ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు పరీక్ష మంగళవారం జరగనుంది. ఈ పరీక్షలో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి? ప్రశ్నాపత్రంలో వివరాల గురించి ఈ దిగువున వివరంగా అందించాం.
ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు పరీక్ష లైవ్ అప్‌డేట్లు - ప్రశ్నాపత్రం, మార్కులుఏపీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తెలుగు పరీక్ష ఫిబ్రవరి 24వ తేదీన జరగనుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. తెలుగు పరీక్ష అనేది చాలామంది విద్యార్థులకు ఇష్టమైనదిగా ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు ఈ పరీక్ష ద్వారా సులభంగా మంచి స్కోరింగ్‌ను పొందవచ్చు. అయితే తెలుగు పరీక్షలో బాగా ఎక్కువ స్కోరింగ్ కోసం కచ్చితంగా ప్రిపరేషన్ ఉండాలి. అలాగే ప్రశ్నాపత్రానికి సంబంధించి విద్యార్థులకు పూర్తి అవగాహన కూడా ఉండాలి. అందుకే పాత ప్రశ్నాపత్రాలను కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మేము ప్రశ్నాపత్రం ఎలా ఉంటుంది? ఎక్కువగా ఏ ప్రశ్నలు వస్తాయి? వాటికి ఎలా ఆన్సర్ చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు అనే వివరాలను అందించాం. దీని ప్రకారం విద్యార్థులు చదువుకుంటే మంచి మార్కులు పొందవచ్చు.
ఏపీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తెలుగులో ముఖ్యమైన టాపిక్స్
బ్లూప్రింట్ ఆధారంగా ఏపీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తెలుగు పరీక్షలో ముఖ్యమైన టాపిక్స్ గురించి ఈ దిగువున అందించాం.
అంశం | ఎన్ని ఇస్తారు/ఎన్నిరాయాలి | భాగము | మార్కులు |
|---|---|---|---|
ప్రతిపదార్థం | 2 ఇస్తారు 1 రాయాలి | పద్య భాగం | 8 మార్కులు |
వ్యాసరూప ప్రశ్నలు | 2 ఇస్తారు 1 రాయాలి | పద్య భాగం | 6 మార్కులు |
వ్యాసరూప ప్రశ్నలు | 2 ప్రశ్నలు ఇస్తారు ఒకటి రాయాలి | గద్య భాగం | 6 మార్కులు |
వ్యాసరూప ప్రశ్నలు | నాలుగు ఇస్తారు 2 ప్రశ్నలు రాాయాలి | ఉపవాచకం | 10 మార్కులు |
సందర్భ సహిత వ్యాఖ్యలు | 4 ఇస్తారు 2 సమాధానాలు రాయాలి | పద్య భాగం | 6 మార్కులు |
సంక్షిప్త సహిత వ్యాఖ్యలు | 4 ప్రశ్నలు ఇస్తారు 2 సమాధానాలు రాయాలి | పద్య భాగం | 6 మార్కులు |
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు | 4 ప్రశ్నలు ఇస్తారు 2 సమాధానాలు రాయాల్సి ఉంటుంది. | గద్య భాగం | 6 మార్కులు |
ఏక వాక్య సమాధానాలు | 6 ప్రశ్నలు ఇస్తారు 6 ప్రశ్నలకు జవాబులు రాయాలి | పద్య భాగం | 6 మార్కులు |
ఏక వాక్య సమాధానాలు | 6 ప్రశ్నలు ఇస్తారు 6 ప్రశ్నలకు జవాబులు రాయాలి | గద్య భాగం | 6 మార్కులు |
భాషాభాగాలు, ప్రశ్నలు | 6 ప్రశ్నలు ఇస్తారు ఐదింటికి సమాధానాలు రాయాలి | వ్యాకరణాంశాలు | 5 మార్కులు |
వాక్యవిజ్ఞానం (ఒక మార్కు ప్రశ్నలు) | 5 ప్రశ్నలు ఇస్తారు 5 సమాాధానాలు రాయాలి | వ్యాకరణాంశాలు | 5 మార్కులు |
ఛందస్సు (ఒక మార్కు ప్రశ్నలు | 6 ప్రశ్నలు ఇస్తారు 6 సమాధానాలు రాయాలి | వ్యాకరణాంశాలు | 6 మార్కులు |
ఛందస్సు (ఒక మార్కు ప్రశ్నలు | 6 ప్రశ్నలు ఇస్తారు 6 సమాధానాలు రాయాలి | వ్యాకరణాంశాలు | 6 మార్కులు |
అలంకారాలు | 3 ప్రశ్నలు ఇస్తారు ఒకటి రాస్తే సరిపోతుంది | వ్యాకరణాంశాలు | 6 మార్కులు |
అలంకారాలు (1 మార్కు ప్రశ్నలు) | 6 ప్రశ్నలు ఇస్తారు 6 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి | వ్యాకరణాంశాలు | 6 మార్కులు |
సంక్షిప్తీకరణ | ఒక్కటే ప్రశ్న ఉంటుంది దానికి సమాధానం రాయాలి | గ్రామర్ | 6 మార్కులు |
ఏపీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తెలుగు పరీక్ష - కీలక వివరాలు
ఏపీ ఇంటర్మీడియట్ తెలుగు పరీక్ష 2026కి సంబంధించిన కొన్ని కీలక వివరాలను ఇక్కడ అందించాం చూడవచ్చు.
