
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు (AP ANCHOR Company Jobs 2023):
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఎలక్ట్రికల్ వస్తువుల తయారీ సంస్థ ANCHOR సంస్థలో (AP ANCHOR Company Jobs 2023) ఉద్యోగాల భర్తీకి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ప్రకటన రిలీజ్ అయింది. మొత్తం 50 ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకోండి. ఈ ఉద్యోగాలకు (AP ANCHOR Company Jobs 2023) అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం డైరక్ట్ లింక్ ఈ దిగువున అందజేశాం.
AP ANCHOR కంపెనీలో ఉద్యోగాలకు రిజిస్టర్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ |
---|
AP ANCHOR కంపెనీ ఉద్యోగాల అర్హత వివరాలు (AP ANCHOR Company jobs Qualification Details)
ప్రముఖ కంపెనీ ANCHORలో ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలని భర్తీ చేస్తున్నారు. మొత్తం 50 పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు ఈ దిగువున అందజేయడం. అర్హతలను పరిశీలించి అభ్యర్థులు వెంటనే తమను తాము రిజిస్టర్ చేసుకోవచ్చు.- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా ఐటీఐ చేసి ఉండాలి. 2020-22 మధ్యలో పాసై ఉండాలి.
- కేవలం మగవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లలోపు ఉంండాలి.
- వార్షిక వేతనం రూ.1.80 లక్షలలోపు ఉండాలి.
AP ANCHOR ఉద్యోగాలకు అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు? (How Candidates are Selected for AP ANCHOR Jobs?
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సెలక్ట్ అయిన వారికి మంచి జీతంతో పాటు, సబ్సిడీపై క్యాంటీన్, ట్రాన్స్‌పోర్ట్, సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలి. అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవడానికి పైన అందించిన లింక్‌పై క్లిక్ చేయవచ్చు. ఇతర వివరాల కోసం 9154449677 నెంబర్లలో సంప్రదివచ్చు.ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి మంచి సేలరీ కూడా అందుతుంది. తి తక్కువ క్వాలిఫికేషన్‌తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. దీనికోసం ముందుగా అభ్యర్థులు ఇక్కడ అర్హతల వివరాలను ఇక్కడ తెలుసుకోండి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మేము అందించిన లింక్‌పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం ఈ https://www.collegedekho.com/te/news/ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



