ఏపీ ఎస్‌ఐ పరీక్షా ఫలితాలు మంగళవారం రిలీజ్ అయ్యాయి. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకునే విధానం గురించి ఈ ఆర్టికల్లో వివరంగా తెలియజేశాం. అభ్యర్థులు ఈ ఆర్టికల్ ద్వారా తమ రిజల్ట్స్‌ని, స్కోర్ కార్డును ఈజీగా తెలుసుకోవచ్చు.
AP Police Result is outఈ పరీక్ష ఫలితాలకు సంబంధించిన స్కోర్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో పొందవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, తమ హాల్ టికెట్ నెంబర్‌ని నమోదు చేసి తమ రిజల్ట్స్‌ని పొందవచ్చు. అభ్యర్థులు https://slprb.ap.gov.in/ ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ దిగువున అందజేసిన డైరక్ట్ లింక్ ద్వారా అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవచ్చు.
| ఏపీ ఎస్‌ఐ రిజల్ట్స్ డైరక్ట్ లింక్ |
|---|
రిజల్ట్స్ చెక్ చేసుకునే విధానం
- ఎస్ఐ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ముందుగా https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- హోంపేజీలో Latest News అనే విభాగం ఉంటుంది.
- ఆ సెక్షన్ కింద SCT SI PWT RESULTS అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి
- తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయాలి.
- దాంతో అభ్యర్థులు ఫలితాలు కనిపిస్తాయి.
ఏపీ ఎస్‌ఐ పరీక్ష ముఖ్యమైన తేదీలు
ఏపీ పోలీస్ సబ్ ఇన్సెక్టర్ 2023 నోటిఫికేషన్ ద్వారా 411 సబ్ ఇన్సెక్టర్ పోస్టులను ఏపీ పోలీస్ శాఖ భర్తీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఏపీ ఎస్ఐ పరీక్షలు జరిగాయి. ఈ ఎస్‌ఐ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందజేశాం.
| ఈవెంట్ | ముఖ్యమైన తేదీలు |
|---|---|
| ఎగ్జామ్ డేట్ | 19 ఫిబ్రవరి 2023 |
| ఫలితాలు విడుదల | 28 ఫిబ్రవరి 2023 |
| సంస్థ | ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ |
| పోస్ట్ నేమ్ | సబ్ ఇన్సెక్టర్ |
| ఖాళీలు | 411 |
| సెలక్షన్ ప్రాసెస్ | ప్రిలిమ్స్, పీఎస్‌టీ/పీఈటీ, మెయిన్స్ |
| అధికారిక వెబ్‌సైట్ | https://slprb.ap.gov.in/ |
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దేహదారుడ్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో సివిల్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు 1600 మీటర్ల రన్నింగ్, వంద మీటర్ల రన్నింగ్ ఉంటుంది. వీటిలో ఎలాంటి మెరిట్ ఉండదు. కేవలం అర్హత కోసమే ఈ రన్నింగ్‌లో అభ్యర్థులు పాల్గొనాలి. ఇక ఏపీఎస్పీ ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు 1600 మీ, 100 మీ, లాంగ్ జంప్ లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇక ఎస్‌ఐ మెయిన్స్ పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















