APPSC Group 2 Recruitment 2023: APPSC గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే?

Rudra Veni

Updated On: January 10, 2024 01:39 PM

APPSC గ్రూప్ 2 పోస్టులకు (APPSC Group 2 Recruitment 2023) అప్లై చేసుకోవడనికి గడువు పొడిగించడం జరిగింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 17 చివరి తేదీలోపు అప్దై చేసుకోవాలి.
APPSC Group 2 Recruitment 2023: APPSC గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే?APPSC Group 2 Recruitment 2023: APPSC గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే?

APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ 2023 (APPSC Group 2 Recruitment 2023): ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 (APPSC GROUP 2) పోస్టులకు దరఖాస్తు (APPSC Group 2 Recruitment 2024 Registration) చేసుకునేందుకు గడువును పొడిగించడం జరిగింది. అభ్యర్థులు జనవరి 17, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  ప్రభుత్వ శాఖల్లో 897  ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమించేందుకు డిసెంబర్ 7వ తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  APPSC గ్రూప్ 2 దరఖాస్తు ప్రక్రియ 21 డిసెంబర్ 2023న ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు తమకు నచ్చిన పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.  APPSC గ్రూప్ 2 పోస్టులకు ఆన్‌లైన్‌లో తప్ప మరే విధంగానూ అప్లై చేసుకోవడానికి  అవకాశం  లేదు. అందుకే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

APPSC గ్రూప్ 2 పోస్టుల అప్లికేషన్ డైరక్ట్ లింక్ ( APPSC Group 2 Posts Application Direct Link)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి డైరక్ట్ లింక్‌ని ఈ దిగువున అందజేశాం.
APPSC గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి డైరక్ట్ లింక్

APPSC GROUP 2కు అర్హత ప్రమాణాలు ( APPSC GROUP 2 Education Qualification and Eligibility)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ దిగువున తెలిపిన అర్హత ప్రమాణాలు ఉండాలి. ఆ  అర్హతలున్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు.
  • అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లు ఉండాలి.
  • ఆంధ్రప్రదేశ్ నివాసై ఉండాలి.
  • అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to apply for the APPSC Group 2 Recruitment 2023)

APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్‌ పోస్టులకు అప్లై చేసుకునే విధానం ఈ దిగువున తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు psc.ap.gov.in లో APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోంపేజీలో ఇవ్వబడిన దరఖాస్తు చేయడానికి APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023 డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అనంతరం  అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • తర్వత అభ్యర్థులు దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి. దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • సమర్పించుపై క్లిక్ చేసి, పేజీని డౌన్‌లోడ్ చేయాలి.
  • తదుపరి అవసరం కోసం అదే హార్డ్ కాపీని ఉంచాలి.

ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి జనరల్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.250,  ప్రాసెసింగ్ ఫీజు  రూ.80 లు చెల్లించాలి. SC, ST, BC, PBDలు & ఎక్స్-సర్వీస్ మెన్, అనేక ఇతర కేటగిరీలు పరీక్ష ఫీజు రూ.80లు చెల్లించక్కర్లేదు.  నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ఉపయోగించి చెల్లింపు గేట్‌వేని ఉపయోగించి ఫీజు చెల్లింపు ఆన్‌లైన్‌లో చేయబడుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/appsc-group-2-application-last-date-2023-48766/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy