ఈ తేదీల్లో AP DSC ఫలితాలు 2025 విడుదలయ్యే అవకాశం

Rudra Veni

Published On:

మా సబ్జెక్టు నిపుణులు గత సంవత్సరాల ట్రెండ్‌లను విశ్లేషించడం ద్వారా AP DSC ఫలితాలు 2025 అంచనా విడుదల తేదీని ఇక్కడ తెలియజేశాం.  DSC పరీక్షలు జూలై 2, 2025న ముగుస్తాయి. 

AP DSC Results 2025 Expected Release DateAP DSC Results 2025 Expected Release Date

AP DSC ఫలితాలు 2025 విడుదల తేదీ (AP DSC Results 2025 Expected Release Date) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, పరీక్ష ముగిసిన వెంటనే AP DSC ఫలితాలు 2025 ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. DSC 2025 పరీక్షలు ఇది జూలై 2, 2025న ముగుస్తాయి. గత ట్రెండ్‌ల ఆధారంగా పరీక్ష ముగిసిన 7 నుంచి 10 రోజుల్లోపు ఫలితాలు వెల్లడవుతాయని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల, AP DSC ఫలితాలు 2025 జూలై 9 నుంచి జూలై 12, 2025 విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది.

AP DSC పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ప్రకటించిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in లో చెక్ చేసుకోవచ్చు. పాఠశాల విద్యా శాఖ ఫలితాలను ప్రకటించి, అభ్యర్థులకు వారి స్కోర్‌లు, ఇతర సంబంధిత వివరాలను అందిస్తుంది. ఫలితాల ప్రకటనపై అప్‌డేట్ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేస్తుండాలి.

AP DSC ఫలితాలు 2025 విడుదల తేదీ అంచనా (AP DSC Results 2025 Expected Release Date)

గత సంవత్సరాల నమూనాలను పరిశీలిస్తే AP DSC ఫలితాలు 2025 కోసం అంచనా వేసిన విడుదల తేదీ ఇక్కడ అందించాం.

ఈవెంట్

తేదీలు

పరీక్ష ముగింపు

జూలై 2, 2025

AP DSC ఫలితాలు 2025 విడుదల తేదీ అంచనా

జూలై 9 నుండి జూలై 12, 2025 వరకు

అంచనా వేసిన గ్యాప్ వ్యవధి

7 నుండి 10 రోజుల్లోపు

AP DSC 2025 ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాలి. వారు తమ ఎంపిక అవకాశాలను అంచనా వేయడానికి కటాఫ్ మార్కులు, కనీస మార్కులను కూడా చెక్ చేయాలి. TGT, PGT, స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్), స్పెషల్ ఎడ్యుకేషన్, ఇతర భాషేతర సబ్జెక్టులు వంటి కవర్ చేసే 16,437 ఉపాధ్యాయ పోస్టులకు నియామక ప్రక్రియ జరుగుతుంది. AP DSC పరీక్షకు అర్హత సాధించడానికి, అభ్యర్థులు వారి కేటగిరి ఆధారంగా కనీస మార్కులు పొందాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60 శాతం స్కోర్ చేయాలి. వెనుకబడిన తరగతి (BC) అభ్యర్థులు కనీసం 50% స్కోర్ చేయాలి. SC/ST, విభిన్న ప్రతిభావంతులు లేదా మాజీ సైనికుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అర్హత ప్రమాణాలను చేరుకోవడానికి 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేయాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-dsc-results-2025-expected-release-date-67639/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top