JEE మెయిన్‑2026 సెషన్ - 2 షెడ్యూల్ విడుదల, ఏప్రిల్ 2 నుంచి చివరి విడత పరీక్షలు

manohar

Published On:

JEE మెయిన్‑2026 సెషన్ - 2 పరీక్షలు ఏప్రిల్ 2 నుండి 8 వరకు నిర్వహించనున్నట్లు NDA ప్రకటించింది. అభ్యర్థుల కోసం సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల చేయడంతో పరీక్ష కేంద్ర నగర వివరాలు ముందుగానే తెలుసుకోవచ్చు.

JEE Main Exams 2026JEE Main Exams 2026

JEE మెయిన్‑2026 చివరి విడత పరీక్షలు ప్రారంభం (JEE Main 2026 final phase exams begin): జాతీయ స్థాయిలో జరిగే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష JEE మెయిన్‑2026 గురించి తాజా అప్డేట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పరీక్షకు సిద్దమవుతున్న లక్షలాది విద్యార్థులకు ఇది ముఖ్య సమాచారం. ఎన్టీఏ (NTA) ప్రకారం JEE మెయిన్ సెకండ్ సెషన్ (సెషన్‑2) పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించబడతాయి . దీనితో అభ్యర్థులు తమ తుది ప్రిపరేషన్ పై మరింత దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది.

ఈ పరీక్షలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరుగుతాయి. ప్రతి అభ్యర్థి తన పరీక్ష తేదీ, షిఫ్ట్ టైమింగ్ వంటి వివరాలను అడ్మిట్ కార్డ్ ద్వారా తెలుసుకోవాలి. పరీక్షలు పూర్తిగా కంప్యూటర్‑బేస్డ్ (CBT) రూపంలో ఉంటాయని గమనించండి, కాబట్టి టైం మేనేజ్‌మెంట్ మరియు ఆన్‌లైన్ పరీక్ష విధానంపై అవగాహనతో ప్రిపరేషన్ కావడం చాలా అవసరం.

JEE మెయిన్‑2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్‌లోడ్ లింక్ (JEE Main‑2026 City Intimation Slip Download Link)

JEE మెయిన్ 2026 సెషన్‑2 కి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను ఈ క్రింద ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

JEE మెయిన్ 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? (How to download JEE Main 2026 City Intimation Slip?)

JEE మెయిన్ 2026 అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఈ క్రింది విధముగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ఓపెన్ చేయండి
  • హోమ్‌పేజీలో "City Intimation Slip 2026" లింక్‌పై క్లిక్ చేయండి
  • మీ అప్లికేషన్ నంబర్ నమోదు చేయండి
  • పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి
  • స్క్రీన్‌పై కనిపించే సెక్యూరిటీ పిన్ టైప్ చేయండి
  • "సబ్మిట్" బటన్‌పై క్లిక్ చేయండి
  • మీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • దానిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి

JEE మెయిన్ 2026 అభ్యర్థులకు ముఖ్య సూచనలు (Important instructions for JEE Main 2026 candidates)

JEE మెయిన్ 2026 అభ్యర్థులకు పరీక్షకు ముందు గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు

  • సిటీ ఇంటిమేషన్ స్లిప్ అడ్మిట్ కార్డ్ కాదు.
  • పరీక్షకు హాజరుకావడానికి అడ్మిట్ కార్డ్ తప్పనిసరి.
  • పరీక్ష కేంద్రం ఉన్న నగరాన్ని ముందుగానే తెలుసుకుని ప్రయాణం ప్లాన్ చేయండి.
  • పరీక్ష సమయానికి ముందే కేంద్రానికి చేరుకోండి.
  • చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్ ను తప్పనిసరిగా తీసుకెళ్లండి.
  • పరీక్ష హాల్‌లో నిషిద్ధ వస్తువులు తీసుకువెళ్లకండి.
  • అడ్మిట్ కార్డ్‌పై ఇచ్చిన సూచనలను పూర్తిగా చదవండి.

JEE మెయిన్ 2026 సెషన్ -2 పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో అభ్యర్థులు ముందుగానే సిటీ ఇంటిమేషన్ స్లిప్ ను డౌన్‌లోడ్ చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. సరైన ప్రణాళికతో పరీక్షను రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/jee-main-2026-session-2-exam-schedule-april-78324/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top