ఏపీ ఇంటర్ 2వ సంవత్సరం తెలుగు పరీక్ష : ఫిబ్రవరి 24, 2026
పరీక్ష టైమింగ్ : ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు
- తెలుగు ఎగ్జామ్ జరిగే మోడ్ : ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది (పెన్, పేపర్ పద్ధతిలో)
ఏపీ ఇంటర్ 2వ సంవత్సరం తెలుగు పరీక్ష 2026 లైవ్ అప్‌డేట్లు
07 00 PM IST - 24 Feb'26
విమలయశోనిధీ ! పురుషవృత్త యెఱుంగుచు నుండుఁ జూవె వే..
సందర్భం: ఈ పద్యం నన్నయ రచించిన 'మహాభారతం' సభా పర్వంలోనిది. శకుంతల దుష్యంతుడితో సత్యం యొక్క గొప్పతనాన్ని చెబుతున్న సందర్భంలోనిది.
ప్రతిపదార్థం:
- విమలయశోనిధీ: నిర్మలమైన కీర్తికి నిలయమైనవాడా! (ఓ రాజా!)
- పురుషవృత్త: మనుషులు చేసే పనులను (ప్రవర్తనను).
- వేదములును: వేదాలు.
- పంచభూతములు: ఐదు భూతాలు (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం).
- ధర్మువు: ధర్మదేవత.
- సంధ్యలున్: ఉదయ, సాయంకాలాలు.
- అంతరాత్మయున్: మనస్సాక్షి.
- యముడును: యమధర్మరాజు.
- చంద్రసూర్యులు: చంద్రుడు, సూర్యుడు.
- అహంబును రాత్రియు: పగలు, రాత్రి.
- తన్ను మ్రుచ్చిలన్: తనను తాను వంచించుకోవడానికి (దాచుకోవడానికి).
- విమలయశోనిధీ: నిర్మలమైన కీర్తికి నిలయమైనవాడా! (ఓ రాజా!)
తాత్పర్యం: ఓ పుణ్యమూర్తి! వేదాలు, పంచభూతాలు, ధర్మం, ఉభయ సంధ్యలు, అంతరాత్మ, యముడు, సూర్యచంద్రులు, పగలు, రాత్రి - ఇవన్నీ మనుషులు చేసే పనులను గమనిస్తూనే ఉంటాయి. కాబట్టి ఏ మనిషీ తాను చేసిన పనిని ఎవరికీ తెలియదని దాచుకోలేడు.
06 00 PM IST - 24 Feb'26
ఉపమేయం అంటే ఏమిటి?
ఏ వస్తువునైతే వర్ణిస్తున్నామో లేదా పోలుస్తున్నామో ఆ వస్తువును ఉపమేయం అంటారు.
06 00 PM IST - 24 Feb'26
ఆలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి - అలంకారం ఏది?
ఇది అతిశయోక్తి అలంకారం
05 00 PM IST - 24 Feb'26
ఉత్పలమాల పద్యంలో యతి స్థానం ఎన్నవ అక్షరం?
పదవ (10వ) అక్షరం.
