APOSS ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026కు సంబంధించిన అధికారిక టైమ్‌టేబుల్ విడుదలైంది. సబ్జెక్టు వారీ తేదీలు, సమయాలు, ముఖ్య సూచనలు ఇక్కడ చూడండి.
AP Open Inter Exams 2026APOSS ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026 వివరాలు (APOSS Intermediate Public Exams March 2026 Details): ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS), అమరావతి, మార్చి 2026లో జరగబోయే SSC మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల అధికారిక టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలు దూరవిద్య విద్యార్థులు మరియు ప్రైవేట్ అభ్యర్థులకు తమ విద్యార్హత పూర్తిచేసుకునేందుకు కీలక అవకాశంగా ఉంటాయి. చాలాకాలంగా ఈ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది స్పష్టమైన దిశను చూపిస్తోంది.
APOSS ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు మార్చి 2, 2026 నుండి ప్రారంభమవుతాయి. అన్ని పరీక్షలు ఉదయ సెషన్‌లోనే ఉంటాయి. పరీక్ష సమయం ఉదయం 09:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఉంటుంది . సబ్జెక్టు వారీగా వేర్వేరు తేదీల్లో పరీక్షలు నిర్వహించబడతాయి కనుక అభ్యర్థులు తమకు సంబంధించిన తేదీలను ముందుగా గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం.
థియరీ పరీక్షల అనంతరం ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 18, 2026 వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారాలు సహా అన్ని రోజుల్లో జరగుతాయి. అందుచేత విద్యార్థులు హాల్ టికెట్‌లోని తేదీ, సమయం మరియు పరీక్ష కేంద్ర వివరాలు ఖచ్చితంగా పరిశీలించి, ఎలాంటి గందరగోళం లేకుండా సిద్ధంగా ఉండాలి.
APOSS ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్‌టేబుల్ మార్చి 2026 (APOSS Intermediate Public Examination Timetable March 2026)
ఈ క్రింది పట్టికలో APOSS నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టు వారీ తేదీలు మరియు పరీక్షల వివరాలు ఇవ్వబడ్డాయి.
రోజు | తేదీ | సబ్జెక్ట్ కోడ్ & సబ్జెక్ట్ పేరు |
|---|---|---|
1వ రోజు | మార్చి 02,2026 | 302 – ఇంగ్లీష్ |
2వ రోజు | మార్చి 05,2026 | 301 – హిందీ / 305 – తెలుగు / 306 – ఉర్దూ |
3వ రోజు | మార్చి 07,2026 | 313 – కెమిస్ట్రీ / 318 – ఎకనామిక్స్ / 331 – సోషియాలజీ |
4వ రోజు | మార్చి 09,2026 | 312 – ఫిజిక్స్ / 317 – పాలిటికల్ సైన్స్ (సివిక్స్) / 328 – సైకాలజీ |
5వ రోజు | మార్చి 11,2026 | 311 – మ్యాథమెటిక్స్ / 315 – హిస్టరీ / 320 – బిజినెస్ స్టాటిస్టిక్స్ |
6వ రోజు | మార్చి 13,2026 | 314 – బయాలజీ / 319 – కామర్స్ (బిజినెస్ స్టడీస్) / 321 – హోమ్ సైన్స్ |
APOSS SSC పబ్లిక్ పరీక్షలు 2026 ముఖ్య సమాచారం & తప్పనిసరి సూచనలు (APOSS SSC Public Exams 2026 Important Information & Mandatory Instructions)
ఈ క్రింది అంశాలు APOSS ద్వారా నిర్వహించే SSC పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వివరాలు.
- APOSS SSC అభ్యర్థుల పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026 నుండి ప్రారంభం అవుతాయి.
- ఈ పరీక్షలు తెలుగు, ఉర్దూ, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు.
- SSC థియరీ పరీక్షల సమయం ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది.
- అభ్యర్థులు హాల్ టికెట్ లో సూచించిన సబ్జెక్టులకే పరీక్ష రాయాలి.
- పరీక్ష ప్రారంభంలోనే మీ సబ్జెక్టుకు సరైన ప్రశ్నాపత్రం అందిందో లేదో తప్పనిసరిగా నిర్ధారిన్బచుకోవాలి.
- తప్పు ప్రశ్నాపత్రంతో పరీక్ష రాయడం వాళ్ళ డిస్క్వాలిఫై అయ్యే అవకాశముంది.
- హాల్ టికెట్ లో పేర్కొన్న పరీక్ష కేంద్రానికి మాత్రమే హాజరు కావాలి.
- ఇతర పరీక్ష కేంద్రాల్లో రాసిన పరీక్షలు రద్దు చేయబడతాయి.
APOSS SSC, ఇంటర్మీడియట్ పరీక్షలు 2026 షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. అభ్యర్థులు తేదీలు, సమయాలు గమనించి పరీక్షలకు సిద్ధంగా ఉండాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.










