CBSE 10th Result 2023 Date and Time: CBSE పదో తరగతి ఫలితాలు 2023 ఎప్పుడు విడుదలవుతాయంటే?

Rudra Veni

Published On:

CBSE పదో తరగతి పరీక్షలు మార్చి 21, 2023తో ముగిశాయి. ఈ పరీక్షల ఫలితాలు (CBSE 10th Result 2023 Date and Time)  త్వరలో విడుదలకానున్నాయి. విద్యార్థులు తమ పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. తమ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలియజేశాం. 
 
CBSE 10th Result 2023 Date and Time: CBSE పదో తరగతి ఫలితాలు 2023 ఎప్పుడు విడుదలవుతాయంటే?CBSE 10th Result 2023 Date and Time: CBSE పదో తరగతి ఫలితాలు 2023 ఎప్పుడు విడుదలవుతాయంటే?

CBSE 10వ తరగతి ఫలితాలు 2023 తేదీ, సమయం (CBSE 10th Result 2023 Date and Time): CBSE బోర్డ్ 2022-23 సెషన్‌కు 10వ తరగతి బోర్డ్ పరీక్షలు ఫిబ్రవరి 15, 2023 తేదీన మొదలై మార్చి 21, 2023న ముగిశాయి. ప్రస్తుతం CBSE 10వ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీబీఎస్‌సీ పదో తరగతి ఫలితాలు (CBSE 10th Result 2023 Date and Time) త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. CBSE పదో తరగతి ఫలితాలను (CBSE 10th Result 2023 Date and Time) ఎప్పుడైనా ప్రకటించవచ్చు.

ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ CBSE 10వ తరగతి రిజల్ట్స్‌ని ఆన్‌లైన్ మోడ్‌లో అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్, పాఠశాల నెంబర్, పుట్టిన తేదీ, అడ్మిట్ కార్డ్ IDని నమోదు చేసి వారి CBSE 10వ తరగతి ఫలితాలను 2023 చూసుకోవచ్చు. CBSE 10వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌ cbseresults.nic.in, cbse.gov.in లలో అందుబాటులో ఉంటాయి. గత ట్రెండ్‌లు, ఇటీవలి CBSE సమాచారం ఆధారంగా 10వ తరగతి ఫలితాలు మే 2023లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే CBSE ఫలితాల ప్రకటనకు సంబంధించి ఎలాంటి తేదీ లేదా సమయాన్ని ఇంకా వెల్లడించ లేదు.

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు 2023 వివరాలు ( CBSE 10th result 2023 – Highlights)

సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది.

పరీక్షల నిర్వహణ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15, 2023 నుంచి మార్చి 21, 2023
పదో తరగతి ఫలితాల విడుదల తేదీ తెలియాల్సి ఉంది

CBSE 10వ తరగతి ఫలితాలు 2023 ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి? (How to Check CBSE 10th Result 2023 Online?)

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. ఈ దిగువున తెలియజేసిన స్టెప్స్‌ని ఫాలో అయి పదో తరగతి ఫలితాలను తెలుసుకోవచ్చు.
  • విద్యార్థులు ముందుగా cbse.gov.in అధికారిక వెబ్‌సైట్ లేదా cbseacademic.nic.in లో దాని అకడమిక్ వెబ్‌సైట్‌ని సందర్శించాలి.
  • హోమ్ పేజీలో CBSE 10వ తరగతి రిజల్ట్ 2023 లింక్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో విద్యార్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
  • అనంతరం పదో తరగతి ఫలితాలు కనిపిస్తాయి.
  • తర్వాత చెక్ చేసుకుని డౌన్‌లోడ్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి.
తెలుగులో మరిన్ని వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/cbse-10th-result-to-be-out-soon-38569/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top