ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పాస్ మార్కుల్లో మార్పులు

Rudra Veni

Published On:

ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ పరీక్షల పాస్ మార్కుల్లో (AP Inter Pass Percentage Marks 2025) మార్పులు, చేర్పులు జరిగాయి. సంబంధిత వివరాలు ఈ దిగువున అందించాం. 
ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పాస్ మార్కుల్లో మార్పులుఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పాస్ మార్కుల్లో మార్పులు

ఏపీ ఇంటర్ పాస్ పర్సెంటేజ్ మార్కులు 2025 (AP Inter Pass Percentage Marks 2025) : ఏపీ ఇంటర్ పరీక్షలు ఈ ఏడాది ముందుగానే జరగనున్నాయి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు గడువు అక్టోబర్‌ 22వ తేదీతో ముగియనుంది. రూ.1000ల ఆలస్య ఫీజుతో అక్టోబర్‌ 30వ తేదీ వరకు ఫీజు చెల్లించ వచ్చు. ఆలస్య ఫీజు థియరీ పేపర్లకు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275, బ్రిడ్జికోర్సు సబ్జెక్టుకు రూ.165ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థుల పాస్ పర్సెంటేజీ, పాస్ మార్కుల విధానంలో (AP Inter Pass Percentage Marks 2025) కొన్ని మార్పులు రానున్నాయి. ఈ మేరకు తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇంటర్ జాగ్రఫీ పేపర్‌కు 35 శాతం మార్కులు రావాల్సిన అవసరం లేదు. కనీసం 30 మార్కులు వచ్చినా పాసైనట్టు పరిగణిస్తారు.
అదే విధంగా 75 మార్కులకు ఉండే జాగ్రఫీ ప్రశ్నపత్రాన్ని 85 మార్కులకు చేశారు. కొత్త మార్పులతో జాగ్రఫీని ఎలెక్టివ్ (ఛాయిస్) సబ్జెక్టుగా పరిగణిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో సమానంగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అంటే జాగ్రఫీ ప్రాక్టికల్ పరీక్షలను 50 మార్కులకు బదులు 30 మార్కులకు నిర్వహిస్తారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలో కనీసం 35 శాతం అంటే 11 మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీన్ని 30 శాతం తగ్గించడంతో 9 మార్కులు వస్తే పాసైనట్టు పరిగణిస్తారు. అయితే 2025-26 విద్యా సంవత్సరంలో రెగ్యులర్ అభ్యర్థులుగా ప్రవేశం పొందిన ఇంటర్ స్టూడెంట్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందనే విషయాన్ని గమనించాలి.

ఏపీ ఇంటర్ మార్కులు - పాస్ మార్కుల్లో మార్పులపై PDF లింక్

ఏపీ ఇంటర్మీడియట్ మార్కుల్లో వచ్చిన మార్పులు, చేర్పుల వివరాలను తెలిపే PDF‌ని ఈ దిగువున తెలిపిన లింక్‌పై క్లిక్ చేయాలి.

ఏపీ ఇంటర్ మార్కులు - పాస్ మార్కుల్లో మార్పులపై PDF

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష 2026: ముఖ్యాంశాలు (AP Intermediate Exam 2026: Highlights)

BIEAP ఇంటర్మీడియట్ పరీక్షలు 2026 కి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని విద్యార్థులు ఈ దిగువున తెలుసుకోవచ్చు.

ఈవెంట్స్

వివరాలు

పరీక్ష పేరు

ఆంధ్రప్రదేశ్ బోర్డు ఇంటర్మీడియట్ పరీక్షలు

నిర్వాహక అధికారం

ఇంటర్మీడియట్ విద్యా మండలి, ఆంధ్రప్రదేశ్ (BIEAP)

పరీక్ష రకం

ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు

పరీక్షా విధానం

రాత పరీక్ష (ఆఫ్‌లైన్)

పరీక్ష స్థాయి

రాష్ట్ర స్థాయి

అధికారిక వెబ్‌సైట్

bie.ap.gov.in

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-intermediate-board-makes-changes-in-inter-pass-marks-system-73019/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top