JNU MBA 2026 ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. CAT 2025 స్కోర్ ఉన్న అభ్యర్థులు మార్చి 31లోపు ఆన్‌లైన్ లో అప్లై చేయాలి. దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
JNU MBA Admissions 2026JNU MBA అడ్మిషన్లు 2026 ప్రవేశాల వివరాలు (JNU MBA Admissions 2026 Admissions Details): జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) 2026–28 విద్యా సంవత్సరానికి ఎంబీఏ (MBA) ప్రవేశాలు ప్రారంభించింది. ఈ కోర్సును అటల్ బిహారీ వాజ్‌పేపాయీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ (ABVSME) నిర్వహిస్తుంది. మేనేజ్‌మెంట్‌లో ఉన్నత చదువుకోవాలనుకోరుకునే వారికి ఇది మంచి అవకాశంగా ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 31, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రవేశాలకు అర్హత పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా CAT 2025 పరీక్షకు హాజరైన వారు అయి ఉండాలి. CAT స్కోర్ ఆధారంగా మొదట షార్ట్‌లిస్ట్ చేసి, తర్వాత గ్రూప్ డిస్కషన్ (GD) మరియు పర్సనల్ ఇంటర్వ్యూ (PI) ద్వారా తదుపరి దశలకు ఎంపిక చేస్తారు.
ఎంపికలో CAT స్కోర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మొత్తం 70% వెయిట్‌జ్ ఇవ్వబడింది. గ్రూప్ డిస్కషన్‌కు 10% మరియు పర్సనల్ ఇంటర్వ్యూకి 20% వెయిట్‌జ్ కేటాయించారు. ఈ మూడు దశల్లో అభ్యర్థుల ప్రతిభను అంచనా వేసి తుది ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే, జనరల్, EWS, OBC అభ్యర్థులు రూ. 2000 చెల్లించాలి, SC, ST, PwBD అభ్యర్థులకు రూ. 1000 గా నిర్ణయించారు.
JNU MBA 2026 ప్రవేశాల దరఖాస్తు లింక్ (JNU MBA 2026 Admissions Application Link)
JNU MBA 2026 ప్రవేశాలకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయడానికి అధికారిక లింక్ క్రింద ఇవ్వబడింది
JNU MBA 2026 ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (JNU MBA 2026 Online Application Procedure)
JNU MBA 2026 ప్రవేశాలకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ దశలను పాటించి దరఖాస్తు ప్రక్రియ చేయవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ jnuee.jnu.ac.in ను ఓపెన్ చేయండి
- “MBA Admissions 2026” లేదా సంబంధిత లింక్‌పై క్లిక్ చేయండి
- కొత్త యూజర్ అయితే Email, Mobile Number తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయండి
- వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, CAT 2025 వివరాలు నమోదు చేయండి
- అవసరమైన పత్రాలు (ఫోటో, సంతకం, మార్క్స్ మెమోలు, CAT స్కోర్ కార్డ్) అప్లోడ్ చేయండి
- దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి
- అన్ని వివరాలు చెక్ చేసి ఫారమ్ సబ్మిట్ చేయండి
- భవిష్యత్తు కోసం అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ లేదా ప్రింట్ తీసుకోవాలి
JNU MBA-2026 ప్రవేశాలు మంచి అవకాశం. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసి, ఎంపిక దశలకు సిద్ధం కావడం మంచిది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

