AP Grama Sachivalayam Job Notification 2023: ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో, మొత్తం 14,523 పోస్టులు, ఈ అర్హతలు ఉండాల్సిందే

Rudra Veni

Published On:

ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ (AP Grama Sachivalayam Job Notification 2023) రిలీజ్ కానుంది. మొత్తం 14,523 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఉండాల్సిన  అర్హతల గురించి ఇక్కడ తెలుసుకోండి.
AP Grama Sachivalayam Job Notification 2023: ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో, మొత్తం 14,523 పోస్టులు, ఈ అర్హతలు ఉండాల్సిందేAP Grama Sachivalayam Job Notification 2023: ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో, మొత్తం 14,523 పోస్టులు, ఈ అర్హతలు ఉండాల్సిందే

ఏపీ గ్రామ సచివాలయం జాబ్ నోటిఫికేషన్ 2023 (AP Grama Sachivalayam Job Notification 2023): AP గ్రామ సచివాలయం రిక్రూట్‌‌మెంట్ నోటిఫికేషన్ 2023 ఈనెలలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారాలో 14,523 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ మొదలైన ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. నోటిఫికేషన్ బ్రోచర్ అధికారికంగా ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల చేయబడిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. ఏపీ గ్రామ సచివాలయం రిక్రూట్‌మెంట్‌‌కు (AP Grama Sachivalayam Job Notification 2023) సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2023 ముఖ్యమైన తేదీలు (AP Grama Sachivalayam Notification 2023 Dates)

ఏపీ గ్రామ సచివాలయం రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందజేయడం జరిగింది.
మొత్తం పోస్టులు 14523
నోటిఫికేషన్ ఏప్రిల్, 2023
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఏప్రిల్; మే 2023
అప్లికేషన్ చివరి తేదీ తెలియాల్సి ఉంది
రాత పరీక్ష త్వరలో

ఏపీ గ్రామ సచివాలయం పోస్టులు 2023 (AP Grama Sachivalayam Vacancy 2023)

వివిధ పోస్టుల కోసం మొత్తం 14,523 ఖాళీలు ఉన్నాయి. ఈ దిగువన అందుబాటులో ఉన్న టేబుల్ ద్వారా మీరు ఒక్కో పోస్ట్‌కు ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరంగా తెలుసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఉద్యోగాల సంఖ్య
గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులు 182
డిజిటల్ అసిస్టెంట్ 736
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ 578
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 467
హార్టికల్చర్ అసిస్టెంట్ 1005
సెరికల్చర్ అసిస్టెంట్ 23
పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ 4765
ఫిషరీస్ అసిస్టెంట్ 60
ఇంజనీరింగ్ అసిస్టెంట్ 982
వీఆర్‌వో గ్రేడ్ 2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ 112
విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ 990
వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 170
వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 197
వార్డు వెల్ఫేర్ అండ్ వెలవప్‌మెంట్ సెక్రటరీ 153
వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ 371
వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ 436
వార్డు ఎనిమిటీస్ సెక్రటరీ 459
ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ 618
మహిళా పోలీస్ లేదా వార్డ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రాటెక్షన్ సెక్రటరీ 1092
ఎనర్జీ అసిస్టెంట్ 1127

ఏపీ గ్రామ సచివాలయం రిక్రూట్‌మెంట్ 2023కు కావాల్సిన అర్హతలు (AP Grama Sachivalayam Notification 2023 Eligibility Criteria)

ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2023కు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
  • గుర్తింపు పొందిన కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్‌లో పాసై ఉండాలి.
  • అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్‌లో 45% కంటే ఎక్కువ మార్కులు పొంది ఉండాలి.
  • అభ్యర్థుల కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు ఉండాలి
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు వయస్సులో మినహాయింపు ఉంటుంది.

ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2023 సెలక్షన్ ప్రక్రియ (AP Grama Sachivalayam Notification Selection Process 2023)

ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాల కోసం అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమకు అన్ని అర్హతలున్నాయో, సర్టిఫికెట్లన్నీ ఉన్నాయో? లేదో? చెక్ చేసుకోవాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులైతే రూ.200లు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ap.gov.in కి వెళ్లి చూడొచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ap-grama-sachivalayam-recruitment-notification-2023-38945/
FREE WORKSHOP

Claude Live Session by Experts

Practical · No theory · See it work live

Saturday, 6 June

11 AM – 1 PM

2 HOURS

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top