LIVE

ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు పరీక్ష లైవ్ అప్‌డేట్లు - ప్రశ్నాపత్రం, మార్కులు

Rudra Veni

Updated On: February 22, 2026 11:00 PM

ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు పరీక్ష  మంగళవారం జరగనుంది. ఈ పరీక్షలో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి? ప్రశ్నాపత్రంలో వివరాల గురించి ఈ దిగువున వివరంగా అందించాం. 

ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు పరీక్ష లైవ్ అప్‌డేట్లు - ప్రశ్నాపత్రం, మార్కులుఏపీ ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు పరీక్ష లైవ్ అప్‌డేట్లు - ప్రశ్నాపత్రం, మార్కులు

ఏపీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తెలుగు పరీక్ష ఫిబ్రవరి 24వ తేదీన జరగనుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. తెలుగు పరీక్ష అనేది చాలామంది విద్యార్థులకు ఇష్టమైనదిగా ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు ఈ పరీక్ష ద్వారా సులభంగా మంచి స్కోరింగ్‌ను పొందవచ్చు. అయితే తెలుగు పరీక్షలో బాగా ఎక్కువ స్కోరింగ్ కోసం కచ్చితంగా ప్రిపరేషన్ ఉండాలి. అలాగే ప్రశ్నాపత్రానికి సంబంధించి విద్యార్థులకు పూర్తి అవగాహన కూడా ఉండాలి. అందుకే పాత ప్రశ్నాపత్రాలను కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మేము ప్రశ్నాపత్రం ఎలా ఉంటుంది? ఎక్కువగా ఏ ప్రశ్నలు వస్తాయి? వాటికి ఎలా ఆన్సర్ చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు అనే వివరాలను అందించాం. దీని ప్రకారం విద్యార్థులు చదువుకుంటే మంచి మార్కులు పొందవచ్చు.

ఏపీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తెలుగులో ముఖ్యమైన టాపిక్స్

బ్లూప్రింట్ ఆధారంగా ఏపీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తెలుగు పరీక్షలో ముఖ్యమైన టాపిక్స్ గురించి ఈ దిగువున అందించాం.

అంశం

ఎన్ని ఇస్తారు/ఎన్నిరాయాలి

భాగము

మార్కులు

ప్రతిపదార్థం

2 ఇస్తారు 1 రాయాలి

పద్య భాగం

8 మార్కులు

వ్యాసరూప ప్రశ్నలు

2 ఇస్తారు 1 రాయాలి

పద్య భాగం

6 మార్కులు

వ్యాసరూప ప్రశ్నలు

2 ప్రశ్నలు ఇస్తారు ఒకటి రాయాలి

గద్య భాగం

6 మార్కులు

వ్యాసరూప ప్రశ్నలు

నాలుగు ఇస్తారు 2 ప్రశ్నలు రాాయాలి

ఉపవాచకం

10 మార్కులు

సందర్భ సహిత వ్యాఖ్యలు

4 ఇస్తారు 2 సమాధానాలు రాయాలి

పద్య భాగం

6 మార్కులు

సంక్షిప్త సహిత వ్యాఖ్యలు

4 ప్రశ్నలు ఇస్తారు 2 సమాధానాలు రాయాలి

పద్య భాగం

6 మార్కులు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

4 ప్రశ్నలు ఇస్తారు 2 సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

గద్య భాగం

6 మార్కులు

ఏక వాక్య సమాధానాలు

6 ప్రశ్నలు ఇస్తారు 6 ప్రశ్నలకు జవాబులు రాయాలి

పద్య భాగం

6 మార్కులు

ఏక వాక్య సమాధానాలు

6 ప్రశ్నలు ఇస్తారు 6 ప్రశ్నలకు జవాబులు రాయాలి

గద్య భాగం

6 మార్కులు

భాషాభాగాలు, ప్రశ్నలు

6 ప్రశ్నలు ఇస్తారు ఐదింటికి సమాధానాలు రాయాలి

వ్యాకరణాంశాలు

5 మార్కులు

వాక్యవిజ్ఞానం (ఒక మార్కు ప్రశ్నలు)

5 ప్రశ్నలు ఇస్తారు 5 సమాాధానాలు రాయాలి

వ్యాకరణాంశాలు

5 మార్కులు

ఛందస్సు (ఒక మార్కు ప్రశ్నలు

6 ప్రశ్నలు ఇస్తారు 6 సమాధానాలు రాయాలి

వ్యాకరణాంశాలు

6 మార్కులు

ఛందస్సు (ఒక మార్కు ప్రశ్నలు

6 ప్రశ్నలు ఇస్తారు 6 సమాధానాలు రాయాలి

వ్యాకరణాంశాలు

6 మార్కులు

అలంకారాలు

3 ప్రశ్నలు ఇస్తారు ఒకటి రాస్తే సరిపోతుంది

వ్యాకరణాంశాలు

6 మార్కులు

అలంకారాలు (1 మార్కు ప్రశ్నలు)

