Ap 10th Results 2023 Date: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల ఎప్పుడంటే?

Rudra Veni

Published On:

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు శనివారంతో (ఏప్రిల్ 18) ప్రశాంతంగా ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. పదో తరగతి ఫలితాలు (Ap 10th Results  2023 Date)  ఎప్పుడు విడుదలవుతాయో ఈ ఆర్టికల్లో తెలుసుకోండి. 
Ap 10th Results  2023 Date: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల ఎప్పుడంటే?Ap 10th Results 2023 Date: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల ఎప్పుడంటే?

ఏపీ పదో తరగతి ఫలితాలు తేదీ 2023 (Ap 10th Results 2023 Date): ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు 18వ తేదీ వరకూ జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్రంలో 3,349 కేంద్రాల్లో 6.64 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్టు అధికారులు వెల్లడించారు. పరీక్షలు ముగియడంతో ఈ నెల 19వ తేదీ నుంచే ఆన్సర్ పేపర్లను దిద్దే కార్యక్రమం మొదలు కానుంది. రాష్ట్రంలో 23 జిల్లాలో 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు స్పాట్ వాల్యూయేషన్ జరగనుంది. 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు ఈ స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గోనున్నారు.

పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పరీక్షా ఫలితాలపై (Ap 10th Results 2023 Date) ఇప్పటికే అధికారులు క్లారిటీ ఇచ్చారు. వాల్యుయేషన్, ఇతర ప్రొసీడింగ్స్ కూడా పూర్తి చేసి మే రెండో వారంలో పదో తరగతి ఫలితాలు (Ap 10th Results 2023 Date)విడుదల చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

ఏపీ పదో తరగతి ఫలితాలు 2023 పూర్తి వివరాలు (AP 10th Results 2023 - Overview)

ఏపీ పదో తరగతి ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈవెంట్ పదో తరగతి ఫలితాలు (అంచనా)
ఎగ్జామ్ డేట్స్ ఏప్రిల్ 03 నుంచి 18, 2023
AP SSC పరీక్షల ఫలితాలు మే రెండో వారం, 2023

AP SSC స్పాట్ వాల్యూయేషన్ 2023 ప్రారంభం

మే 19, 2023
AP SSC సప్లిమెంటరీ పరీక్షలు జూన్, 2023 (అంచనా)

AP SSC ఫలితాలను ఎలా చెక్ చేయాలి? (How to Check AP SSC Results 2023?)

AP SSC 2023 పరీక్షా ఫలితాలను విద్యార్థులు ఆన్‌లైన్‌లో, SMS ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఏపీ పదో తరగతి ఫలితాలను ఎలా చెక్ చేయాలో? ఈ దిగువున తెలియజేయడం జరిగింది.
  • పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in కు వెళ్లాలి
  • స్క్రీన్ ఎడమ వైపున ఉండే AP SSC ఫలితం 2023 లింక్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఆ పేజీలో విద్యార్థులు రోల్ నెంబర్ నమోదు చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి
  • తర్వాత AP SSC ఫలితాలు 2023 కనిపిస్తాయి.
  • అభ్యర్థులు ఫలితాలను చూసుకుని భవిష్యత్తు ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ap-10th-class-result-2023-date-39278/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top