EPFO Recruitment 2023: నిరుద్యోగులకు మంచి ఛాన్స్, డిగ్రీ అర్హతతో 2674 ఉద్యోగాలు, నెలకు రూ.92000 జీతం

Rudra Veni

Published On:

EPFO జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2674 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
 
EPFO Recruitment 2023: నిరుద్యోగులకు మంచి ఛాన్స్, డిగ్రీ అర్హతతో 2674 ఉద్యోగాలు, నెలకు రూ.92000 జీతంEPFO Recruitment 2023: నిరుద్యోగులకు మంచి ఛాన్స్, డిగ్రీ అర్హతతో 2674 ఉద్యోగాలు, నెలకు రూ.92000 జీతం

EPFOలో ఉద్యోగాలు (EPFO Recruitment 2023): ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. EPFO వేలాది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దేశవ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన EPFO రీజియన్ల వారీగా 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులను (SSA గ్రూప్ సీ) భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియనర్లలో కూడా (EPFO Recruitment 2023) పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో అందించడం జరిగింది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఈ దిగువున ఇచ్చిన డైరక్ట్‌ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

EPFO ఉద్యోగ నోటిఫికేషన్ డైరక్ట్ లింక్

EPFO రిక్రూట్‌మెంట్ పూర్తి వివరాలు (EPFO Recruitment Overview)

EPFOలో 2674 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ రీజియన్ నుంచి 39, తెలంగాణ రీజియన్ నుంచి 116 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేశాం.
సంస్థ పేరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్
ఉద్యోగ వివరాలు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు
మొత్తం ఖాళీలు 2674
కేటగిరి ప్రభుత్వ ఉద్యోగం
అప్లికేషన్ విధానం ఆన్‌లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం మార్చి 27, 2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 26, 2023
అధికారిక వెబ్‌సైట్ www.epfindia.gov.in

EPFO‌లో ఉద్యోగాలకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు (Eligibility Criteria for EPFO ​​Jobs)


EPFOలో ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన అర్హతలు కచ్చితంగా ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు తమ అర్హతలను ఒక్కసారి చెక్ చేసుకోవాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ పాసై ఉండాలి.
  • నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు లేదా నిమిషానికి 30 హిందీ వర్డ్స్ కంప్యూటర్‌లో టైపింగ్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు,ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు సడలింపు ఉంటుంది.
  • అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.700లు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

EPFOలో ఉద్యోగాలకు అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే? (How Candidates are Selected for EPFO ​​jobs?)


EPFOలో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులను రాతపరీక్ష, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్ట్ చేయడం జరుగుతుంది.

EPFOలో ఉద్యోగాలకు రాతపరీక్షా విధానం (Written Test Procedure for Jobs in EPFO)

ఈ ఉద్యోగాల క ోసం అభ్యర్థులకు మొదట రాతపరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 600 మార్కులకు 2 గంటల, 30 నిమిషాల సమయంలో ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పరీక్షలో వివిధ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇవ్వడం జ రుగుతుంది.
  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌ సెక్షన్‌లో 30 ప్రశ్నలకు 120 మార్కులు
  • న్యూమరిక్‌ ఆప్టిట్యూడ్‌ సెక్షన్‌లో 30 ప్రశ్నలకు 120 మార్కులు
  • జనరల్ అవేర్‌నెస్ సెక్షన్‌లో 30 ప్రశ్నలకు 120 మార్కులు
  • ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ సెక్షన్‌లో 50 ప్రశ్నలకు 200 మార్కులు.
  • కంప్యూటర్ లిటరసి సెక్షన్‌లో 10 ప్రశ్నలకు 40 మార్కులు.
ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 27, 2023 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 26, 2023 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లో www.epfindia.gov.in‌ ని సందర్శించాలి.

/news/epfo-recruitment-38545/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top