AP EDCET 2026 దరఖాస్తు గడువు మార్చి 26తో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు వెంటనే నమోదు పూర్తి చేయాలి. AP EDCET పరీక్ష తేదీ మే 05న జరగనుండగా,బీఈడ్ కోర్సుల్లో ప్రవేశానికి ఇది కీలక అవకాశం.
AP EDCET 2026AP EDCET 2026 దరఖాస్తు చివరి తేదీ వివరాలు (AP EDCET 2026 Application Last Date Details): ఆంధ్రప్రదేశ్‌లో బీఈడ్ మరియు బీఈడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్స్‌లలో ప్రవేశానికి వచ్చే AP EDCET 2026 దరఖాస్తు ప్రక్రియ చివరి దశకు చేరింది. మార్చి 26, 2026 చివరి తేదీగా ఉండటంతో , ఇంకా అప్లై చేయని అభ్యర్థులు వెంటనే నమోదు పూర్తి చేయాలి. ఈ సంవత్సరం పరీక్ష ద్రావిడ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది, రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష మే 5న నిర్వహించబడుతుంది. టీచింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే గ్రాడ్యుయేట్స్ కోసం ఇది మంచి అవకాశమే. చివరి తేదీ దగ్గరపడే కొద్ది వెబ్‌సైట్ లో ట్రాఫిక్ పెరగడంతో సాంకేతిక సమస్యలు రావచ్చు, అందుకే ముందే అప్లై చేయడం బాగుంది. సరైన సమయంలో దరఖాస్తు చేసి పరీక్షకు సిద్ధం అయితే మంచిది.
AP EdCET 2026 ముఖ్యమైన తేదీలు (AP EdCET 2026 Important Dates)
AP EdCET 2026కు సంబంధించిన దరఖాస్తుకు అభ్యర్థులు చివరి గడువు తేదీలు గమనించి సమయానికి ప్రక్రియలను పూర్తి చేయాలి. AP EdCET 2026 అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన తేదీలను గమనించండి.
వివరాలు | తేదీలు |
|---|---|
AP EdCET 2026 ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ | మార్చి 26,2026 |
AP EdCET 2026 హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభ తేదీ | ఏప్రిల్ 20,2026 |
AP EdCET 2026 పరీక్ష తేదీ | మే 04,2026 |
AP EdCET 2026 ప్రాథమిక కీ విడుదల తేదీ | మే 07,2026 |
AP EdCET 2026 ప్రాథమిక కీపై అభ్యంతరాల చివరి తేదీ | మే 09,2026 |
AP EdCET 2026 ఫలితాల విడుదల తేదీ | మే 18,2026 |
AP EDCET 2026కు ఎలా దరఖాస్తు చేయాలి ? (How to apply for AP EDCET 2026?)
AP EDCET 2026 ఆన్‌లైన్ ద్వారా ఈ క్రింది విధముగా అప్లికేషన్ పూర్తి చేసుకోవచ్చు.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov కి వెళ్ళాలి
- ఆ తరువాత “Online Application” లింక్ పై క్లిక్ చేయాలి.
- ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
- అప్లికేషన్ ఫారం ఓపెన్ చేసి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి
- విద్యార్హత వివరాలు నమోదు చేయాలి
- ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి
- ఆప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ లో చెల్లించాలి
- అన్ని వివరాలు చెక్ చేసి ఫైనల్ గా సబ్మిట్ చేయాలి
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి
AP EDCET 2026 దరఖాస్తుల గడువు ముగియడానికి చాలా తక్కువ సమయం మిగిలింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసి ఈ అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోవాలి
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

