AP POLYCET Hall Ticket 2023 Date: AP POLYCET 2023 హాల్‌టికెట్‌లు ఎప్పుడు విడుదలవుతాయంటే?

Rudra Veni

Published On:

SBTET ఆంధ్రప్రదేశ్ మే 4 నాటికి అధికారిక వెబ్‌సైట్‌లో AP POLYCET హాల్ టికెట్‌లను (AP POLYCET Hall Ticket 2023 Date)  విడుదల చేస్తుంది. అభ్యర్థులు AP POLYCET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇక్కడ అందజేశాం. 
AP POLYCET Hall Ticket 2023 DateAP POLYCET Hall Ticket 2023 Date

ఏపీ పాలిసెట్ 2023 హాల్ టికెట్ల విడుదల డేట్ (AP POLYCET Hall Ticket 2023 Date): స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, విజయవాడ మే 4, 2023 నాటికి AP POLYCET హాల్ టికెట్ 2023ని విడుదల (AP POLYCET Hall Ticket 2023 Date) చేస్తుంది. AP POLYCET హాల్ టికెట్‌ని విడుదలకు సంబంధించిన అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. అధికారులు విడుదల చేసిన తర్వాత హాల్ టికెట్లు సంబంధిత వెబ్‌సైట్ polycet.ap.nic.in‌ లో అందుబాటులో ఉంటాయి. AP POLYCET 2023 హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు పదో తరగతి హాల్ టికెట్‌ నెంబర్, పుట్టిన తేదీ, పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం, క్యాప్చా కోడ్‌లను ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి. అభ్యర్థులు AP POLYCET 2023 హాల్ టికెట్‌ను ఫెసిలిటేషన్ సెంటర్‌ల నుంచి ఆఫ్‌లైన్ మోడ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం, AP పాలిసెట్ హాల్ టికెట్ మే 10, 2023న నిర్వహించబడుతుంది.

AP POLYCET 2023 హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download AP POLYCET 2023 Hall Ticket)

AP POLYCET 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని విజయవంతంగా సబ్మిట్ చేసిన అభ్యర్థులకు AP POLYCET హాల్ టికెట్లను జారీ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సెక్షన్‌లో AP POLYCET హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని తెలుసుకోవచ్చు.

  • ముందుగా అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, SBTET అధికారిక వెబ్‌సైట్‌‌ని సందర్శించాలి.
  • హోంపేజీలో AP POLYCET 2023 హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి.
  • తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి
  • AP POLYCET హాల్ టికెట్ పీడీఎఫ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
  • హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని 2, 3 ప్రింట్‌ అవుట్‌లను తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఇతర అవసరమైన పత్రాలతో పాటు హాల్ టికెట్‌ని తీసుకెళ్తున్నారని నిర్ధారించుకోవాలి. లేకుంటే వారు AP POLYCET 2023 పరీక్షకు హాజరు కావడానికి అనుమతించబడరు.

AP POLYCET 2023 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు దానిపై పేర్కొన్న వివరాలను చెక్ చేయాలి. వివరాలు తప్పుగా ఉన్నాయని నిర్ధారణ అయితే అభ్యర్థులు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి, పరీక్ష రోజులోపు సరిదిద్దుకోవాలి.

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్లకు సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు.

/news/engineering-ap-polycet-hall-ticket-2023-date-know-when-hall-ticket-is-expected-to-be-released-39880/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top