04 00 PM IST - 24 Feb'26
అరుణ్ ఇంటికి వెళ్లి వంట చేశాడు - ఇది ఏ రకమైన వాక్యం?
ఇది సంశిష్ట వాక్యం (వెళ్లి - అసమాపక క్రియ ఉంది కాబట్టి)
03 00 PM IST - 24 Feb'26
అవ్యయం అంటే ఏమిటి?
లింగ, వచన, విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారు (ఉదా: ఆహా, ఓహో, ఎక్కడ).
02 00 PM IST - 24 Feb'26
దేవదత్తుడు వంట చేశాడు - దీనిలో క్రియ ఏది?
క్రియ: చేశాడు.
01 00 PM IST - 24 Feb'26
వేమన పద్యాలలోని ఛందస్సు ఏది?
వేమన పద్యాలు ఆటవెలది ఛందస్సులో ఉంటాయి.
12 00 PM IST - 24 Feb'26
'మా కొద్దీ తెల్ల దొరతనం' గీతం ఎవరు రాశారు?
ఈ గీతాన్ని గరిమెళ్ళ సత్యనారాయణ రాశారు.
12 00 PM IST - 24 Feb'26
ప్రపంచానికి చదరంగం ఆటను ప్రసాదించిన దేశం?
చదరంగం ఆటను ప్రసాదించిన దేశం భారతదేశం.
11 00 AM IST - 24 Feb'26
నాయకురాలుగా ప్రసిద్ధి పొందింది ఎవరు?
నాయకురాలు నాగమ్మ ప్రసిద్ధి పొందింది.
10 00 AM IST - 24 Feb'26
నామవాచకం అనగా నేమి?
పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు (ఉదా: రాముడు, హైదరాబాద్).
08 00 AM IST - 24 Feb'26
రాణి 'మంచి తెలివి' గల పిల్ల - ఇందులో విశేషణం ఏది?
మంచి.
07 00 AM IST - 24 Feb'26
విధ్యార్థి' పదం సరైన రూపం రాయండి
సరైన రూపం: విద్యార్థి.
06 00 AM IST - 24 Feb'26
అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి
అక్కడ, ఇక్కడ, ఆహా, ఓహో (లింగ, వచన, విభక్తి శూన్యమైనవి).
05 00 AM IST - 24 Feb'26
శార్దూలం పద్యపాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి?
శార్దూలం పద్యపాదంలో 19 అక్షరాలు ఉంటాయి.
11 00 PM IST - 23 Feb'26
చంపకమాల పద్యంలోని గణాలు ఏవి?
చంపకమాలలో న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉంటాయి.
10 00 PM IST - 23 Feb'26
గురువు అనగా నేమి?
రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడే అక్షరాలను 'గురువు' అంటారు (ఉదా: దీర్ఘాక్షరాలు
09 00 PM IST - 23 Feb'26
"ఆచారాలు – సంస్కరణలు" వ్యాస రచయిత ఎవరు?
ఈ వ్యాస రచయిత తాపీ ధర్మారావు.
08 00 PM IST - 23 Feb'26
చార్లీ చాప్లిన్ ఏ రస ప్రతిష్టాపనలో అద్వితీయుడు?
హాస్య రస, కరుణ, రస ప్రతిష్టాపనలో అద్వితీయుడు
08 00 PM IST - 23 Feb'26
వజ్రాలకు పుట్టినిల్లు ఏది
గోల్కొండ (లేదా వజ్రాల గనులు ఉన్న కొల్లూరు ప్రాంతం).
07 00 PM IST - 23 Feb'26
సత్యభామ అలుకకు కారణమైన పుష్పం ఏది?
పారిజాత పుష్పం.
06 00 PM IST - 23 Feb'26
తెలుగు పంచ కావ్యాలలో ఒకటి పేర్కొనండి.
మనుచరిత్రము (లేదా వసుచరిత్రము, ఆముక్తమాల్యద మొదలైనవి).
05 00 PM IST - 23 Feb'26
శ్రీనాథుని బిరుదు ఏమిటి?
శ్రీనాథుని బిరుదు కవిసార్వభౌమ.
04 30 PM IST - 23 Feb'26
ఛందస్సుకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు దేని మీ దుండే ఛాన్స్ ఉంటుంది?
