DMHO Kurnool Recruitment 2023: కర్నూలు డీఎంహెచ్‌వో రిక్రూట్‌మెంట్, లక్షకుపైగా జీతం, పూర్తి వివరాలివే

Rudra Veni

Published On:

కర్నూలు డీఎంహెచ్‌వో నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ (DMHO Kurnool Recruitment 2023) విడుదలైంది.  18 పోస్టుల భర్తీకి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరిగింది. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి లక్ష రూపాయల వరకు జీతం ఉంటుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
DMHO Kurnool Recruitment 2023: కర్నూలు డీఎంహెచ్‌వో రిక్రూట్‌మెంట్, లక్షకుపైగా జీతం, పూర్తి వివరాలివేDMHO Kurnool Recruitment 2023: కర్నూలు డీఎంహెచ్‌వో రిక్రూట్‌మెంట్, లక్షకుపైగా జీతం, పూర్తి వివరాలివే

డీఎంహెచ్‌వో కర్నూలు రిక్రూట్‌మెంట్ (DMHO Kurnool Recruitment 2023): ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులోని మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం కర్నూలు అధికారులు 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల (DMHO Kurnool Recruitment 2023) కోసం డైరక్ట్ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. చివరి తేదీ మే 22, 2023. అభ్యర్థులు పూర్తి వివరాలను kurnool.ap.gov.in‌లో చూడొచ్చు.

DMHO కర్నూలు రిక్రూట్‌మెంట్ 2023 (DMHO Kurnool Recruitment 2023)

ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి వేలల్లో జీతం ఉంటుంది.

సంస్థ పేరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం కర్నూలు (DMHO కర్నూలు)
పోస్ట్ వివరాలు మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్
మొత్తం పోస్టుల సంఖ్య 18
జాబ్ లొకేషన్ కర్నూలు - ఆంధ్రప్రదేశ్
జాబ్ మోడ్ వాకిన్ ఇంటర్వ్యూ
అధికారిక వెబ్‌సైట్ kurnool.ap.gov.in

డీఎంహెచ్‌వో కర్నూలు రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు (DMHO Kurnool Recruitment required eligibility details)

DMHO కర్నూల్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాలలో ఇంటర్మీడియట్, DMLT, B.Sc, B.Z.C, GNM, MBBS, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ డిప్లొమా, MA, M.Phil, మాస్టర్స్ డిగ్రీ, MD పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం కర్నూలు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి గరిష్ట వయస్సు 17-మే-2023 నాటికి 65 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థుల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


డీఎంహెచ్‌వో కర్నూలు జీతం వివరాలు (DMHO Kurnool Salary Details)

డీఎంహెచ్‌వో కర్నూలు జీతభత్యాల వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

స్పెషలిస్ట్ MO-పీడియాట్రిషియన్ రూ.1,10,000 – 1,40,000
వైద్యాధికారి రూ. 53,495
క్లినికల్ సైకాలజిస్ట్ రూ. 33,075
ఆప్టోమెట్రిస్ట్ రూ. 24,310
లేబొరేటరీ టెక్నీషియన్ రూ. 19,019
స్టాఫ్ నర్స్ రూ. 22,500
జనరల్ ఫిజీషియన్ రూ.1,10,000

ఈ ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 22, 2023న జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి, కర్నూలులో అవసరమైన పత్రాలతో (అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా) వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే ముందు అభ్యర్థులు తమ అర్హత ప్రమాాణాలను ఒక్కసారి చెక్ చేసుకోవాలి.

మరిన్ని ఎడ్యుకేషన్. రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.

/news/dmho-kurnool-recruitment-2023-medical-officer-jobs-notification-details-here-40792/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top