AP Anganwadi Jobs 2023: పదో తరగతి అర్హతతో మహిళలకు ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్

Rudra Veni

Published On:

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలోని అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి (AP Anganwadi Jobs 2023) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతల గురించి ఈ ఆర్టికల్లో అందజేశాం. 
AP Anganwadi Jobs 2023: పదో తరగతి అర్హతతో మహిళలకు ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్AP Anganwadi Jobs 2023: పదో తరగతి అర్హతతో మహిళలకు ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్

ఏపీ అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్ 2023 (AP Anganwadi Jobs 2023): ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలోని అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టుల (AP Anganwadi Jobs 2023) భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో జిల్లాలోని అంగన్‌‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 57 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకి కేవలం మహిళల మాత్రమే అర్హులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలేంటో? ఇక్కడ తెలుసుకోండి.

అంగన్‌వాడీ పోస్టుల సంఖ్య (Total Number of Vacant Posts)

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో మొత్తం 57 అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఖాళీల వివరాలు ఈ దిగువ టేబుల్లో చూడొచ్చు.
అంగన్‌వాడీ కార్యకర్త 8
అంగన్‌వాడీ సహాయకురాలు 47
మినీ అంగన్‌వాడ్ వర్కర్ పోస్టులు 2
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 12, 2023


అంగన్‌వాడీ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు (Eligibility details to AP Anganwadi Jobs)

అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.
  • స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలై ఉండాలి
  • కచ్చితంగా వివాహితై ఉండాలి
  • పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి

ఈ ఉద్యోగాలకు మహిళలు కేవలం ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 12, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల్లలోపు సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయంలో నేరుగా గానీ లేదా పోస్టు ద్వారా గానీ అందజేయాలి. గడువు ముగిసిన తర్వాత అందిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించడం జరుగుతుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు మహిళలను ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు నెలకు రూ.11,500లు, మినీ అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు నెలకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు నెలకు రూ.7000ల వరకు జీతంగా చెల్లిస్తారు. మరిన్ని వివరాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు srisathyasai.ap.gov.in ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. అభ్యర్థులు తమ పూర్తి వివరాలను దరఖాస్తు ఫార్మ్‌లో పూరించి, సంబంధిత ధ్రువీకరణ పత్రాల జెరాక్స్‌ కాపీలని జత చేసి దానిపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి అప్లికేషన్‌లు అందజేయాలి. లేదా పోస్టులో పంపించాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/anganwadi-jobs-in-sri-sathya-sai-district-of-ap-39061/
FREE WORKSHOP

Claude Live Session by Experts

Practical · No theory · See it work live

Saturday, 6 June

11 AM – 1 PM

2 HOURS

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top