AP ECET 2025 రిజిస్ట్రేషన్‌కి ఈ రోజే లాస్ట్ డేట్ (AP ECET Registration Last Date) అభ్యర్థులుకు పూర్తి సమాచారం ఇక్కడ అందిచాము చూడండి.
AP ECET 2025 రిజిస్ట్రేషన్‌కి ఈరోజే లాస్ట్ డేట్నేడే ఏపీ ఈసెట్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ (AP ECET Registration Last Date April 7th) : ఏపీ ఈసెట్ 2025కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈరోజే అంటే ఏప్రిల్ 7, 2025. ఇప్పటి వరకు అప్లై చేసుకోని అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. AP ECET 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ & టెక్నాలజీలో డిప్లొమా, బి.ఎస్సీ (గణితం) డిగ్రీ హోల్డర్ల నుంచి ఇంజనీరింగ్,ఫార్మసీ కోర్సులలో 2వ సంవత్సరం ఎంట్రీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరడం జరిగింది. అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం https://cets.apsche.ap.gov.in/ECET వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
AP ECET 2025కి ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి?
- ముందుగా అభ్యర్థులు cets.apsche.ap.gov.in/ECET 2025 వద్ద AP ECET అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోంపేజీ నుంచి దరఖాస్తును పూరించడానికి డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- పేరు, ఈమెయిల్ ఐడీ, జెండర్, మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత వివరాలను అవసరమైన ఫీల్డ్‌లలో పూరించాలి.
- AP ECET 2025 దరఖాస్తును పూరించడానికి లాగిన్ అవ్వాలి.
- విద్యా అర్హత, కమ్యూనికేషన్ చిరునామా, పరీక్షా కేంద్రం ప్రాధాన్యత, ఇతర సమాచారాన్ని పూరించాలి.
- దరఖాస్తు ఫీజు చెల్లించి, భవిష్యత్తు సూచన కోసం దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
AP ECET 2025 ముఖ్యమైన తేదీలు
AP ECET 2025కి సంబంధించి ముఖ్యమైన తేదీలు ఈ దిగువున టేబుల్లో అందించాం.
వరుస క్రమం | ప్రత్యేకతలు | తేదీ & చెల్లింపు |
|---|---|---|
1 | AP ECET 2025 నోటిఫికేషన్ తేదీ | మార్చి 03,2025 |
2 | AP ECET 2025 దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ | మార్చి 12,2025 |
3 | ఆలస్య ఫీజు లేకుండా దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ | ఏప్రిల్ 07,2025 |
4 | రూ.1000/- ఆలస్య ఫీజు సమర్పించడానికి చివరి తేదీ | ఏప్రిల్ 12,2025 |
5 | రూ.2000/- ఆలస్య ఫీజు సమర్పించడానికి చివరి తేదీ | ఏప్రిల్ 17,2025 |
6 | రూ.4000/- లేట్ ఫీజు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 22,2025 |
7 | రూ.10000/ లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 28,2025 |
8 | అభ్యర్థి ఇప్పటికే సమర్పించిన ఆన్‌లైన్ దరఖాస్తు డేటా సవరణ | ఏప్రిల్ 24,2025 నుండి ఏప్రిల్ 26,2025 వరకు |
9 | వెబ్‌సైట్ నుండి హాల్ టికెట్ డౌన్‌లోడ్ | మే 01,2025 |
10 | AP ECET 2025 పరీక్ష తేదీ | మే 6,2025 |
11 | AP ECET 2025 ప్రిలిమినరీ కీ విడుదల | మే 8,2025 |
12 | AP ECET 2025 ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించడానికి చివరి తేదీ | మే 10,2025 |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.











