AP SSC Spot Valuation 2023: ఏపీ పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ 2023 ప్రారంభం, మే రెండో వారంలో ఫలితాలు?

Rudra Veni

Published On:

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ (AP SSC Spot Valuation 2023)  ఏప్రిల్ 19న ప్రారంభమైంది. ఏప్రిల్ 26వ తేదీ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫలితాలు మే 2023 2వ వారంలోపు రిలీజ్ కానున్నాయి. 
 
AP SSC (Class 10) Spot Valuation 2023AP SSC (Class 10) Spot Valuation 2023

AP పదో తరగతి పరీక్ష పేపర్లు స్పాట్ వాల్యుయేషన్ 2023 (AP SSC Spot Valuation 2023): ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఏపీ పదో తరగతి పరీక్షా పేపర్ల 2023 స్పాట్ వాల్యుయేషన్‌ని (AP SSC Spot Valuation 2023) ప్రారంభించింది. పరీక్ష ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 18, 2023 వరకు నిర్వహించబడింది. పరీక్షలు ముగిసిన వెంటనే బోర్డు స్పాట్ వాల్యుయేషన్‌ను ప్రారంభించింది. ప్లాన్ ప్రకారం స్పాట్ వాల్యుయేషన్ ముగిస్తే, మే 2023 రెండో వారంలోపు ఫలితాలు ప్రకటించబడే అవకాశం ఉంది. ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 26, 2023 వరకు స్పాట్ వాల్యుయేషన్‌ను పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుందని, ఫలితాల కోసం సన్నాహాలు ప్రారంభించిన వెంటనే అధికారులు పేర్కొన్నారు. స్పాట్ వాల్యుయేషన్ నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా AP SSC స్పాట్ వాల్యుయేషన్ 2023ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సబ్-ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, మండల్ ఆఫీసర్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ముందుగానే సూచించడం జరిగింది.

AP SSC పరీక్షలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పంపిణీ చేయబడిన మొత్తం 3,349 పరీక్షా కేంద్రాల్లో సుమారు 6.64 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 30,000 నుంచి 35,000 మంది ఉపాధ్యాయులు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొంటారు. వీరంతా రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని వివిధ మూల్యాంకన కేంద్రాల్లో కూర్చుంటారు. ఏప్రిల్ 19 నుంచి 26 వరకు AP SSC స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేయాలనే లక్ష్యం ఉన్నందున ఎవరైనా ఉపాధ్యాయులు సెలవు తీసుకున్నా లేదా డ్యూటీ రోజున అందుబాటులో లేకపోయినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.

అంతేకాకుండా విద్యార్థులు తదుపరి పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2023 మే రెండో వారంలోగా AP SSC ఫలితాలు 2023ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఇప్పటికే స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముగియడంతో ఇప్పటికే విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు కూడా వీలైనంత తొందరగా ఫలితాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే స్పాట్ వాల్యుయేషన్‌ని వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పదో తరగతి ఫలితాలు రిలీజ్ తర్వాత ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలను కూడా అధికారులు నిర్వహించడం జరుగుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ap-ssc-class-10-spot-valuation-2023-begins-result-likely-in-2nd-week-of-may-39306/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top