ఉచితంగా డిగ్రీ పూర్తి చేసే ఛాన్స్, BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొత్త పథకం, ఎవరు అర్హులంటే?

Rudra Veni

Published On:

BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా BRAOU ట్రాన్స్‌జెండర్, శారీరకంగా వికలాంగులు,  గిరిజన విద్యార్థులకు UG ప్రోగ్రామ్‌లకు ఉచిత విద్యను అందించనుంది.
ఉచితంగా డిగ్రీ పూర్తి చేసే ఛాన్స్, BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొత్త పథకం, ఎవరు అర్హులంటే?ఉచితంగా డిగ్రీ పూర్తి చేసే ఛాన్స్, BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొత్త పథకం, ఎవరు అర్హులంటే?

తెలంగాణ ఓపెన్ యూనివర్సిటీ అని కూడా పిలువబడే డాక్టర్ BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 'సమతా సపోర్ట్ స్కీమ్'ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా BRAOU ట్రాన్స్‌జెండర్, శారీరకంగా వికలాంగులు, గిరిజన విద్యార్థులకు UG ప్రోగ్రామ్‌లకు ఉచిత విద్యను అందించనుంది. దీంతో ఎంతోమంది విద్యార్థులు ఉచితంగా విద్యను పొందవచ్చు. అయతే ఇప్పటికే దేశంలోనే డిగ్రీ కోర్సులకు అతి తక్కువ ఫీజు వసూలు చేస్తున్నట్టు BRAOU పేర్కొంది. అంటే సంవత్సరానికి రూ. 3,200లు మాత్రమే వసూలు చేస్తుంది. కానీ అటవీ ప్రాంతంలో నివసించే గిరిజన పిల్లలకు ఈ ఫీజు కూడా భారంగా ఉంటుందని వర్సిటీ పేర్కొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, యూనివర్సిటీ ఫీజును పూర్తిగా మాఫీ చేయాలని యూనివర్సిటీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే 'గిరిజన ఉచిత విద్యా పథకం'ను ప్రారంభించింది.
ఈ పథకం కింద రాష్ట్రంలోని గోండ్, కోయ, చెంచు, ఇతర అటవీ వర్గాలకు చెందిన గిరిజన పిల్లలకు మద్దతు ఇవ్వబడుతుంది. వారికి ట్యూషన్ ఫీజు లేకుండా ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. నామమాత్రపు ప్రవేశ ఫీజు రూ.500 లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద రాబోయే ఐదు సంవత్సరాలలో కనీసం 1,000 మంది గిరిజన విద్యార్థులను గ్రాడ్యుయేట్ చేయాలనే లక్ష్యంతో విశ్వవిద్యాలయం వారికి పుస్తకాలు, ఆడియో విజువల్ వనరులను అందించాలని కూడా యోచిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 13 వరకు సమయం ఉంది. మరిన్ని వివరాలు braouonline.in/MISC/Samathascholarships.aspx లో అందుబాటులో ఉన్నాయి.

గిరిజన ఉచిత విద్యా పథకం - ఆదివాసీ యువత అర్హత ప్రమాణాలు (Tribal Free Education Scheme Eligibility Criteria)

గిరిజన ఉచిత విద్యా పథకానికి అర్హత పొందానికి ఆదివాసీ యువతకు ఉండాల్సిన ప్రమాణాలు ఈ దిగువున అందించాం.

  • అర్హత కలిగిన అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500లు చెల్లించాలి.

  • పైన పేర్కొన్న రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు అభ్యర్థులు పరీక్ష ఫీజును విడిగా చెల్లించాలి.

  • దరఖాస్తుదారు తెలంగాణ ప్రభుత్వ సమర్థ అధికారం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేయాలి.

  • కనీస అర్హత తెలంగాణ శాశ్వత నివాసితుల దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది.

  • తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పరిమితి రూ.2,00,000 (రెండు లక్షలు మాత్రమే)

  • అభ్యర్థి సమర్థ అధికారం నుంచి తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయాలి.

గిరిజన ఉచిత విద్యా పథకం - ట్రాన్స్‌జెండర్‌కి ఉండాల్సిన అర్హత ప్రమాణాలు

గిరిజన ఉచిత విద్యా పథకానికి అర్హత పొందానికి ట్రాన్స్‌జెండర్స్‌కు ఉండాల్సిన ప్రమాణాలు ఈ దిగువున అందించాం.

  • అర్హత కలిగిన అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500లు.

  • పైన పేర్కొన్న రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు అభ్యర్థులు పరీక్ష ఫీజును విడిగా చెల్లించాలి.

  • పట్టణ ప్రాంతాలకు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000లు.

  • గ్రామీణ ప్రాంతాలకు రూ.1,50,000లు.

  • వైట్ రేషన్ కార్డు

గిరిజన ఉచిత విద్యా పథకం - దివ్యాంగులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలు

  • అర్హత కలిగిన అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500లు. చెల్లించాలి.

  • పైన పేర్కొన్న రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు అభ్యర్థులు పరీక్ష ఫీజును విడిగా చెల్లించాలి.

  • తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వంలోని సమర్థ వైద్య బోర్డు జారీ చేసిన సాధారం సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేయాలి.

  • అర్హతకు అవసరమైన కనీస వైకల్య శాతం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

  • తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పరిమితి సంవత్సరానికి రూ.6,00,000ల వరకు ఉండవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/free-degree-courses-to-tribal-transgender-specially-abled-students-in-dr-br-ambedkar-open-university-69861/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top