చంపక మాల
మత్తేభం
04 00 PM IST - 23 Feb'26
ముఖ్యమైన 6 మార్కుల ప్రశ్నలు
అర్థ సంకోచ, వ్యాకోచాల గురించి రాయండి.
రావూరి భరద్వాజ బాల్యాన్ని గురించి తెల్పండి
03 00 PM IST - 23 Feb'26
ముఖ్యమైన 6 మార్కులు ప్రశ్నలు
రాజు కన్యకను చెరపట్టడానికి ఎలా ప్రయత్నించాడు?
మనిషిలో ఏ విధంగా చైతన్యం వస్తుందని అద్దేపల్లి చెప్పారు?
02 30 PM IST - 23 Feb'26
విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు - లోని అలంకారమేది?
ఇందులో అంత్యానుప్రాస అలంకారం ఉంది.
02 00 PM IST - 23 Feb'26
వలె, పోలె, అట్లు, లాగ - ఈ పదాలను ఏమంటారు?
వీటిని ఉపమావాచకాలు అంటారు.
01 30 PM IST - 23 Feb'26
శబ్దాలంకారం అనగానేమి?
శబ్దాల ద్వారా కావ్యానికి అందాన్ని కలిగించేవి శబ్దాలంకారాలు
01 00 PM IST - 23 Feb'26
ఊహ ప్రధానంగా కల అలంకారమేది?
ఊహ ప్రధానంగా కల అలంకారం ఉత్ప్రేక్షా అలంకారం.
12 30 PM IST - 23 Feb'26
అలంకారాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
అలంకారాలు రెండు రకాలు. అవి: 1. శబ్దాలంకారాలు 2. అర్థాలంకారాలు.
12 00 PM IST - 23 Feb'26
ఉపమానం అంటే ఏమిటి?
దేనితోనైతే పోలుస్తున్నామో ఆ వస్తువును ఉపమానం అంటారు.
11 30 AM IST - 23 Feb'26
క్రియ అనగా ఏమి?
పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటారు.
11 00 AM IST - 23 Feb'26
సర్వనామం అంటే ఏమిటి?
నామవాచకానికి బదులుగా వాడే పదాన్ని సర్వనామం అంటారు
10 30 AM IST - 23 Feb'26
గులాబి అందమైన పువ్వు' - దీనిలో విశేషణమేది
ఇందులో విశేషణం అందమైన.
10 00 AM IST - 23 Feb'26
అవ్యయం అంటే ఏమిటి?
లింగ, వచన, విభక్తులు లేని పదాలను అవ్యయం అంటారు.
09 30 AM IST - 23 Feb'26
తెలుగులో భాషా భాగాలు ఎన్ని రకాలు?
ఐదు రకాలు (నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం).
09 00 AM IST - 23 Feb'26
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను ఎప్పుడు స్థాపించారు?
1885లో స్థాపించారు.
09 00 AM IST - 23 Feb'26
శబ్దాలంకారం అంటే ఏమిటి?
శబ్ద చమత్కారం ద్వారా కావ్యానికి అందాన్ని చేకూర్చేవి శబ్దాలంకారాలు.
08 30 AM IST - 23 Feb'26
పాకుడు రాళ్ళు నవలకు వచ్చిన అత్యున్నత పురస్కారమేది?
పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది.
08 30 AM IST - 23 Feb'26
శ్రీనాథుడు ఏ విజయనగర రాజును దర్శించాడు?
శ్రీనాథుడు రెండో దేవరాయలను (ప్రౌఢదేవరాయలు) దర్శించాడు.
08 00 AM IST - 23 Feb'26
మాఘ కవి రచించిన గ్రంథం పేరేమిటి
మాఘ కవి రచించిన గ్రంథం శిశుపాల వధ
08 00 AM IST - 23 Feb'26
ఉపమానం అంటే ఏమిటి?
పోలిక కోసం తీసుకునే వస్తువును లేదా పోల్చబడే ప్రసిద్ధ వస్తువును 'ఉపమానం' అంటారు.
07 30 AM IST - 23 Feb'26
చాటువులను తెలుగులోకి తెచ్చిన వారెవరు?
చాటువులను తెలుగులోకి (ప్రసిద్ధిలోకి) తెచ్చిన వారు శ్రీనాథుడు.
