JNTUH పరీక్షలు వాయిదా, ఇదే కారణం

Rudra Veni

Published On:

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) పరీక్షలు వాయిదా వేసింది. కొత్త తేదీలు వివరాలు ఇంకా వెల్లడించ లేదు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.  
JNTUH పరీక్షలు వాయిదా, ఇదే కారణంJNTUH పరీక్షలు వాయిదా, ఇదే కారణం

JNTUH పరీక్షలు వాయిదా (JNTUH Exams Postponed) : జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) పరీక్షలు వాయిదాపడ్డాయి. వర్షాలు కారణంగా JNTUH కీలకంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎడతెగని వర్షాలు పడుతుండడంతో ఆగస్ట్ 19, 2025న, ఆగస్ట్ 30, 2025 జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు వాయిదా వేసినట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటనలో వెల్లడించారు.
అయితే వాయిదా వేసిన పరీక్షలకు (JNTUH Exams Postponed) సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని JNTUH పేర్కొంది. అయితే పరీక్షల సమాచారం కోసం ఎప్పటికప్పుడు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులు సూచించారు. అయితే పరీక్షల వాయిదా నిర్ణయంతో పరీక్షలను ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కొంత ఊరట కలిగింది.
అంతేకాదు పరీక్షలకు రెడీ అవుతున్న విద్యార్థులకు మరింత సమయం దొరికినట్టైంది. విద్యార్థులు ఈ సెలవులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి. అదే సమయంలో విద్యార్థులు వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ jntuh.ac.inని చెక్ చేస్తూ ఉండాలి. యూనివర్సిటీ తర్వాత పరీక్షల షెడ్యూల్‌ని ఈ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టడం జరుగుతుంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత పరీక్షలు తిరిగి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.

దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు - పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు..


భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ఇచ్చాయి. అధిక వర్షాలు, వరద ప్రమాదాల కారణంగా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు అనేక ప్రాంతాలలో సెలవులు ప్రకటించాయి. స్థానిక సాంస్కృతిక ఆచారాలు, విద్యార్థుల భద్రత రెండింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి, మెదక్, కరీంనగర్, జగిత్యాల, యాదాద్రి భువనగిరిలోని పాఠశాలలు, కాలేజీలకు ఆగస్టు 29న జిల్లా విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. అదనంగా కరీంనగర్, జగిత్యాల, యాదాద్రి భువనగిరితో పాటు నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నల్గొండ ఇప్పటికే ఆగస్టు 28న సెలవు దినంగా ప్రకటించాయి. వరదల కారణంగా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/exams-postponed-at-jntuh-hyderabad-due-to-heavy-rains-2025-70433/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top