BARC Recruitment 2023: 4374 ఉద్యోగాలు, నెలకు రూ. 56,100 జీతం, పూర్తి వివరాలు ఇవే

Rudra Veni

Published On:

బాబా అణు పరిశోధనాల కేంద్రం (BARC) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ (BARC Recruitment 2023) అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4374 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి నెలకు రూ.56,100 జీతం అందుతుంది. 
 
BARC Recruitment 2023: 4374 ఉద్యోగాలు, నెలకు రూ. 56,100 జీతం, పూర్తి వివరాలు ఇవేBARC Recruitment 2023: 4374 ఉద్యోగాలు, నెలకు రూ. 56,100 జీతం, పూర్తి వివరాలు ఇవే

BARC రిక్రూట్‌మెంట్ 2023 (BARC Recruitment 2023): ముంబై ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన బాబా అణు పరిశోధనాల కేంద్రం (BARC) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ (BARC Recruitment 2023) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4374 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ ట్రైనింగ్ స్కీం విధానంలో డీఏఈ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 22 దరఖాస్తులకు చివరి తేదీ. BARC DAE రిక్రూట్‌మెంట్‌పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు, ఈ ఉద్యోగ అవకాశం కోసం నమోదు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అందించిన రిక్రూట్‌మెంట్‌పై పూర్తి సమాచారాన్ని పొందడానికి ఈ ఆర్టికల్‌ను చదవొచ్చు.

BARC రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌

BARC టెక్నికల్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2023 వివరాలు (BARC Technical Officer Recruitment 2023 Overview)

BARC రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించడం జరిగింది.
రిక్రూట్‌మెంట్ సంస్థ బాబా అణు పరిశోధనాల కేంద్రం
పోస్ట్ పేరు టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ & స్టైపెండరీ ట్రైనీ
ఖాళీల సంఖ్య 4374
కేటగిరి ఇంజనీరింగ్ జాబ్స్
దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ 24, 2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 22, 2023
సెలక్షన్ విధానం సీబీటీ టెస్ట్ ఇంటర్వ్యూ
బార్క్ రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక వెబ్‌సైట్ https://barconlineexam.com


BARC టెక్నికల్ ఆఫీసర్ ఖాళీల 2023 వివరాలు (BARC Technical Officer Vacancy 2023)

BARC రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన ఖాళీల వివరాలు ఈ కింద టేబుల్లో అందించడం జరిగింది. చెక్ చేయవచ్చు.
పోస్టు పేరు ఖాళీలు
టెక్నికల్ ఆఫీసర్ (గ్రూప్ ఏ) 181
సైంటిఫిక్ అసిస్టెంట్ (గ్రూప్ బీ) 07
టెక్నిషియన్ (గ్రూప్ సీ) 24
కేటగిరి 1 1216
కేటగిరి 2 2946
మొత్తం ఖాళీలు 4374

BARC రిక్రూట్‌మెంట్ 2023 అర్హతలు (BARC Recruitment 2023 Educational Qualification)

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.
పోస్టు పేరు ఎడ్యుకేషన్ వివరాలు
టెక్నికల్ ఆఫీసర్ బీఈ, బీటెక్, ఎంఎస్సీ
సైంటిఫిక్ ఆఫీసర్ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, హోంసైన్స్
టెక్నిషియన్ పదో తరగతి పాసై ఉండాలి
స్టైఫండరీ ట్రైనీ కేటగిరి 1 బీఎస్సీ
స్టైఫండరీ ట్రైనీ కేటగిరి 2 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా

BARC రిక్రూట్‌మెంట్ 2023 జీతభత్యాలు (BARC Recruitment 2023 Salary)

ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి మంచి జీతం అందుతుంది. పోస్టును బట్టి జీతాల ఉంటాయి. టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.56,100, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.35,400లు జీతం ఇవ్వడం జరుగుతుంది. మిగతా పోస్టులకు రూ.21000ల నుంచి రూ.26,000ల వరకు జీతం ఉంటుంది.

BARC రిక్రూట్‌మెంట్ 2023 ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి? (How to Apply Online for BARC Recruitment 2023?)

BARC రిక్రూట్‌మెంట్ 2023 ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో? ఇక్కడ తెలుసుకోండి
  • BARC రిక్రూట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌ను https://barconlineexam.com సందర్శించాలి
  • వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి
  • దరఖాస్తు ఫార్మ్‌లో వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • అభ్యర్థి ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఫీజు చెల్లించిన తర్వాత చివరిగా దరఖాస్తు ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫార్మ్‌ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/barc-recruitment-2023-notification-for-4374-posts-39648/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top