బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు: RBI, SBI, IDBI, CBIలో 2,171 పోస్టులు

manohar

Published On:

దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో మొత్తం 2,171 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. RBI, SBI, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IDBIలోని పోస్టులకు దరఖాస్తు గడువులు త్వరలో ముగిననున్నాయి. బ్యాంకు ఉద్యోగాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

2171 Bank Jobs2171 Bank Jobs

బ్యాంకింగ్ రంగంలో భారీ ఉద్యోగ అవకాశాలు (Huge job opportunities in the banking sector): ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నఅభ్యర్థులకు మంచి అవకాశంగా మారింది. దేశంలోని ప్రముఖ బ్యాంకులు RBI, SBI, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IDBI కలిపి మొత్తం 2,171 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఇందులో అసిస్టెంట్, స్పెషలిస్టులు, అసిస్టెంట్ మేనేజర్ వంటి వివిధ పోస్టులు ఉన్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో స్థిరమైన కెరీర్ కోరుకునే యువతకు ఇవి మంచి అవకాశాలు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంగా ఉండగా, గడువు దగ్గరికి వస్తున్నందున అభ్యర్థులు అప్లై చేయడం మంచిది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు (Specialist Officer Posts for Central Bank of India)

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI)లో 275 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి ఐటీ ఆఫీసర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటా సైంటిస్ట్, రిస్క్ మేనేజర్, డిజిటల్ అప్లికేషన్ స్పెషలిస్ట్ , సాఫ్ట్‌వేర్ డెవలపర్, క్లౌడ్ మేనేజర్ వంటి పలు టెక్నికల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో B.Tech, MBA లేదా పీజీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి బ్యాంకు నిబంధనల ప్రకారం మంచి జీతభత్యాలు మరియు ఇతర సౌకర్యాలు లభిస్తాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో నమోదు చేసుకుని మార్చి 23లోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి .

RBIలో అసిస్టెంట్ ఉద్యోగాలు (Assistant Jobs in RBI)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఈ ఖాళీలు హైదరాబాద్, ముంబై, చెన్నై, కాన్పూర్, లక్నో, సూరత్ వంటి పలు ప్రాంతాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు మరియు భాషా నైపుణ్య పరీక్ష ఆధారంగా జరుగుతుంది.

IDBI, SBIలో కూడా అవకాశాలు (Opportunities also in IDBI, SBI)

SBIలో 116 స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులు, అలాగే IDBI బ్యాంకులో 1,300 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. సంబంధిత అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/bank-jobs-2026-rbi-sbi-idbi-cbi-2171-posts-apply-last-date-78089/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top