APPSC గ్రూప్ 1 ఫలితాల తేదీ 2023( APPSC Group 1 Result 2023): జనవరి చివరి వారంలో ఫలితాల ప్రకటన వెలువడవచ్చు

Guttikonda Sai

Published On:

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు  ( APPSC Group 1 Result 2023) అధికారిక వెబ్సైటు psc.ap.gov.in ద్వారా విడుదల చేస్తారు. అభ్యర్థులు కటాఫ్ మార్కులను ,  ఫలితాలను మరియు ఏపీపిఎస్సీ గురించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో పొందవచ్చు.

APPSC గ్రూప్ 1 ఫలితాల తేదీ 2023( APPSC Group 1 Result 2023): జనవరి చివరి వారంలో ఫలితాల ప్రకటన వెలువడవచ్చు

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు 2023 ( APPSC Group 1 Result 2023): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC) గ్రూప్ 1 అభ్యర్థులకు పరీక్షల ప్రక్రియను పూర్తి చేసింది. గ్రూప్ 1 అభ్యర్థులు జనవరి 8, 2023 తేదీన తమ పరీక్షలు వ్రాశారు. అధికారులు త్వరలో ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలను ( APPSC Group 1 Result 2023)విడుదల చేయనున్నారు. ఏపీపిఎస్సీ గ్రూప్ 1 అక్టోబర్ 2022 లో మొత్తం 92 పోస్టులకు నోటిికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జనవరి 2023 లో వారి పరీక్షలకు హాజరు అయ్యారు. కేవలం 92 పోస్టులకు కొన్ని వేల మంది అభ్యర్థులు హాజరు అవ్వడంతో గ్రూప్ 1 పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంది. ఫలితాలు( APPSC Group 1 Result 2023) విడుదల కోసం అభ్యర్థులు ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. జనవరి నెల చివరి వారంలో ఈ ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాల విడుదల తేదీలు2023 ( APPSC Group 1 Result Dates 2023)

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాల పూర్తి సమాచారం క్రింది పట్టిక లో గమనించవచ్చు.

రిక్రూట్మెంట్ అధారిటీ

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

పరీక్ష పేరు

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష

మొత్తం ఖాళీలు

92

ఫలితాలు విడుదల తేదీ

జనవరి 2023 చివరి వారం

అధికారిక వెబ్సైట్

psc.ap.gov.in

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు 2023 చెక్ చేసుకోవడం ఎలా? ( How to Check APPSC Group 1 Result 2023)

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలను( APPSC Group 1 Result 2023) ఈ క్రింద వివరించిన స్టెప్స్ అనుసరించి చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వారి ఫలితాలను చెక్ చేసుకోవడానికి అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అవసరం అవుతాయి.
  • ఏపీపిఎస్సీ అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in ఓపెన్ చేయండి.
  • ఇక్కడ " Announcements " మీద క్లిక్ చేయండి.
  • అనౌన్స్మెంట్ లిస్ట్ లో ఉన్న " APPSC Group 1 Result " మీద క్లిక్ చేయండి.
  • మీ అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు పూర్తి చేసిన తర్వాత " Submit " మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం మీ ఫలితాన్ని సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 కటాఫ్ మార్కులు 2023 - అంచనా ( APPSC Group 1 Expected Cutoff score 2023)

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థుల కటాఫ్ మార్కులు (అంచనా) ఈ క్రింది పట్టిక లో కేటగిరీ ప్రకారంగా వివరించబడింది.

కేటగిరీ

కటాఫ్ మార్కులు ( అంచనా)

జనరల్

114-120

BC

109-114

SC/ST

100-109


ఈ పట్టిక లో ఇచ్చిన కటాఫ్ మార్కులు అంచనా మాత్రమే అని అభ్యర్థులు గమనించాలి.

ఏపీపిఎస్సీ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.


/news/appsc-group-1-result-2023-expecetd-date-35225/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top