త్వరలో CSIR NET నోటిఫికేషన్ 2023(CSIR NET 2023 Notification): మే లేదా జూన్ లో పరీక్ష జరగనుంది

Guttikonda Sai

Published On:

CSIR NET 2023 నోటిఫికేషన్ (CSIR NET 2023 Notification) త్వరలో విడుదల కానుంది, అభ్యర్థులు csirnet.nta.nic.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. CSIR NET 2023 పరీక్షలు 2023 మే లేదా జూన్  నెలలో ప్రారంభం కానున్నాయి.
త్వరలో CSIR NET నోటిఫికేషన్ 2023: మే లేదా జూన్ లో పరీక్ష జరగనుంది

CSIR NET 2023 నోటిఫికేషన్ ( CSIR NET 2023 Notification) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో ది కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR NET 2023) నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. డిసెంబర్ 2022 లో జరగాల్సిన CSIR NET 2022 సెషన్ ను , CSIR NET 2023 మొదటి సెషన్ తో కలిపి నిర్వహించనున్నట్లు HRDGCSIR అధికారికంగా వెల్లడించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ csirnet.nta.nic.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. CSIR NET 2023 పరీక్షలు మే 2023 లేదా జూన్ 2023 నెలలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి Ph.D కోసం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ( JRF) స్తైఫండ్ ను అందిస్తుంది. CSIR NET 2023 పరీక్షలో అర్హత సాధించిన వారు Ph.D అప్లై చేసుకోవడానికి లేదా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు మరియు కళాశాలలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు.

CSIR NET 2023 ముఖ్యమైన తేదీలు ( CSIR NET 2023 Important Dates)

CSIR NET 2023 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన ముఖ్యమైన తేదీలు క్రింద ఇవ్వబడిన పట్టిక లో గమనించవచ్చు.

కార్యక్రమం

తేదీ (అంచనా)

నోటిఫికేషన్ విడుదల

జనవరి 2023

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ

ఫిబ్రవరి 2023

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ

మార్చి 2023

కరెక్షన్ విండో తేదీలు

మార్చి 2023

అడ్మిట్ కార్డు విడుదల
ఏప్రిల్ 2023

పరీక్ష తేదీలు

మే /జూన్ 2023.

CSIR NET 2023 కు దరఖాస్తు చేసుకునే విధానం ( How to Apply CSIR NET 2023)

CSIR NET 2023 కు అప్లై చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వాలి.

  • CSIR NET 2023 అధికారిక వెబ్సైట్ csirnet.nta.nic.in ఓపెన్ చేయండి.
  • "CSIR NET UGC Online Registration " మీద క్లిక్ చేయండి.
  • అప్లికేషన్ లో మీ వివరాలను పూర్తి చెయ్యండి.
  • మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం ను అప్లోడ్ చేయండి.
  • ఆన్లైన్ లో దరఖాస్తు ఫీజు చెల్లించండి.
  • పూర్తి చేసిన అప్లికేషన్ ను, ఫీజు రీసిప్ట్ ను సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

CSIR NET 2023 ఏజ్ లిమిట్ ( CSIR NET 2023 Age Limit)

CSIR NET 2023 కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయసు 28 సంవత్సరాలు ఉండాలి. CSIR NET 2023 అభ్యర్థులకు గరిష్ఠ వయసు కు ఎటువంటి లిమిట్ లేదు. కాబట్టి 28 సంవత్సరాలు దాటిన వారు అప్లై చేసుకోవచ్చు.

CSIR NET 2023 అప్లికేషన్ ఫీజు ( CSIR NET 2023 Application Fee)

CSIR NET 2023 కు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల కు అప్లికేషన్ ఫీజు వారి కేటగిరీ ప్రకారంగా ఈ క్రింది పట్టిక లో వివరించబడింది.

కేటగిరీ

ఫీజు

జనరల్ కేటగిరీ

1000/- రూపాయలు

OBC

500/- రూపాయలు

SC/ ST

250/- రూపాయలు

PwD

ఫీజు లేదు.

CSIR NET 2023 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

/news/csir-net-2023-notifciation-very-soon-expected-exam-date-35632/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి