AP EAPCET 2025-26 ఇంజినీరింగ్‌లో 34 వేల సీట్లు ఖాళీ, CSE కి మాత్రమే భారీ డిమాండ్‌

manohar

Published On:

రాష్ట్రంలో AP EAPCET 2025-26 ప్రవేశాల్లో నాలుగో వంతు సీట్లు ఖాళీ అయ్యాయి. ప్రైవేట్‌, ప్రభుత్వ యూనివర్సిటీల్లోనూ ముఖ్యమైన సీట్లు మిగిలాయి. పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

AP EAPCET 2025-26 ఇంజినీరింగ్‌లో 34 వేల సీట్లు ఖాళీ, CSE కి మాత్రమే భారీ డిమాండ్‌AP EAPCET 2025-26 ఇంజినీరింగ్‌లో 34 వేల సీట్లు ఖాళీ, CSE కి మాత్రమే భారీ డిమాండ్‌

AP EAPCET 2025-26లో రాష్ట్రవ్యాప్తంగా 34 వేల ఇంజినీరింగ్‌ సీట్లు ఖాళీ, విద్యార్థుల ప్రాధాన్యం CSE, IT కోర్సులకే (AP EAPCET 2025-26 34,000 engineering seats vacant across the state, students' preference for CSE, IT courses): AP EAPCET 2025-26 ప్రవేశాల్లో రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో గణనీయమైన సీట్లు ఖాళీగా మిగిలాయి. ఈ ఏడాది మొత్తం 1,84,248 మంది విద్యార్థులు అర్హత సాధించగా, కన్వీనర్‌ కోటాలో రిజిస్టర్‌ చేసుకున్నవారు 1,29,012 మంది మాత్రమే. వీరిలో 1,28,712 మంది ప్రవేశాలకు అర్హులైనా, అందుబాటులో ఉన్న 1,53,964 సీట్లలో పెద్ద సంఖ్యలో సీట్లు భర్తీ కాలేకపోయాయి. కౌన్సెలింగ్‌ రెండు విడతలు పూర్తయినా చివరికి దాదాపు 34,298 సీట్లు ఖాళీగా మిగిలాయి. ప్రైవేట్‌ కాలేజీల్లోనే 31,811 సీట్లు, ప్రభుత్వ యూనివర్సిటీల్లో 1,361 సీట్లు, ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 1,126 సీట్లు ఖాళీగా ఉన్నాయి. యాజమాన్య కోటా సీట్లు కూడా కలుపుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువ అవుతుందని అధికారులు చెబుతున్నారు. కన్వీనర్‌ కోటా సీట్లన్నీ కేటాయించినా కనీసం 25 వేల సీట్లు ఖాళీగా ఉండిపోవడం గమనార్హం. కొంతమంది విద్యార్థులు కోరుకున్న కాలేజీ లేదా బ్రాంచ్‌ దక్కకపోవడంతో కూడా సీటు తీసుకోకుండా వెనక్కి వెళ్లిపోయారు.

ఈ పరిస్థితికి ప్రధాన కారణం బ్రాంచిల వారీగా ఉన్న అసమాన డిమాండ్. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (CSE)కు మాత్రమే భారీ డిమాండ్‌ ఉండటంతో అన్ని సంస్థల్లో ఆ సీట్లు నిండిపోయాయి. అయితే మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ వంటి సంప్రదాయ కోర్సుల్లో డిమాండ్‌ లేకపోవడంతో వేలాది సీట్లు ఖాళీగా మిగిలాయి. మరోవైపు టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులు స్థానికంగా కాకుండా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలు ఎంచుకోవడం కూడా ప్రభావం చూపింది. EAPCET లో టాప్‌ 200 ర్యాంకుల్లో కేవలం 2 మంది, టాప్‌ 500 ర్యాంకుల్లో కేవలం 12 మంది మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొనడం వివరాలు తెలియజేస్తున్నాయి. పైగా, డీమ్డ్‌ యూనివర్సిటీలకు ఏఐసీటీ(AICT) ఈ కొత్త అనుమతులు ఇవ్వడంతో చాలా మంది విద్యార్థులు వాటివైపు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 35% సీట్లు కన్వీనర్‌ కోటా కింద, 65% యాజమాన్య కోటా కింద ఉండగా, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో మాత్రం 100% సీట్లు యాజమాన్యమే భర్తీ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలు ప్రతీ ఏటా మరింత సీట్లు ఖాళీ అవుతున్న పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగం ఆధిపత్యం పెరుగుతుండటంతో విద్యార్థులు CSE, IT బ్రాంచిలను మాత్రమే ఎంచుకుంటుండగా, మిగతా బ్రాంచిల గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

AP EAPCET 2025-26లో ఖాళీగా మిగిలిన సీట్లు వివరాలు(Details of remaining vacant seats in AP EAPCET 2025-26)

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక కూడా భారీ సంఖ్యలో ఇంజినీరింగ్‌ సీట్లు ఖాళీగా మిగిలాయి. వాటి వివరాలు క్రింది టేబుల్‌లో ఉన్నాయి.

యూనివర్సిటీలు

ఖాళీగా మిగిలిన సీట్లు

ప్రైవేట్‌ కాలేజీలు

31,811

ప్రభుత్వ యూనివర్సిటీలు

1,361

ప్రైవేట్‌ యూనివర్సిటీలు

1,126

మొత్తం

34,298

AP EAPCET 2025-26లో ఇంజినీరింగ్‌ సీట్లు పెద్ద సంఖ్యలో ఖాళీగా మిగిలాయి. విద్యార్థులు ఎక్కువగా CSE, IT బ్రాంచులనే ఎంచుకోవడం, టాప్‌ ర్యాంకర్లు రాష్ట్రం బయట ఐఐటీలు, ఎన్‌ఐటీలు చేరడం ప్రధాన కారణాలు. భవిష్యత్తులో కొత్త కోర్సులు ప్రవేశపెట్టి, అవగాహన పెంచడం అవసరం.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-eapcet-2025-26-engineering-seats-vacancy-analysis-70091/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top