IBPS క్లర్క్ పోస్టులు పెంపు, మొత్తం 13,533 ఉద్యోగాలు

manohar

Updated On: October 30, 2025 03:23 PM

IBPS క్లర్క్ 2025లో ఖాళీల సంఖ్య 10,696 నుండి 13,533కు పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఖాళీలు విడుదలయ్యాయి. ఖాళీల పూర్తి వివరాలను క్రింద చూడండి.

IBPS క్లర్క్ 2025లో భారీ పెంపు, మొత్తం 13,533 ఉద్యోగాలు
IBPS క్లర్క్ 2025లో భారీ పెంపు, మొత్తం 13,533 ఉద్యోగాలు

IBPS 2025 క్లర్క్ భారీగా ఖాళీలు (IBPS 2025 Clerk Vacancies): ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2025 క్లర్క్ రిక్రూట్‌మెంట్‌లో కీలక మార్పు చేసింది. మొత్తం 2,500 కొత్త ఖాళీలు జోడించడంతో ఉద్యోగాల సంఖ్య 10,696 నుండి 13,533కి పెరిగింది. IBPS ప్రకారం ఈ పెంపు ప్రభుత్వ బ్యాంకుల్లో సిబ్బంది అవసరాలు పెరగడమే కారణం. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో ఖాళీలు ఎక్కువగా పెరగగా, అవి 1,315 నుంచి 2,346కి చేరాయి. బీహార్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలో కూడా గణనీయమైన పెంపు కనిపించింది. మరోవైపు ఢిల్లీలో ఖాళీలు కొద్దిగా తగ్గించబడ్డాయి. IBPS క్లర్క్ ప్రిలిమినరీ పరీక్షలు అక్టోబర్ 4, 5 తేదీల్లో నిర్వహించబడ్డాయి మరియు ఫలితాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో IBPS అభ్యర్థులను తప్పుడు సమాచారానికి గురికాకుండా అభ్యర్థులు జాగ్రతగా ఉండాలని హెచ్చరించింది.

IBPS క్లర్క్ రాష్ట్రాల వారీగా 2025 ఖాళీల వివరాలు (IBPS Clerk 2025 Vacancy Details State-wise)

తాజా సమాచారం ప్రకారం IBPS క్లర్క్ పోస్టుల సంఖ్యను రాష్ట్రాల వారీగా ఇలా ప్రకటించారు.

రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం

ఖాళీలు

ఆండమాన్ & నికోబార్

15

ఆంధ్రప్రదేశ్

409

అరుణాచల్ ప్రదేశ్

36

అసోం

373

బిహార్

748

చండీగఢ్

13

ఛత్తీస్‌గఢ్

298

దాద్రా & నగర్ హవేలి, దమన్ & దియూ

43

ఢిల్లీ

279

గోవా

90

గుజరాత్

860

హర్యానా

181

హిమాచల్ ప్రదేశ్

121

జమ్మూ & కశ్మీర్

75

ఝార్ఖండ్

177

కర్ణాటక

1,248

కేరళ

342

లడాఖ్

7

లక్షద్వీప్

7

మధ్యప్రదేశ్

755

మహారాష్ట్ర

1,144

మణిపూర్

43

మేఘాలయ

19

మిజోరాం

29

నాగాలాండ్

34

ఒడిశా

479

పుదుచ్చేరి

24

పంజాబ్

313

రాజస్థాన్

394

సిక్కిం

22

తమిళనాడు

1,161

తెలంగాణ

302

త్రిపురా

59

ఉత్తరప్రదేశ్

2,346

ఉత్తరాఖండ్

95

పశ్చిమ బెంగాల్

992

మొత్తం

14,939

IBPS క్లర్క్ 2025 ఫలితాలు ఎలా చూడాలి (How to check IBPS Clerk 2025 results)

IBPS క్లర్క్ 2025 ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు ఈ క్రింది విధంగా తమ రిజల్ట్ చెక్ చేయవచ్చు.

  • ముందుగా IBPS అధికారిక వెబ్‌సైట్ www.ibps.in ఓపెన్ చేయండి
  • హోమ్‌పేజీలో “IBPS Clerk 2025 Result” లింక్‌పై క్లిక్ చేయండి
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి
  • మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది
  • ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు

IBPS Clerk 2025 రిక్రూట్‌మెంట్‌లో ఖాళీల సంఖ్య పెరగడంతో వేలాది అభ్యర్థులకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఫలితాలు త్వరలో విడుదలకానున్నందున అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ibps.in ను తరచూ చెక్ చేయాలి. IBPS ఇచ్చే అధికారిక అప్‌డేట్‌లే మాత్రమే నమ్మాలి మరియు నకిలీ సమాచారాన్ని గురికాకుండా జాగ్రతగా ఉండాలి

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ibps-clerk-2025-vacancy-increase-73302/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy