IBPS RRB 2025, 28 గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ & ఆఫీసర్ పోస్టుల వివరాలు ఇవే

manohar

Updated On: September 05, 2025 01:34 PM

IBPS RRB 2025 ప్రకారం ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీ జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 950 స్థానాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

IBPS RRB 2025, 28 గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ & ఆఫీసర్ పోస్టుల వివరాలు ఇవేIBPS RRB 2025, 28 గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ & ఆఫీసర్ పోస్టుల వివరాలు ఇవే

IBPS RRB 2025 గ్రామీణ బ్యాంక్ పరీక్షలు, ముఖ్యమైన వివరాలు, ఎంపిక ప్రక్రియ (IBPS RRB 2025 Gramin Bank Exams, Important Details, Selection Process): IBPS RRB 2025 నోటిఫికేషన్ ప్రకారం, దేశంలోని 28 రూరల్ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ (క్లర్క్) మరియు ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీ కోసం IBPS 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు నిర్వహించబడతాయి. ఆఫీసర్ పోస్టులకోసం అదనంగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.తెలంగాణలో మొత్తం 798 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 450 ఆఫీస్ అసిస్టెంట్లు, 348 ఆఫీసర్లు. ఆంధ్రప్రదేశ్‌లో 152 పోస్టులు, 150 ఆఫీస్ అసిస్టెంట్లు, 2 ఆఫీసర్లు. అభ్యర్థులు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల కోసం క్వాంటిటేటివ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ వంటి విభాగాలపై సన్నద్ధం కావాలి.ఆఫీస్ అసిస్టెంట్ ఎంపిక మెయిన్స్ మార్కుల ఆధారంగా జరుగుతుంది.ఆఫీసర్ పోస్టుల ఎంపిక కోసం మెయిన్స్ + ఇంటర్వ్యూ మార్కులు 80:20 నిష్పత్తిలో తీసుకుంటారు.విజయం సాధించాలంటే స్పష్టమైన లక్ష్యం, సరైన ప్రణాళిక, బలహీన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ, మాక్ టెస్టులు, వేగం, కచ్చితత్వం, రోజువారీ పునశ్చరణ వంటి అంశాలు చాలా ముఖ్యం.

IBPS RRB 2025 నోటిఫికేషన్ ముఖ్య వివరాలు (IBPS RRB 2025 Notification Key Details)

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అభ్యర్థులకు సూచనలు, విద్యార్హత, వయసు, పరీక్ష తేదీల వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

పోస్టు

విద్యార్హత

వయసు

దరఖాస్తు గడువు

ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు

మెయిన్స్ పరీక్ష తేదీలు

ఆఫీస్ అసిస్టెంట్స్

ఏదైనా డిగ్రీ

18–28 ఏళ్ళు

21.9.2025

డిసెంబరు 6,7,13,14

ఫిబ్రవరి 1, 2026

ఆఫీసర్లు (స్కేల్-1)

ఏదైనా డిగ్రీ

18–30 ఏళ్ళు

21.9.2025

డిసెంబరు 22,23c

డిసెంబరు 28

IBPS RRB 2025 డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వివరాలు (IBPS RRB 2025 Documents Verification Details)

  • అన్ని అసలు సర్టిఫికెట్లు , ఫోటో కాపీలు సరిపోయేలా తీసుకురావాలి.
  • ఆర్హత, వయసు, రేషన్/ఆధార్/పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు పత్రాలు చూపించాలి.
  • అభ్యర్థి గుర్తింపు కోసం మూడవ ఫోటో ID అవసరం (Aadhar, PAN, Driving License).
  • దరఖాస్తులో ఇచ్చిన వివరాలు సరియైనవో వేరీఫై చేయబడతాయి.
  • వెరిఫికేషన్ సమయంలో ఏదైనా లోపం ఉంటే అభ్యర్థి అర్హత కోల్పోవచ్చు.

పరీక్షలకి ప్రిపేర్ అవ్వడానికి ముఖ్యమైన విషయాలు (Important things to prepare for exams)

  • విజయం సాధించాలనే దృఢ సంకల్పం ఉండాలి.
  • ప్రతిరోజూ చదివే అంశాలను ముందే నిర్ణయించి అమలు చేయాలి, వీక్లీ ప్లాన్ కూడా రూపొందించాలి.
  • బేసిక్ కాన్సెప్ట్‌లు బాగా తెలుసుకోవాలి.
  • బలహీన అంశాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
  • సాధనలో బలాలు, బలహీనతలను తెలుసుకోవడానికి మాక్ టెస్టులు రాయాలి.
  • షార్ట్‌కట్ పద్ధతులు నేర్చుకుని వేగంగా ప్రశ్నలు పరిష్కరించగలగాలి.
  • ముఖ్య సంఖ్యా సమాచారం: 20 వరకు ఎక్కాలు, 15–30 వరకు ఘనాలు గుర్తుంచుకోవాలి.
  • ప్రతిరోజూ వార్తలు చదివి ముఖ్య అంశాలను నోట్స్ చేయాలి; వారాంతంలో రివిజన్ చేయాలి.
  • రోజూ చదివిన అంశాలను పునశ్చరణ చేయాలి.

IBPS RRB 2025 గ్రామీణ బ్యాంకుల ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ పోస్టుల కోసం సరైన ప్రణాళిక, నిరంతర సాధన, మాక్ టెస్టులు,,దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యమే. పాటించడం ద్వారా అభ్యర్థులు విజయవంతంగా ఈ పోస్టుల్లో చేరవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ibps-rrb-2025-office-assistant-officer-posts-details-70764/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy