AP ICET 2026 దరఖాస్తు చివరి తేదీ

manohar

Published On:

AP ICET 2026 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 17,2026గా అధికారులు ప్రకటించారు.MBA,MCA కోర్సుల్లో అడ్మిషన్ కోరుకునే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

AP ICET 2026 Application Last DateAP ICET 2026 Application Last Date

AP ICET 2026 దరఖాస్తు చివరి తేదీ పూర్తి వివరాలు (AP ICET 2026 Application Last Date Full Details): ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు మరియు అనుబంధ కళాశాలల్లో MBA, MCA కోర్సుల్లో ప్రవేశం పొందాలనే విద్యార్థుల కోసం AP ICET 2026 దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ ప్రవేశ పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష ద్వారా మేనేజ్‌మెంట్ మరియు కంప్యూటర్ అప్లికేషన్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తారు. 2026 సంబంధించి ముఖ్యమైన తేదీలు మరియు దరఖాస్తు వివరాలను అధికారులు ప్రకటించారు. అందుచేత MBA లేదా MCA చదవాలనుకునే విద్యార్థులు దరఖాస్తు ముందుగానే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

AP ICET 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 5,2026 నుంచి ప్రారంభమయ్యాయి. డిగ్రీ పూర్తిచేసినవారు లేదా ప్రస్తుతం ఫైనల్ ఇయర్‌లో చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షకు అర్హులు. లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ మార్చి 17,2026గా నిర్ణయించబడింది . ఈ గడువు లోపే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేసి సమర్పించాలి. గడువు తర్వాత కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి చివరి తేదీకి ముందే అప్లై చేయడం మంచిది.

లేట్ ఫీజుతో AP ICET 2026 దరఖాస్తు ముఖ్యమైన తేదీలు (Important dates for AP ICET 2026 application with late fee)

లేట్ ఫీజు లేకుండా గడువు తేదీ మిస్ అయినా విద్యార్థులకు కూడా అప్లై చేసే అవకాశం ఉంది. అధికారుల షెడ్యూల్ ప్రకారం లేట్ ఫీజుతో అప్లై చేసే తేదీలు ఇవి.

లేట్ ఫీజు

దరఖాస్తు చివరి తేదీ

AP ICET 2026 దరఖాస్తు చివరి తేదీ మార్చి 17,2026

AP ICET 2026 రూ.1,000 లేట్ ఫీతో దరఖాస్తు ఫీజు తేదీ

మార్చి 21,2026

రూ.2,000 లేట్ ఫీతో దరఖాస్తు ఫీజు తేదీ

మార్చి 25,2026

రూ.4,000 లేట్ ఫీతో దరఖాస్తు ఫీజు తేదీ

మార్చి 30,2026

రూ.10,000 లేట్ ఫీతో దరఖాస్తు ఫీజు తేదీ

ఏప్రిల్ 03,2026

AP ICET 2026 హాల్ టికెట్, పరీక్ష విడుదల తేదీ వివరాలు (AP ICET 2026 Hall Ticket, Exam Date Release Details)

AP ICET 2026 హాల్ టికెట్లు 2026 ఏప్రిల్ 15 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు చేసిన విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ అయి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షను మే 2,2026న కంప్యూటర్ ఆధారిత విధానంలో రెండు సెషన్లుగా నిర్వహిస్తారు.పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందు హాల్ టికెట్ తో పాటు అవసరమైన గుర్తింపు పత్రం తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.

AP ICET 2026 ద్వారా MBA,MCA కోర్సుల్లో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు చివరి తేదీలను గుర్తించుకుని ముందుగానే దరఖాస్తు చేయడం మంచిది. హాల్ టికెట్ విడుదల మరియు పరీక్ష తేదీలను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేస్తూ ఉండాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-icet-2026-application-last-date-78176/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top