AP DEECET వెబ్ ఆప్షన్ల 2025 నమోదుకు ఈరోజే చివరి ఛాన్స్

Rudra Veni

Updated On: July 12, 2025 12:01 PM

AP DEECET వెబ్ ఆప్షన్స్ 2025 (AP DEECET Web Options 2025) నమోదుకు ఈరోజు అంటే  జూలై 12న చివరి తేదీ. ఇంకా వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేయని అభ్యర్థులు వెంటనే ఫిల్ చేయాలి. లేదంటే ఈరోజు లింక్ డీయాక్టివేట్ అవుతుంది.  
 
AP DEECET వెబ్ ఆప్షన్ల  2025 నమోదుకు ఈరోజే చివరి ఛాన్స్AP DEECET వెబ్ ఆప్షన్ల 2025 నమోదుకు ఈరోజే చివరి ఛాన్స్

AP DEECET వెబ్ ఆప్షన్స్ 2025 (AP DEECET Web Options 2025) : AP DEECET వెబ్ ఆప్షన్స్ 2025 లింక్ ఈరోజు అంటే జూలై 12న డీయాక్టివేట్ అవుతుంది. వెబ్ ఆప్షన్‌ ప్రక్రియ జూలై 9న ప్రారంభమైంది. AP DEECETలో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ apdeecet.apcfss.in‌లో వెబ్ ఆప్షన్ లింక్ 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ లింక్‌తో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తమ పుట్టిన తేదీ, ఐడీ, క్యాప్చా ఎంటర్ చేసి పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. అనంతరం అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను ఎంట్రీ చేయాలి. ఇంకా పూర్తి చేయని అభ్యర్థులు వెంటనే తమ వెబ్ ఆప్షన్లను ఎంట్రీని పూర్తి చేయాలి.

AP DEECET వెబ్ ఆప్షన్స్ 2025 లింక్ (AP DEECET Web Options 2025 Link)

AP DEECET వెబ్ ఆప్షన్స్ 2025 కి డైరెక్ట్ లింక్ ఈ దిగువున పట్టికలో అందించాం.

AP DEECET వెబ్ ఆప్షన్స్ 2025 లింక్

AP DEECET వెబ్ ఆప్షన్లు : 2025లో ఎలా ఎక్సర్‌సైజ్ చేయాలి? (AP DEECET Web Options: How to Exercise 2025?)

అభ్యర్థులు తమ DEECET వెబ్ ఆప్షన్‌లను ఎంటర్ చేయడానికి ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి.
  • ముందుగా అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఆధారాలను ఉపయోగించి అధికారిక AP DEECET వెబ్‌సైట్ apdeecet.apcfss.inకు లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ అయిన తర్వాత అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్‌ను యాక్సెస్ చేయవచ్చు.
  • అప్లికేషన్‌లో అభ్యర్థులు అందుబాటులో ఉన్న కాలేజీలు, కోర్సుల జాబితాను చూడవచ్చు.
  • అభ్యర్థులు తాము అడ్మిషన్ కోసం పరిగణించాలనుకుంటున్న కాలేజీలు, కోర్సులను ఎంచుకోవడం ద్వారా వారి ప్రాధాన్యతలను జాగ్రత్తగా పూరించాలి.
  • ఎంపికలను పూరించిన తర్వాత, అభ్యర్థులు కచ్చితమైనవని, వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
  • ఎంపికలతో సంతృప్తి చెందిన తర్వాత, అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను సమర్పించవచ్చు. పేర్కొన్న సమయ వ్యవధిలోపు వాటిని సబ్మిట్ చేయడం చాలా ముఖ్యం.
AP DEECET వెబ్ ఆప్షన్ ప్రక్రియ చాలా కీలకమైనది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో అభ్యర్థులు కాలేజీల లొకేషన్, మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, ఇతర సంబంధిత అంశాల వంటి వివిధ అంశాల ఆధారంగా కాలేజీలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఫైనల్ ఎంపిక చేయడానికి ముందు కళాశాలల గురించి సమాచారాన్ని సేకరించడం చాలా అవసరం.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-deecet-web-options-2025-link-to-be-deactivated-today-68541/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top