AP Inter Results 2025 through WhatsApp: వాట్సాప్‌లో ఏపీ ఇంటర్ ఫలితాలు 2025, ఇలా చెక్ చేసుకోవాలి

Rudra Veni

Updated On: April 01, 2025 01:50 PM

ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు మార్కుల మెమోగా విడుదలవుతాయి. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు వాట్సాప్‌ (AP Inter Results 2025 through WhatsApp) ద్వారా విడుదలకానున్నాయి.
 
AP Inter Results 2025 through WhatsApp: వాట్సాప్‌లో ఏపీ ఇంటర్ ఫలితాలు 2025, ఇలా చెక్ చేసుకోవాలిAP Inter Results 2025 through WhatsApp: వాట్సాప్‌లో ఏపీ ఇంటర్ ఫలితాలు 2025, ఇలా చెక్ చేసుకోవాలి

వాట్సాప్ ద్వారా ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 (AP Inter Results 2025 through WhatsApp) : ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలపై 2025 సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంటర్ పరీక్షలు అయిపోవడంతో ప్రతి ఒక్కరూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య విడుదలకానున్నాయి. ఇప్పటికే ఇంటర్మీడియట్ పేపర్ల దిద్దుబాటు ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు మార్కుల మెమోగా విడుదలవుతాయి. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు వాట్సాప్‌ ద్వారా విడుదలకానున్నాయి. ఫలితాల కోసం ఇప్పటి వరకు ఇంటర్‌నెట్ సెంటర్లు, వెబ్‌సైట్‌ల‌పై ఆధారపడాల్సి వచ్చింది. విద్యార్థుల ఫలితాలను సులభంగా అందించేందుకు ఏపీ ప్రభుత్వం 2025 ఇంటర్ పరీక్షా ఫలితాలను నేరుగా వాట్సాప్ (AP Inter Results 2025 through WhatsApp) ద్వారా రిలీజ్ చేయనుంది. దీంతో ఈ ఏడాది ఇంటర్ ఫలితాలను వాట్సాప్‌లోనే చూసుకోవచ్చు.
విద్యాశాఖ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్లకు నేరుగా ఇంటర్మీడియట్ ఫలితాలను పంపించడం జరుగుతుంది. దీంతో ఫలితాలను చాలా సులభంగా ఫోన్‌లోనే చూసుకోవచ్చు. ఇంటర్ పరీక్షలు మార్చి 17న ముగిశాయి. పేపర్ల దిద్దుబాటు ప్రక్రియ మార్చి 19న ప్రారంభమైంది. ఇంకో పది రోజుల్లో ఈ స్పాట్ వాల్యుయేషన్ పూర్తవుతుంది. ఏప్రిల్ 15వ తేదీకల్లా ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 whatsappలో ఎలా చెక్ చేసుకోవాలి? (AP Inter Results 2025 on through whatsapp)

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 వాట్సాప్‌ ద్వారా పొందవచ్చు. ఫలితాలు వాట్సాప్‌లో ఈ దిగువున తెలిపిన విధంగా చెక్ చేసుకోవచ్చు.
  • ముందుగా మొబైల్ ఫోన్‌లో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ నెంబర్ 955230009 సేవ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీ భాషను ఎంచుకోవాలి
  • ఆ తర్వాత మీ కావాలనుకుంటున్న సర్వీస్‌ను ఎంచుకోవాలి
  • అనంతరం ఎడ్యుకేషన్ సర్వీస్ ఆప్షన్‌లో వెళ్తే అక్కడ మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆప్షన్ ఎంచుకుని మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
  • వెంటనే మీ మార్క్స్ మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఏపీ ఇంటర్ మార్కుల మెమోలో ప్రస్తావించబడిన 2025 వివరాలు (Details on AP Inter Marks Memo 2025)

ఏపీ ఇంటర్మీడియట్ మార్కుల మెమోలో ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.
  • అభ్యర్థి పేరు
  • హాల్ టికెట్ నెంబర్
  • ఫలితం/ పొందిన గ్రేడ్
  • ప్రతి సబ్జెక్టులో వచ్చిన మార్కులు
  • అర్హత స్థితి
  • టోటల్ మార్కులు
  • గ్రేడ్ పాయింట్లు

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను ఇక్కడ పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-inter-results-2025-through-whatsapp-how-to-check-64522/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top