ANGRAU పాలిటెక్నిక్ డిప్లొమా 2025 కౌన్సెలింగ్,రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఎడిటింగ్‌కి ఈరోజే ఛాన్స్

manohar

Updated On: July 01, 2025 11:10 AM

ANGRAU పాలిటెక్నిక్ డిప్లొమా 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఎడిటింగ్ ప్రక్రియను జూలై 1, 2025తో ముగించనుంది. మొదటి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలోనే విడుదల చేయబడుతుంది.

ANGRAU పాలిటెక్నిక్ డిప్లొమా 2025 కౌన్సెలింగ్,రిజిస్ట్రేషన్ ఫారమ్ ఎడిటింగ్ జూలై 1న ముగియనుంది.ANGRAU పాలిటెక్నిక్ డిప్లొమా 2025 కౌన్సెలింగ్,రిజిస్ట్రేషన్ ఫారమ్ ఎడిటింగ్ జూలై 1న ముగియనుంది.

ANGRAU పాలిటెక్నిక్ డిప్లొమా 2025 కౌన్సెలింగ్ (ANGRAU Polytechnic Diploma 2025 Counselling): ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) పాలిటెక్నిక్ డిప్లొమా 2025 కౌన్సెలింగ్‌కు సంబంధించి అభ్యర్థులు రిజిస్టర్ చేసిన దరఖాస్తుల ఎడిటింగ్‌ను జూలై 1, 2025తో (ANGRAU Polytechnic Diploma 2025 Counselling)ముగించనుంది. అభ్యర్థులు ANGRAU పాలిటెక్నిక్ డిప్లొమా 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను అధికారిక వెబ్ పోర్టల్‌ polytechnicadmissionsangrau.aptonline.in ద్వారా హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో ఎడిట్ చేసుకోవచ్చు. 2/3 ఏళ్ల డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది జూన్ 30, 2025 గా నిర్ణయించబడింది.

ANGRAU పాలిటెక్నిక్ డిప్లొమా 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను సవరించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ANGRAU పాలిటెక్నిక్ డిప్లొమా 2025 కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లు సమర్పించిన అభ్యర్థులు, ఎవరైనా తప్పులు చేసినట్లయితే, తమ ఫారమ్‌లను సరిచేసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్ ఎడిట్ చేసుకునే అవకాశం ఒక్కసారే లభించనందున, అన్ని సవరణలు కచ్చితంగా చేయడం ముఖ్యం. ఎడిట్ చేసే సమయంలో అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్లు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఎడిటింగ్‌కు చివరి తేది జూలై 1, 2025. అభ్యర్థులు తమ దరఖాస్తు ఖచ్చితంగా ,పూర్తిగా ఉండేలా చూసుకుంటూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించబడుతుంది. మొదటి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో ప్రకటించబడనుంది.

ANGRAU 2025 పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు ప్రవేశాలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష లేకుండానే, పూర్తిగా పదవ తరగతి (SSC) మార్కుల ఆధారంగా నిర్వహించబడతాయి. ANGRAU ఆధ్వర్యంలో 20 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు మరియు 38 అనుబంధ కళాశాలలు ఉన్నాయి, ఇవి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి.అభ్యర్థులు తమ అర్హతను ముందుగానే ధృవీకరించుకోవాలి, ఎందుకంటే అర్హత లేని అభ్యర్థులకు సీటు నిరాకరించబడితే విశ్వవిద్యాలయం లేదా కళాశాలలు బాధ్యత వహించవు.ప్రవేశ ప్రక్రియ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరుగుతుంది. ఇందులో అభ్యర్థులు తాము కోరుకున్న కోర్సులు,పాలిటెక్నిక్ కళాశాలల ప్రాధాన్యతలను ఇవ్వవచ్చు. మెరిట్ ,ప్రవేశ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించబడతాయి.ఒక వ్యక్తి ఒక్కటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లయితే, అతని అభ్యర్థిత్వం,సీటు రద్దు అయ్యే అవకాశం ఉంది అనే విషయం స్పష్టంగా తెలియజేయబడింది.

ANGRAU పాలిటెక్నిక్ డిప్లొమా సంబంధిత సందేహాల కోసం అభ్యర్థులు ఈ 8008104977 నంబర్‌ను సంప్రదించండి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/పేమెంట్ సమస్యల కోసం ఈ 9000523420 నంబర్‌కు కాల్ చేయండి. ఈ మెయిల్(Gmail) : diploma.angrau@gmail.com

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/angrau-polytechnic-diploma-2025-counselling-registration-form-editing-closes-on-july-1-68178/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top