6 ప్రశ్నలు ఇస్తారు 6 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి

వ్యాకరణాంశాలు

6 మార్కులు

సంక్షిప్తీకరణ

ఒక్కటే ప్రశ్న ఉంటుంది దానికి సమాధానం రాయాలి

గ్రామర్

6 మార్కులు

ఏపీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తెలుగు పరీక్ష - కీలక వివరాలు

ఏపీ ఇంటర్మీడియట్ తెలుగు పరీక్ష 2026కి సంబంధించిన కొన్ని కీలక వివరాలను ఇక్కడ అందించాం చూడవచ్చు.

  • ఏపీ ఇంటర్ 2వ సంవత్సరం తెలుగు పరీక్ష : ఫిబ్రవరి 24, 2026

  • పరీక్ష టైమింగ్ : ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు

  • తెలుగు ఎగ్జామ్ జరిగే మోడ్ : ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది (పెన్, పేపర్ పద్ధతిలో)
పరీక్షలకు విద్యార్థులు కచ్చితంగా హాల్ టికెట్‌ను కచ్చితంగా తీసుకెళ్లాలి.

LIVE

ఏపీ ఇంటర్ 2వ సంవత్సరం తెలుగు పరీక్ష 2026 లైవ్ అప్‌డేట్లు

  • 11 00 PM IST - 22 Feb'26

    పిల్లలు అల్లరి చేసినాడు.. ఇందులో ఏ దోషం ఉంది?

    ఇందులో వచన దోషం ఉంది. సరైన రూపం: 'పిల్లలు అల్లరి చేసినారు'.

  • 10 40 PM IST - 22 Feb'26

    వాక్య దోషాలు ఎన్ని రకాలు?

    వాక్య దోషాలు ప్రధానంగా మూడు రకాలు. ఆకాంక్ష, యోగ్యత, ఆసక్తి లోపించడం వల్ల కలుగుతాయి.

  • 10 20 PM IST - 22 Feb'26

    హర్ష భాసుర సురభి ఇందులో గల అలంకారం ఏది

    ఇందులో 'యమక అలంకారం' లేదా 'అంత్యానుప్రాస'కు సంబంధించిన లక్షణం ఉంటుంది.

  • 10 00 PM IST - 22 Feb'26

    అలంకారాలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు

    1. 'మా పొలంలో బంగారం పండింది' ఇందులో ఏ అలంకారము ఉంది?

    2. 'చిటపట చినుకులు వటపట కురిసెను' ఇందులో ఏ అలంకారము ఉంది?

    3. కావ్యానికి అలంకారం కలిగించేవి ఏవి?

    4. 'హర్ష భాసుర సురభి' ఇందులో గల అలంకారం ఏది?

  • 09 40 PM IST - 22 Feb'26

    ఉపమేయం అంటే ఏమిటి?

    ఏ వస్తువునైతే మనం వర్ణిస్తూ చెబుతామో లేదా ఏ వస్తువును మరొక దానితో పోలుస్తామో ఆ వస్తువును 'ఉపమేయం' అంటారు.

  • 09 20 PM IST - 22 Feb'26

    అలంకారాలు - ఏకవాక్య ప్రశ్నలు : అలంకారాలు ఎన్ని రకములు?

    అలంకారాలు ప్రధానంగా రెండు రకములు: 1. శబ్దాలంకారాలు, 2. అర్థాలంకారాలు.

  • 09 00 PM IST - 22 Feb'26

    ఛందస్సు - ఏకవాక్య ప్రశ్నలు

    1. యతి అనగా నేమి?

    2. కంద పద్యంలో బేసి స్థానంలో ఏ గణం ఉండరాదు?

    3. గురువును ఏ గుర్తుతో గుర్తిస్తారు?

    4. సీస పద్యానికి అనుబంధంగా ఏయే పద్యాలు ఉండాలి?

    5. మత్తేభం పద్యంలోని గణాలు ఏవి?

    6. తేటగీతి పద్యంలో ఏయే గణాలు ఉంటాయి?

  • 08 40 PM IST - 22 Feb'26

    హిట్లర్ చర్యలను నిరసిస్తూ చార్లీ చాప్లిన్ తీసిన సినిమా ఏది?