07 00 AM IST - 23 Feb'26
హనుమంతుని తల్లి పేరేమిటి?
అంజనాదేవి.
07 00 AM IST - 23 Feb'26
అలంకారాలు ఎన్ని రకములు?
అలంకారాలు ప్రధానంగా రెండు రకాలు : 1. శబ్దాలంకారాలు, 2. అర్థాలంకారాలు.
06 30 AM IST - 23 Feb'26
మొల్ల తన రామాయణాన్ని ఎవరికి అంకితమిచ్చింది?
మొల్ల తన రామాయణాన్ని శ్రీరామచంద్రుడికి అంకితమిచ్చింది.
06 30 AM IST - 23 Feb'26
బియ్యంలో రాళ్ళలా కనిపించిన వేవి?
బియ్యంలో రాళ్లలా కనిపించినవి వజ్రాలు
06 00 AM IST - 23 Feb'26
నన్నయ ఎవరి ఆస్థాన కవి
నన్నయ రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి
06 00 AM IST - 23 Feb'26
ప్రాస అనగానేమి?
పద్య పాదంలోని రెండవ అక్షరాన్ని 'ప్రాస' అంటారు.
05 30 AM IST - 23 Feb'26
శకుంతలను పెంచిన తండ్రి ఎవరు?
శకుంతలను పెంచిన తండ్రి కణ్వ మహర్షి
05 00 AM IST - 23 Feb'26
గురజాడ అప్పారావు రచించిన ప్రసిద్ధ నాటకం పేరేమిటి?
గురజాడ అప్పారావు రచించిన ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కం.
11 00 PM IST - 22 Feb'26
పిల్లలు అల్లరి చేసినాడు.. ఇందులో ఏ దోషం ఉంది?
ఇందులో వచన దోషం ఉంది. సరైన రూపం: 'పిల్లలు అల్లరి చేసినారు'.
10 40 PM IST - 22 Feb'26
వాక్య దోషాలు ఎన్ని రకాలు?
వాక్య దోషాలు ప్రధానంగా మూడు రకాలు. ఆకాంక్ష, యోగ్యత, ఆసక్తి లోపించడం వల్ల కలుగుతాయి.
10 20 PM IST - 22 Feb'26
హర్ష భాసుర సురభి ఇందులో గల అలంకారం ఏది
ఇందులో 'యమక అలంకారం' లేదా 'అంత్యానుప్రాస'కు సంబంధించిన లక్షణం ఉంటుంది.
10 00 PM IST - 22 Feb'26
అలంకారాలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు
'మా పొలంలో బంగారం పండింది' ఇందులో ఏ అలంకారము ఉంది?
'చిటపట చినుకులు వటపట కురిసెను' ఇందులో ఏ అలంకారము ఉంది?
కావ్యానికి అలంకారం కలిగించేవి ఏవి?
'హర్ష భాసుర సురభి' ఇందులో గల అలంకారం ఏది?
09 40 PM IST - 22 Feb'26
ఉపమేయం అంటే ఏమిటి?
ఏ వస్తువునైతే మనం వర్ణిస్తూ చెబుతామో లేదా ఏ వస్తువును మరొక దానితో పోలుస్తామో ఆ వస్తువును 'ఉపమేయం' అంటారు.
09 20 PM IST - 22 Feb'26
అలంకారాలు - ఏకవాక్య ప్రశ్నలు : అలంకారాలు ఎన్ని రకములు?
అలంకారాలు ప్రధానంగా రెండు రకములు: 1. శబ్దాలంకారాలు, 2. అర్థాలంకారాలు.
09 00 PM IST - 22 Feb'26
ఛందస్సు - ఏకవాక్య ప్రశ్నలు
యతి అనగా నేమి?
కంద పద్యంలో బేసి స్థానంలో ఏ గణం ఉండరాదు?
గురువును ఏ గుర్తుతో గుర్తిస్తారు?
సీస పద్యానికి అనుబంధంగా ఏయే పద్యాలు ఉండాలి?
మత్తేభం పద్యంలోని గణాలు ఏవి?
తేటగీతి పద్యంలో ఏయే గణాలు ఉంటాయి?
08 40 PM IST - 22 Feb'26
హిట్లర్ చర్యలను నిరసిస్తూ చార్లీ చాప్లిన్ తీసిన సినిమా ఏది?
