AP Inter Result 2023 Date: AP ఇంటర్ ఫలితాలు 2023 రేపే విడుదలయ్యే ఛాన్స్

Rudra Veni

Published On:

ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ 2023 ఫలితాలు (AP Inter Result 2023 Date)   ఏప్రిల్ 26న విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు ఏప్రిల్ 29న రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. విద్యార్థులు తమ ఫలితాలను విడుదల చేసిన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. 
AP Inter Result 2023 is to be released by April 26AP Inter Result 2023 is to be released by April 26

AP ఇంటర్ ఫలితాలు 2023 (AP Inter Result 2023 Date): ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపే (April 26) విడుదలయ్యే అవకాశం ఉంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) ఏప్రిల్ 26, 2023న 2వ సంవత్సరానికి సంబంధించిన AP ఇంటర్ ఫలితాలు 2023ని (AP Inter Result 2023 Date) విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 04, 2023 వరకు జరిగాయి. ఈ ఎగ్జామ్స్‌కి సుమారు 5.17 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగియడంతో పరీక్షా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుకున్న విధంగా ఏప్రిల్ 26న విడుదలైతే ఫలితాలను BIEAP అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి. విద్యార్థులు వారి పరీక్ష హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి వారి ఫలితాలను చూసుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్ ద్వారా మొదటి సంవత్సరం విద్యార్థులకు AP ఇంటర్ ఫలితాలు 2023 ఏప్రిల్ 29, 2023లోగా అంచనా వేయడం జరుగుతుంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 03, 2023 వరకు జరిగిన AP ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2023 పరీక్షలకు దాదాపు 5.10 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవడానికి విద్యార్థులు వారి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని దగ్గర ఉంచుకోవాలి.

AP ఇంటర్ ఫలితాలు 2023 తేదీ (అంచనా) (AP Inter Results 2023 Date)

విద్యార్థుల సౌలభ్యం కోసం ఏపీ ఇంటర్ ఫలితాల 2023 తేదీని ఈ దిగువున ఇవ్వడం జరిగింది. అయితే అది అంచనా మాత్రమేననే విషయాన్ని విద్యార్థులు గమనించాలి.
AP ఇంటర్ ఫలితాలు 2023 తేదీ, సమయం ప్రకటించే అంచనా తేదీ ఏప్రిల్ 24, 2023
2023 రెండో సంవత్సరం AP ఇంటర్ ఫలితాలు (అంచనా) ఏప్రిల్ 26, 2023
AP ఇంటర్ 2023 మొదటి సంవత్సరం ఫలితాలు (అంచనా) ఏప్రిల్ 29, 2023

ఫలితాలు ఆన్‌లైన్‌లో ప్రకటించబడతాయి. కాబట్టి విద్యార్థులు తమ మార్కు షీట్‌లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్క్ షీట్‌లో ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన మార్కులు, మొత్తం మార్కులు ఉంటాయి. మార్క్ షీట్‌ల హార్డ్ కాపీ విడుదలయ్యే వరకు విద్యార్థులు అడ్మిషన్ ప్రయోజనాల కోసం ఆన్‌లైన్ కాపీని ఉపయోగించుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫలితాల కోసం మరిన్ని అప్‌డేట్‌లు ఇక్కడ అందజేయడం జరుగుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ap-inter-result-2023-is-to-be-released-by-april-26-39535/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top