JEE మెయిన్స్ 2026 జనవరి సెషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ముఖ్యమైన తేదీలు, డాక్యూమెంట్స్, దరఖాస్తు విధానం వివరాలు

manohar

Published On:

JEE మెయిన్స్ 2026 జనవరి సెషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 27, 2025.రిజిస్ట్రేషన్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

JEE Mains 2026 Registration Underway; Documents Required to ApplyJEE Mains 2026 Registration Underway; Documents Required to Apply

JEE మెయిన్స్ 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం (JEE Mains 2026 registration begins): జాతీయ పరీక్షా సంస్థ (NTA) JEE మెయిన్స్ 2026 జనవరి సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా దరఖాస్తు చేయవచ్చు. రిజిస్ట్రేషన్ అక్టోబర్ 31, 2025న ప్రారంభమై నవంబర్ 27, 2025 రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఫీజు చెల్లించడానికి చివరి సమయం ఆ రోజే రాత్రి 11:50 వరకు ఉంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్ జనవరి 2026 తొలి వారంలో విడుదల చేయబడుతుంది, అడ్మిట్ కార్డులు పరీక్ష‌కు 3 నుండి 4 రోజుల ముందు అందుబాటులోకి వస్తాయి. పరీక్షలు జనవరి 21 నుంచి 30 వరకు జరుగుతాయి. ఫలితాలు ఫిబ్రవరి 12, 2026లోపు ప్రకటిస్తారని NTA తెలిపింది. అభ్యర్థులు ఫోటో, సంతకం, విద్యా సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి ఆన్‌లైన్ ఫీజు చెల్లించి దరఖాస్తును పూర్తి చేయాలి.

JEE మెయిన్స్ 2026కి దరఖాస్తు ఎలా చేయాలి (How to apply for JEE Mains 2026)

JEE మెయిన్స్ 2026కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఈ క్రింద ఉన్న దశలను పాటించండి.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inకి వెళ్లండి
  • ఆ తరువాత “JEE Main Session 1 Registration” లింక్‌పై క్లిక్ చేయండి
  • మీ వ్యక్తిగత వివరాలు, మొబైల్ నంబర్, ఈమెయిల్ నమోదు చేయండి
  • రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో అవసరమైన సమాచారం పూర్తి చేయండి
  • ఫోటో, సంతకం అప్లోడ్ చేయండి
  • అప్లికేషన్ ఫీజు చెల్లించండి
  • కన్ఫర్మేషన్ పేజీ డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోండి

JEE మెయిన్స్ 2026 ముఖ్యమైన తేదీలు (JEE Mains 2026 Important Dates)

JEE మెయిన్స్ 2026 జనవరి సెషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

వివరాలు

తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ

అక్టోబర్ 31, 2025

దరఖాస్తు చివరి తేదీ

వంబర్ 27, 2025 (రాత్రి 9:00 వరకు)

ఫీజు చెల్లింపు చివరి తేదీ

నవంబర్ 27, 2025 (రాత్రి 11:50 వరకు)

సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల తేదీ

జనవరి 2026 మొదటి వారం (తాత్కాలికంగా)

అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ

పరీక్షకు 3–4 రోజుల ముందు

పరీక్షా తేదీలు

జనవరి 21 నుండి 30, 2026 వరకు

సమాధాన కీ విడుదల తేదీ

పరీక్ష అనంతరం NTA వెబ్‌సైట్‌లో

ఫలితాల ప్రకటన తేదీ

ఫిబ్రవరి 12, 2026లోపు


JEE మెయిన్స్ 2026 దేశంలో ఇంజనీరింగ్ ప్రవేశానికి ముఖ్యమైన పరీక్ష. ఆసక్తి ఉన్న విద్యార్థులు సమయానికి దరఖాస్తు చేసుకోవాలి మరియు అధికారిక వెబ్‌సైట్‌లో తాజా సమాచారం కోసం తరుచుగా వెబ్‌సైట్ ని తనిఖీ చేస్తూ ఉండాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/jee-main-2026-january-session-registration-73536/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top