APRCJ 2026 ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్ పొందే అవకాశం పొందవచ్చు.
APRCJ 2026 Regestration ProcessAPRCJ 2026 రిజెస్ట్రేషన్ ప్రక్రియ వివరాలు (APRCJ 2026 Registration Process Details): ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు (APRJC) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం APRJC CET (కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APREIS) నిర్వహిస్తుంది. CET ద్వారా విద్యార్థులకు MPC, BiPC, MEC, CEC వంటి ఇంటర్ గ్రూపులలో అడ్మిషన్ లభిస్తాయి. రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు నాణ్యమైన బోధనతోపాటు ఉచిత వసతి, భోజనం మరియు ఇతర అవసరకరమైన సదుపాయాలను కూడా కల్పిస్తాయి. అందుకే ప్రతి సంవత్సరం చాలా మంది SSC పూర్తి చేసిన విద్యార్థులు ఈ పరీక్షకు అప్లై చేస్తారు. మంచి విద్యా వాతావరణంలో ఇంటర్మీడియట్ చదవాలనుకునే వారికి APRJC మంచి అవకాశం.
2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన APRJC 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. SSC (10వ తరగతి) పూర్తి చేసినవారు లేదా 2026 SSC పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేయవచ్చు. సాధారణంగా అభ్యర్థులైనవారు కనీసం 60% మార్కులు లేదా 6.0 GPA పొందినట్లైతే అర్హత కలిగి ఉంటారు. ఎంపిక పూర్తిగా ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఈ పరీక్షకు అప్లై చేయడానికి అన్ని వర్గాల విద్యార్థులు రూ.300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం ఉంటుంది.
APRJC CET 2026 ముఖ్యమైన తేదీలు (APRJC CET 2026 Important Dates)
APRJC CET 2026కు సంబంధించిన నోటిఫికేషన్ నుంచి పరీక్ష వరకు ముఖ్యమైన షెడ్యూలును ఈ క్రింది టేబుల్ లో చూడవచ్చు.
వివరాలు | తేదీలు |
|---|---|
APRJC CET 2026 నోటిఫికేషన్ విడుదల తేదీ | ఫిబ్రవరి 16,2026 |
APRJC CET 2026 ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం | ఫిబ్రవరి 16,2026 |
APRJC CET 2026 దరఖాస్తు చివరి తేదీ | మార్చి 31,2026 |
APRJC CET 2026 హాల్ టికెట్ విడుదల | ఏప్రిల్ 15,2026 |
APRJC CET 2026 పరీక్ష తేదీ | ఏప్రిల్ 24,2026 |
APRJC CET 2026 ఫలితాల తేదీ | మే 15,2026 |
APRJC CET 2026కి ఎలా దరఖాస్తు చేయాలి ? (How to apply for APRJC CET 2026?)
APRJC CET 2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఈ క్రింది విధముగా అప్లికేషన్ పూర్తి చేయవచ్చు.
ముందుగా అధికారిక వెబ్‌సైట్ aprs.apcfss.in ను ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో కనిపించే APRJC CET 2026 Appilication లింకుపై క్లిక్ చేయాలి.
మొదట అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఫీజు చెల్లించిన తర్వాత వచ్చే జర్నల్ నెంబర్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
అప్లికేషన్ ఫారమ్ లో వ్యక్తిగత, విద్యా వివరాలను నమోదు చేయాలి.
పాస్ పోర్ట్ సైజు ఫోటో మరియు అవసరమైన డాక్యూమెంట్లు అప్లోడ్ చేయాలి
కావలసిన ఇంటర్ గ్రూప్ (MPC/BiPC/MEC/CEC)ను ఎంపిక చేయాలి.
అన్ని వివరాలు సరిచూసుకుని చివరగా అప్లికేషన్ ను సమర్పించాలి.
భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకుని ఉంచుకోవాలి.
APRJC 2026 ద్వారా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదవడానికి మంచి అవకాశం విద్యార్థులకు లభిస్తుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో గడువు ముగియకుండానే దరఖాస్తు చేసి ప్రవేశ పరీక్షకు సిద్ధం అవ్వాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

