DRDO Scientist B Jobs 2023: DRDO నుంచి ఉద్యోగ నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇవే

Andaluri Veni

Updated On: May 30, 2023 04:19 pm IST

DRDO రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ (DRDO Scientist B Jobs 2023) విడుదలైంది. వివిధ విభాగాలలో సైంటిస్ట్ B  181 ఖాళీలను భర్తీ చేయనుంది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ  తెలుసుకోండి.  
DRDO Scientist B Jobs 2023: DRDO నుంచి ఉద్యోగ నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇవేDRDO Scientist B Jobs 2023: DRDO నుంచి ఉద్యోగ నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇవే

డీఆర్‌డీవో సైంటిస్ట్ బీ ఉద్యోగాల 2023 (DRDO Scientist B Jobs 2023): ఢిల్లీలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO) ఆధ్వర్యంలో రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ) ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 181 సైంటిస్ట్‌ బీ పోస్టులను భర్తీ చేయడం (DRDO Scientist B Jobs 2023) జరుగుతుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ యొక్క రిక్రూట్‌మెంట్, అసెస్‌మెంట్ సెంటర్ వివిధ విభాగాల్లో 181 ఖాళీలను భర్తీ చేయడానికి 25 మే 2023న DRDO సైంటిస్ట్ B రిక్రూట్‌మెంట్ 2023 కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

DRDO సైంటిస్ట్ బీ రిక్రూట్‌మెంట్ 2023 (DRDO Scientist B Recruitment 2023) 

DRDO సైంటిస్ట్ బీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

DRDO సైంటిస్ట్ బీ నోటిఫికేషన్ రిలీజ్ మే 25, 2023
DRDO సైంటిస్ట్ బీ దరఖాస్తు ప్రారంభ తేదీ 30 మే, 2023
DRDO సైంటిస్ట్ బీ ముగింపు తేదీ     దరఖాస్తు ప్రక్రియ మొదలైన 21 రోజుల్లో అప్లై చేసుకోవాలి. (జూన్ 16 లాస్ట్ డేట్) 

DRDO సైంటిస్ట్ బీ ఖాళీల వివరాలు (DRDO Scientist B Vacancy Details)

DRDO సైంటిస్ట్ బీ ఖాళీల వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. 

ఎలక్ట్రానిక్స్,  కమ్యూనికేషన్ ఇంజనీరింగ్     47
మెకానికల్ ఇంజనీరింగ్     44
కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్  34
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్05
మెటరీయిల్ ఇంజనీరిగ్, మెటిరియల్ సైన్స్, ఇంజనీరింగ్10
ఫిజిక్స్    10
కెమిస్ట్రీ  05
కెమికల్ ఇంజనీరింగ్    13
ఏరోనాటికల్        07
మ్యాథ్స్02
సివిల్ ఇంజనీరింగ్ 02

DRDO సైంటిస్ట్ బీ అర్హత ప్రమాణాలు  (DRDO Scientist B Eligibility Criteria)

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు కచ్చితంగా బీఈ, బీటెక్, సంబంధిత స్ట్రీమ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. 
  • అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు ఉండాలి. 
  • ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి.  జనరల్, ఓబీసీ మగ అభ్యర్థులు రూ.100లు చెల్లించాలి
  • ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను గేట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.  ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి నెలకు రూ.56,100 వరకు జీతం అందించడం జరుగుతుంది.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/drdo-scientist-b-recruitment-2023-41110/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!