస్తుండాలి.

AU డిగ్రీ ఫలితాలు 2023ని ఎలా చెక్ చేయాలి? (How to check AU Degree Results 2023?)

ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఫలితాన్ని చెక్ చేయడానికి AU విద్యార్థులు ఈ దిగువ ఇవ్వబడిన విధానాన్ని అనుసరించవచ్చు.
  • ముందుగా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • అధికారిక వెబ్‌సైట్ హోమ్‌పేజీ స్క్రీన్‌పై కనిపించిన తర్వాత "పరీక్షలు" ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • AU పరీక్ష కంప్యూటరైజేషన్ సిస్టమ్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • "Result" లింక్‌పై క్లిక్ చేయాలి.
  • సంబంధిత ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • రిజిస్ట్రేషన్ నెంబర్‌ను నమోదు చేసి గెట్ మార్కులపై క్లిక్ చేయాలి.
  • ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • భవిష్యత్తులో సూచన కోసం ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/andhra-university-result-link-2023-43947/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top