CUET PG 2026 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ exams.nta.nic.in ద్వారా తమ హాల్ టికెట్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు .CUET PG అడ్మిట్ కార్డు గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
CUET PG 2026 Admit Cards Released at exams.nta.nic.inCUET PG 2026 అడ్మిట్ కార్డులు విడుదల (CUET PG 2026 Admit Cards Released): జాతీయ పరీక్ష సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) CUET PG 2026 అడ్మిట్ కార్లు విడుదల చేసింది. ఈ పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ exams.nta.nic.in/cuet-pg ద్వారా తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డు పొందేందుకు అభ్యర్థులు అప్లికేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి స్టూడెంట్ లాగిన్‌లోకి ప్రవేశించాలి. CUET PG 2026 పరీక్షలు మార్చి 6 నుంచి మార్చి 27, 2026 వరకు దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించబడనున్నాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
అడ్మిట్ కార్డులోని పేర్కొన్న వివరాలను అభ్యర్థులు జాగ్రత్తగా పరిశీలించాలి. పేరు, ఫోటో, సంతకం, రోల్ నంబర్, పరీక్ష కేంద్రం చిరునామా వంటి ఏదైనా తప్పు కనిపిస్తే వెంటనే NTA అధికారులను సంప్రదించాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడంలో లేదా లాగిన్ సమస్యలు వస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 011-40759000 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. పరీక్ష కేంద్రానికి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లండి, లేకపోతే పరీక్ష హాల్‌కి ప్రవేశం ఇవ్వబడదు. తాజా పరీక్షా అప్డేట్స్ మరియు పూర్తి వివరాల కోసం collegedekho ని సందర్శించండి.
CUET PG 2026 అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to download CUET PG 2026 Admit Card?)
CUET PG 2026 పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి సులభంగా తమ హాల్ టికెట్ ఈ క్రింది విధముగా డౌన్‌లోడ్ చేయుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ exams.nta.nic.in/cuet-pg ను ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో కనిపించే CUET PG 2026 Admit Card లింక్‌పై క్లిక్ చేయండి.
- లాగిన్ పేజీలో మీ అప్లికేషన్ నంబర్ మరియు పాస్ వర్డ్ నమోదు చేయండి.
- తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
- స్క్రీన్‌పై మీ CUET PG 2026 అడ్మిట్ కార్డు కనిపిస్తుంది.
- అప్పుడు అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
- పరీక్షకు వెళ్లేటప్పుడు హాల్ టికెట్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లండి.
CUET PG 2026 పరీక్ష తేదీలు మరియు పరీక్ష విధానం (CUET PG 2026 Exam Dates and Exam Pattern)
CUET PG 2026 పరీక్షలు మార్చి 6 నుండి మార్చి 27,2026 వరకు దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించబడతాయి. ఈ పరీక్షలు రోజుకు 2 నుండి 3 షిఫ్టుల్లో ఉంటాయి. మొత్తం 44 షిఫ్టుల్లో నిర్వహించబడగా, ప్రతి షిఫ్ట్ 90 నిమిషాల పాటు ఉంటుంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం పరీక్షలు మార్చి 6,7,8,9,10,11,12,13,16,17,18,19,24,25 మరియు 27 తేదీల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులో పేర్కొన్న షిఫ్ట్ మరియు సమయానికి అనుగుణంగా పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోవాలి.
CUET PG 2026 అడ్మిట్ కార్డులు విడుదల కావడంతో అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్ వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్ష తేదీలు, షిఫ్ట్ సమయం మరియు పరీక్ష కేంద్రం వివరాలను ముందుగానే చూసుకుని అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

