విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈఏపీసెట్‌లో మళ్లీ పాత విధానాన్ని అమలు చేయనున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌లో (EAPCET 2023) ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.
AP EAPCET 2023: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈఏపీసెట్ 20232లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీఅంతేకాదు ఈఏపీసెట్ 2023 ప్రవేశపరీక్షలో మరికొన్ని మార్పులను కూడా జోడించారు. గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 70 శాతం సిలబస్‌నే విద్యార్థులు చదివి ఉన్నందున ఈఏపీసెట్‌లో ఆ మేరకే ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మొదట ఈ పరీక్షను ఎంసెట్‌గా నిర్వహించేవారు కానీ గత ఏడాది నుంచి ఈ పేరును మార్చి ఈఏపీ సెట్‌గా నిర్వహిస్తున్నారు.
ఈఏపీసెట్‌కు అర్హతలు
ఈఏపీసెట్ 2023కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా భారతీయ జాతీయులు లేదా భారత సంతతికి చెందిన వ్యక్తులు అయి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తూ ఉండాలి. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా ఇంటర్‌కు సమానమైన తత్సమాన పరీక్షలో పాసై ఉండాలి. లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ద్వారా గుర్తించబడిన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు తీసుకుని ఉండాలి.ఈఏపీసెట్ పరీక్షా విధానం
ప్రతి ఏడాది ఇంటర్ పూర్తైన తర్వాత అభ్యర్థులు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈఏపీసెట్‌ను రాస్తుంటారు. ఈఏపీసెట్‌ను 160 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ప్రశ్నాపత్రంలో మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష. అన్ని ప్రశ్నలను ఆబ్జెక్టివ్ టైప్‌లో ఇవ్వడం జరుగుతుంది.ఈఏపీసెట్ పరీక్షా తేదీలు
ఈ ఏడాది ఈఏపీసెట్ పరీక్షలు మే 15వ తేదీ నుంచి జరగనున్నాయి. పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను, ఇతర వివరాలను ఈ దిగువున అందజేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ తెలుసుకోవచ్చు.| కార్యక్రమం | ఈఏపీసెట్ ముఖ్యమైన తేదీలు |
|---|---|
| పరీక్ష ప్రారంభమయ్యే తేదీ | మే 15, 2023 |
| పరీక్ష ముగింపు తేదీ | మే 22, 2023 |
| ఉదయం ఎగ్జామ్ టైమింగ్స్ | ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు |
| మధ్యాహ్నం ఎగ్జామ్ టైమింగ్స్ | మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు |
| అధికారిక వెబ్‌సైట్ | https://cets.apsche.ap.gov.in |
ఏపీ ఈఏపీసెట్ 2023కు సంబంధించిన జవాబు కీని పరీక్ష నిర్వహణ అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. అభ్యర్థులు EAPCET 2023 ఆన్సర్ కీపై అధికారులు సూచించిన నిర్ధిష్ట గడువు వరకు అభ్యంతరాలను చెప్పవచ్చు. తర్వాత పరీక్ష నిర్వహణ అధికారులు ఏపీ ఈఏపీసెట్ 2023కు సంబంధించి అసలైన ఫలితాలను, అభ్యర్థులు సాధించిన స్కోర్లు, ర్యాంకులను విడుదల చేయడం జరుగుతుంది.
ఏపీ ఈఏపీసెట్ 2023కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం College Dekho ని ఫాలో అవుతూ ఉండండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















