IGNOU డిసెంబర్ 2025 టర్మ్ ఎండ్ ఎగ్జామ్స్ డేట్ షీట్ విడుదల

manohar

Published On:

IGNOU డిసెంబర్ 2025 TEE డేట్ షీట్ అధికారికంగా విడుదలైంది. విద్యార్థులు పరీక్ష తేదీలను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

IGNOU డిసెంబర్ 2025 టర్మ్ ఎండ్ ఎగ్జామ్స్ డేట్ షీట్ విడుదలIGNOU డిసెంబర్ 2025 టర్మ్ ఎండ్ ఎగ్జామ్స్ డేట్ షీట్ విడుదల

డిసెంబర్ 2025 TEE డేట్ షీట్, ముఖ్యమైన తేదీలు, డౌన్లోడ్ విధానం, సూచనలు (December 2025 TEE Date Sheet, Important Dates, Download Method, Instructions): ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) డిసెంబర్ 2025 టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్ (TEE) డేట్ షీట్ అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలు డిసెంబర్ 1,2025 నుండి జనవరి 8,2026 వరకు జరుగుతాయి. ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు, అలాగే మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:00 వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించబడతాయి. UG, PG, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల కోసం ప్రత్యేక పరీక్ష తేదీలు, కోర్సు కోడ్లు మరియు సమయాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తాము నేర్చుకుంటున్న కోర్సుకు సంబంధించిన అసైన్‌మెంట్‌లను సమయానికి సమర్పించడంతో పాటు, నిర్ణయించబడిన కోర్సు కాలవ్యవధి పూర్తిచేయడం వంటి అర్హతలు ఉండాలి. పూర్తి డేట్ షీట్‌ను IGNOU అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, మరియు హాల్ టికెట్ లేకుండా పరీక్ష కేంద్రంలో ప్రవేశం అనుమతించబడదు. ఈ షెడ్యూల్ విద్యార్థులు తమ పరీక్షలకు సమయానుగుణంగా సిద్ధమవ్వడానికి, పరీక్ష ఫారమ్ సమర్పణ తేదీలను గమనించడానికి ,సెంటర్ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

డిసెంబర్ 2025 TEE ముఖ్యమైన తేదీలు (December 2025 TEE Important Dates)

ఈ క్రింద IGNOU డిసెంబర్ 2025 TEEకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇవ్వబడ్డాయి.

వివరాలు

తేదీలు

పరీక్ష ఫారమ్ ప్రారంభం తేదీ

సెప్టెంబర్ 10,2025

పరీక్ష ఫారమ్ చివరి తేదీ (ఆలస్య ఫీజుతో)

అక్టోబర్ 30, 2025

హాల్ టికెట్ విడుదల తేదీ

నవంబర్ 24, 2025

పరీక్షలు ప్రారంభం తేదీ

డిసెంబర్ 1, 2025

పరీక్షలు ముగింపు తేదీ

జనవరి 8, 2026

ఫలితాల విడుదల తేదీ (అంచనా)

జూన్ లేదా జూలై , 2026

డిసెంబర్ 2025 TEE డేట్ షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలి ? (How to download December 2025 TEE date sheet?)

అభ్యర్థులు IGNOU అధికారిక వెబ్‌సైట్ నుండి డేట్ షీట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ క్రింద ఉన్న దశలను పాటించండి.

  • ముందుగా IGNOU అధికారిక వెబ్‌సైట్ కి వెళ్ళండి.
  • ఆ తరువాత "డేట్ షీట్ డిసెంబర్ 2025 TEE" లింక్‌పై క్లిక్ చేయండి.
  • PDF డేట్ షీట్ తెరపై కనిపిస్తుంది.
  • దానిని డౌన్లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.

డిసెంబర్ 2025 TEE ముఖ్య సూచనలు (December 2025 TEE Key Notes)

విద్యార్థులు ఈ సూచనలను తప్పకుండా గమనించాలి.

  • పరీక్ష తేదీలు లేదా సమయాల్లో మార్పు అయితే రీజనల్ సెంటర్‌ను సంప్రదించండి.
  • హాల్ టికెట్ లేకుండా పరీక్ష కేంద్రంలో ప్రవేశం లేదు.
  • పరీక్ష ఫారమ్ సమర్పణలో ఆలస్యం చేయకండి, చివరి తేదీని గమనించండి.
  • కోర్సు ఆధారంగా ప్రత్యేక పరీక్ష తేదీలను షెడ్యూల్‌లో చూసుకోండి.

IGNOU డిసెంబర్ 2025 TEE డేట్ షీట్ విడుదలతో విద్యార్థులు వాళ్లు పరీక్షలకు ముందుగానే రెడీ అవొచ్చు. హాల్ టికెట్, అసైన్‌మెంట్లు, షెడ్యూల్‌లోని వివరాలను గమనించడం చాలా ముఖ్యం. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డేట్ షీట్ డౌన్‌లోడ్ చేసి, సమయానికి సిద్ధమైతే పరీక్షలు సులభంగా పూర్తి చేయవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ignou-december-2025-tee-date-sheet-release-70155/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top