ది గ్రేట్ డిక్టేటర్'
08 20 PM IST - 22 Feb'26
ఒడి బియ్యం ఆచారం దేనికి ప్రతీతి?
ఒడి బియ్యం ఆచారం సౌభాగ్యానికి, ఆదరణకు ప్రతీతి
08 00 PM IST - 22 Feb'26
బ్రహ్మ దేవునికి మొదట ఎన్ని తలలు ఉండేవి?
బ్రహ్మ దేవునికి మొదట ఐదు తలలు ఉండేవి.
07 40 PM IST - 22 Feb'26
విశ్వం పూర్తి పేరేమిటి?
విశ్వం పూర్తి పేరు మీసాల విశ్వనాథం
07 20 PM IST - 22 Feb'26
హేతువాద ఉద్యమాన్ని నడిపినది ఎవరు?
హేతువాద ఉద్యమాన్ని కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి నడిపారు.
07 00 PM IST - 22 Feb'26
ఒక హోను విలువ ఎంత?
ఒక హోను విలువ దాదాపు నాలుగు రూపాయలు
06 40 PM IST - 22 Feb'26
తెలంగాణ కావ్యం రాసినది ఎవరు?
తెలంగాణా కావ్యాన్ని గోపాల చక్రవర్తి రాశారు.
06 20 PM IST - 22 Feb'26
బాపూజీ పట్ల ప్రజలకు ఏమి ఉండాలి?
బాపూజీ పట్ల ప్రజలకు భక్తి, గౌరవం ఉండాలి
06 00 PM IST - 22 Feb'26
ఇంద్రుని పురము ఏది
ఇంద్రుని పురము అమరావతి
05 40 PM IST - 22 Feb'26
నిగమ శర్మ తండ్రి పేరేమిటి?
నిగమ శర్మ తండ్రి పేరు పురందరశర్మ
05 20 PM IST - 22 Feb'26
పురోరి అనగా ఎవరు?
పురోరి అనగా పురము (పట్టణము) నందు నివసించేవాడు అని అర్థం
05 00 PM IST - 22 Feb'26
ఏపీ ఇంటర్ పరీక్షలకు ఏవేవి పట్టుకెళ్లకూడదు?
పుస్తకాలు, నోట్‌బుక్‌లు లేదా మొబైల్ ఫోన్‌లు అనుమతించబడవు. విద్యార్థులు వీటిని కలిగి ఉన్నట్టు తేలితే వారిని పరీక్ష రాయకుండా ఆపవచ్చు.
04 40 PM IST - 22 Feb'26
ఏపీ ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలకు ఎన్ని గంటలకు హాజరవ్వాలి?
ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ప్రవేశం అనుమతించబడదు.
04 20 PM IST - 22 Feb'26
AP ఇంటర్ పరీక్ష ముఖ్యమైన తేదీలు 2026
AP ఇంటర్ 2026 ముఖ్యమైన తేదీలు విద్యార్థులకు పరీక్షల గురించి కీలకమైన సమాచారాన్ని ఇక్కడ అందించాం.
AP ఇంటర్ టైమ్ టేబుల్ విడుదల తేదీ
3 అక్టోబర్ 2025
AP ఇంటర్ పరీక్ష తేదీ 2026
రెండో సంవత్సరం: ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23, 2026 వరకు
మొదటి సంవత్సరం: ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24, 2026 వరకు
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తేదీ 2026
ఏప్రిల్ 2026
AP ఇంటర్మీడియట్ కంపార్ట్‌మెంట్ పరీక్ష
మే 2026
ఏపీ ఇంటర్మీడియట్ కంపార్ట్‌మెంట్ ఫలితం 2026
జూన్ 2026
04 00 PM IST - 22 Feb'26
ఏపీ ఇంటర్ 2వ సంవత్సరం తెలుగు పరీక్ష ఏ తేదీన జరగనుంది?
ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన జరగనుంది. ఈ పరీక్ష పెన్ను, పేపర్ పద్ధతిలో జరుగుతుంది.
06 40 PM IST - 18 Feb'26
బాలజీతగాడు ధరించిన అంగి ఎలాంటిది?
బాలజీతగాడు చినిగిపోయిన, మురికిగా ఉన్న అంగీని ధరించాడు

