IGNOU జనవరి 2026 రీ-రిజిస్ట్రేషన్ గడువు మళ్ళీ పొడిగింపు, మార్చి 15 వరకు అవకాశం

manohar

Published On:

IGNOU జనవరి 2026 సెషన్ కు  రీ-రిజిస్ట్రేషన్ గడువును మార్చి 15,2026 వరకు పొడిగించబడింది. ఆలస్య రుసుము రూ. 200తో విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

IGNOU Extends January 2026 Re-Registation Deadline to March 15; Check Key Details HereIGNOU Extends January 2026 Re-Registation Deadline to March 15; Check Key Details Here

IGNOU జనవరి 2026 రీ-రిజిస్ట్రేషన్ గడువు మార్చి 15 వరకు పొడిగింపు వివరాలు (IGNOU January 2026 Re-Registration Deadline Extended to March 15 Details): జాతీయ స్థాయి ఓపెన్ యూనివర్సిటీలలో ప్రముఖమైన ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) జనవరి 2026 సెషన్ రీ-రిజిస్ట్రేషన్ గడువును మరోసారి పొడిగించింది. గతంలో పలుమార్లు గడువులు పొడిగించిన విశ్వవిద్యాలయం, ఇప్పుడు విద్యార్థుల సౌకర్యానికి మార్చి 15, 2026 వరకు దరఖాస్తు చేసేలా అవకాశం ఇచ్చింది. దీనితో ఇప్పటివరకు రీ-రిజిస్ట్రేషన్ చేయని విద్యార్థులకు మరో సారి అవకాశం లభించింది. ఓపెన్ మరియు డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) మరియు ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లలో కొనసాగుతున్న కోర్సులకు విద్యార్థులు తిరిగి నమోదు కావచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేయాలి. అయితే ఈ పొడిగింపు సమయంలో నమోదు చేసుకునే వారికి రూ.200 ఆలస్యం రుసుము వర్తిస్తుందని విశ్వవిద్యాలయం తెలిపింది.

మొదట రీ-రిజిస్ట్రేషన్ చివరి తేదీ జనవరి 31, 2026గా నిర్ణయించగా, ఆ తర్వాత ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. తాజాగా మార్చి 15 వరకు మరోసారి పొడిగించడం ద్వారా దేశీయ మరియు అంతర్జాతీయ విద్యార్థులందరికీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించారు. ఈ పొడిగింపు సెమిస్టర్ ఆధారిత కోర్సులు మరియు సర్టిఫికెట్ కోర్సులకు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. మిగతా అన్ని ప్రకటించిన ప్రోగ్రామ్‌లకే ఈ రీ-రిజిస్ట్రేషన్ గడువు వర్తింపబడుతుంది. అందుకే విద్యార్థులు ఆలస్యం చేయకుండా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

IGNOU జనవరి 2026 రీ-రిజిస్ట్రేషన్ ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply for IGNOU January 2026 re-registration?)

జనవరి 2026 సెషన్ రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే విద్యార్థులు క్రింది దశలను పాటించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలో కనిపించే రీ-రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ IGNOU యూజర్ ID, పాస్ వర్డ్ మరియు సెక్యూరిటీ కోడ్ తో లాగిన్ అవ్వండి.
  • లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫారంలో కావాల్సిన వివరాలు నమోదు చేయండి.
  • సంబంధిత కోర్సును ఎంచుకుని వివరాలను ధృవీకరించండి.
  • రీ-రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు రూ.200 లేట్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
  • చివరగా ఫారాన్ని సమర్పించి కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ లేదా ప్రింట్ తీసుకోండి

IGNOU జనవరి 2026 రీ-రిజిస్ట్రేషన్‌కు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు (Important documents required for IGNOU January 2026 re-registration)

IGNOU దరఖాస్తు పూర్తి చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్ల స్కాన్ కాపీలను సిద్ధం చేయాలి.

  • తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (100 KB లోపు)
  • సంతకం స్కాన్ కాపీ (100 KB లోపు)
  • విద్యార్హత సర్టిఫికెట్స్ (మార్క్ షీట్స్ / డిగ్రీ సర్టిఫికేట్లు)
  • అవసరమైతే అనుభవం సర్టిఫికేట్
  • కేటగిరీ సర్టిఫికెట్ (SC / ST / OBC అభ్యర్థులకు)

IGNOU జనవరి 2026 రీ-రిజిస్ట్రేషన్ గడువు మార్చి 15 వరకు పొడిగించబడటంతో ఇది విద్యార్థులకు మంచి అవకాశం. ఇంకా నమోదు చేయని వారు ఆలస్యం చేయకూండా ,అధికారిక వెబ్‌సైట్‌లో రీ-రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ignou-january-2026-re-registration-deadline-extended-march-15-77948/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top