JEE Advanced Admit Card 2023: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 అడ్మిట్ కార్డులు రిలీజ్, ఈ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి

Andaluri Veni

Updated On: May 29, 2023 02:18 pm IST

జేఈఈ   అడ్వాన్స్‌డ్  2023 అడ్మిట్ కార్డులు (JEE Advanced Admit Card 2023) విడుదలయ్యాయి. జూన్ 04, 2023న జరగబోయే పరీక్ష కోసం ఈ అడ్మిట్ కార్డులను విడుదల చేయడం జరిగింది. ఈ దిగువున ఇచ్చిన డైరక్ట్ లింక్ ద్వారా అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
JEE Advanced Admit Card 2023:  జేఈఈ అడ్వాన్స్‌డ్  2023 అడ్మిట్ కార్డులు రిలీజ్, ఈ లింక్‌తో  డౌన్‌లోడ్ చేసుకోండిJEE Advanced Admit Card 2023: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 అడ్మిట్ కార్డులు రిలీజ్, ఈ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి

JEE Advanced 2023 అడ్మిట్ కార్డులు (JEE Advanced Admit Card 2023): JEE Advanced 2023 అడ్మిట్ కార్డులు  (JEE Advanced admit card 2023) ఈరోజు (మే 29) రిలీజ్ అయ్యాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ 2023 కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలతో jeeadv.ac.inకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ దిగువున డైరక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. కాగా జేఈఈ అడ్వాన్సడ్ పరీక్ష జూన్ నాలుగో తేదీన జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. ఈ ఎగ్జామ్‌కు సంబంధించిన రెస్పాన్స్ షీట్లను జూన్ 9న వెబ్‌సైట్లో ఉంచుతుంది. ఆన్సర్ కీ జూన్ 11, జూన్ 18న ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 

JEE అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డుల: డౌన్‌లోడ్ లింక్


JEE అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to download JEE Advanced Admit Card)

జేఈఈ అడ్వాన్స్‌డ్  అడ్మిట్ కార్డులను పైన అదజేసిన డైరక్ట్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది కాకుండా అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ విధానాన్ని ఈ దిగువున అందజేయడం జరిగింది. 
  • అభ్యర్థులు ముందుగా అధికాారిక వెబ్‌సైట్‌కి jeeadv.ac.in వెళ్లాలి. 
  • హోంపేజీలో అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి. 
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో అడిగిన వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వండి.
  • తర్వాత అడ్మిట్ కార్డులు ఓపెన్ అవుతుంది. దానిని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. 

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు దానిపై ఇచ్చిన సూచనలు జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా అడ్మిట్ కార్డులు తమ వివరాలన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. 

పరీక్ష రోజున JEE అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డ్‌ను A4 సైజు పేపర్‌పై ప్రింట్ తీసుకుని వెళ్లాలి. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డ్‌‌పై ఇచ్చిన ప్లేస్‌పై ఫోటో IDని జత చేసి తీసుకెళ్లాలి. JEE అడ్వాన్స్‌డ్ 2023 కోసం ప్రాక్టీస్ చేసుకునేందుకు ఐఐటీ గౌహతి అధికారిక వెబ్‌సైట్‌లో మాక్ టెస్ట్‌లను పొందుపరిచింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్‌సైట్‌‌లోకి వెళ్లి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/jee-advanced-2023-admit-card-released-download-link-here-41164/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

ఎగ్జామ్ అప్డేట్ మిస్ అవ్వకండి !!

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!