    ది గ్రేట్ డిక్టేటర్'

  • 08 20 PM IST - 22 Feb'26

    ఒడి బియ్యం ఆచారం దేనికి ప్రతీతి?

    ఒడి బియ్యం ఆచారం సౌభాగ్యానికి, ఆదరణకు ప్రతీతి

  • 08 00 PM IST - 22 Feb'26

    బ్రహ్మ దేవునికి మొదట ఎన్ని తలలు ఉండేవి?

    బ్రహ్మ దేవునికి మొదట ఐదు తలలు ఉండేవి.

  • 07 40 PM IST - 22 Feb'26

    విశ్వం పూర్తి పేరేమిటి?

    విశ్వం పూర్తి పేరు మీసాల విశ్వనాథం

  • 07 20 PM IST - 22 Feb'26

    హేతువాద ఉద్యమాన్ని నడిపినది ఎవరు?

     హేతువాద ఉద్యమాన్ని కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి నడిపారు.

  • 07 00 PM IST - 22 Feb'26

    ఒక హోను విలువ ఎంత?

    ఒక హోను విలువ దాదాపు నాలుగు రూపాయలు

  • 06 40 PM IST - 22 Feb'26

    తెలంగాణ కావ్యం రాసినది ఎవరు?

    తెలంగాణా కావ్యాన్ని గోపాల చక్రవర్తి రాశారు.

  • 06 20 PM IST - 22 Feb'26

    బాపూజీ పట్ల ప్రజలకు ఏమి ఉండాలి?

    బాపూజీ పట్ల ప్రజలకు భక్తి, గౌరవం ఉండాలి

  • 06 00 PM IST - 22 Feb'26

    ఇంద్రుని పురము ఏది

    ఇంద్రుని పురము అమరావతి

  • 05 40 PM IST - 22 Feb'26

    నిగమ శర్మ తండ్రి పేరేమిటి?

    నిగమ శర్మ తండ్రి పేరు పురందరశర్మ

  • 05 20 PM IST - 22 Feb'26

    పురోరి అనగా ఎవరు?

    పురోరి అనగా పురము (పట్టణము) నందు నివసించేవాడు అని అర్థం
     

  • 05 00 PM IST - 22 Feb'26

    ఏపీ ఇంటర్ పరీక్షలకు ఏవేవి పట్టుకెళ్లకూడదు?

    పుస్తకాలు, నోట్‌బుక్‌లు లేదా మొబైల్ ఫోన్‌లు అనుమతించబడవు. విద్యార్థులు వీటిని కలిగి ఉన్నట్టు తేలితే వారిని పరీక్ష రాయకుండా ఆపవచ్చు.

  • 04 40 PM IST - 22 Feb'26

    ఏపీ ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలకు ఎన్ని గంటలకు హాజరవ్వాలి?

    ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ప్రవేశం అనుమతించబడదు. 

  • 04 20 PM IST - 22 Feb'26

    AP ఇంటర్ పరీక్ష ముఖ్యమైన తేదీలు 2026

    AP ఇంటర్ 2026 ముఖ్యమైన తేదీలు విద్యార్థులకు పరీక్షల గురించి కీలకమైన సమాచారాన్ని ఇక్కడ అందించాం. 

    AP ఇంటర్ టైమ్ టేబుల్ విడుదల తేదీ

    3 అక్టోబర్ 2025

    AP ఇంటర్ పరీక్ష తేదీ 2026

    రెండో సంవత్సరం: ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23, 2026 వరకు

     

    మొదటి సంవత్సరం: ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24, 2026 వరకు

    ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తేదీ 2026

    ఏప్రిల్ 2026

    AP ఇంటర్మీడియట్ కంపార్ట్‌మెంట్ పరీక్ష

    మే 2026

    ఏపీ ఇంటర్మీడియట్ కంపార్ట్‌మెంట్ ఫలితం 2026

    జూన్ 2026

  • 04 00 PM IST - 22 Feb'26

    ఏపీ ఇంటర్ 2వ సంవత్సరం తెలుగు పరీక్ష ఏ తేదీన జరగనుంది?

    ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన జరగనుంది. ఈ పరీక్ష పెన్ను, పేపర్ పద్ధతిలో జరుగుతుంది. 

  • 06 40 PM IST - 18 Feb'26

    బాలజీతగాడు ధరించిన అంగి ఎలాంటిది?

    బాలజీతగాడు చినిగిపోయిన, మురికిగా ఉన్న అంగీని ధరించాడు

/articles/ap-inter-2nd-year-telugu-exam-2026-live-updates/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top